10 తరగతి పాసైతేనే పెళ్లికానుక ఇస్తామనటం సిగ్గుచేటు
- 35 Views
- admin
- May 5, 2023
- తాజా వార్తలు
విలీనం పేరుతో 15 వేల పాఠశాలలను మూసేసిన జగన్.. 10 తరగతి పాసైతేనే పెళ్లికానుక ఇస్తామనటం సిగ్గుచేటని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. పళ్లికానుక పెండిరగ్ నిధులన్నీ విడుదల చేస్తామని 2019 జోవో 105 ఇచ్చారని.. కానీ ఇప్పటి వరకు ఒక్కరికీ ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. తర్వాత పిభ్రవరిలో 4500 మందికి పెళ్లికానుక ఇస్తున్నట్టు సీఎం బటన్ నొక్కారని.. ఇప్పటికీ ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ బటన్ నొక్కి డబ్బులిస్తున్నామంటూ మరో నాటకం ఆడుతున్నార న్నారు. కళ్యాణ మిత్రలకు వేతనాలు రూ. 43 కోట్లు బకాయిలున్నాయని తెలిపారు. సాక్షి పత్రికకు ప్రకటనల పేరుతో ప్రజాధనం దోచిపెట్టడం తప్ప నాలుగేళ్లలో ఒక్కరికైనా పెళ్లికానుక కింద ఒక్క రూపాjైునా ఇచ్చారా అని ప్రశ్నించారు. టీడీపీ సన్ రైజ్ పార్టీ అయితే వైసీపీ గుడ్లగూబల పార్టీ అని అన్నారు. చంద్రబాబు సూర్యుడు లాంటి వారని.. ఆయన వెలుగును వైసీపీ నేతలు చూడలేరన్నారు. అందుకే చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేస్తున్నారంటూ పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మ్యానిపెస్టోలో ప్రకటించిన 100 పధకాలు జగన్ ఎగ్గొట్టారని విమర్శించారు. నాలుగేళ్ల పాటు నిద్రపోయి ఎన్నికల ముందు కళ్యాణమస్తు అంటూ డ్రామాకు తెరతీశారన్నారు. నాడు లోటు బడ్జెట్లో కూడా పెళ్లికానుక కింద రూ.307 కోట్లు ఖర్చు చేసిన ఘనత టీడీపీదే అని చెప్పుకొచ్చారు. టీడీపీ హయాంలో రేషన్ కార్డే ప్రామాణికంగా పెళ్లిపీటల మీదే వధూవరులకు పెళ్లికానుక అందజేశామన్నారు. జగన్ రెడ్డి కఠిన నిభందనలు పెట్టి లబ్దిదారుల సంఖ్యను తగ్గిస్తున్నారని అన్నారు. రూ.10 వేలకు మించి ఆదాయం ఉన్నా, 300 యూనిట్లు విద్యుత్ వాడినా పధకానికి అనర్హులంట అంటూ మండిపడ్డారు. ఏపీకి చెందనివారైత పెళ్లికానుక ఇవ్వరా? పక్క రాష్ట్రాల వారిని పెళ్లి చేసుకోకూడదా ? అని టీడీపీ నేత ప్రశ్నించారు.


