12 నుంచి ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్
- 89 Views
- wadminw
- January 4, 2017
- Home Slider స్థానికం
ఈ నెల 12 నుండి 15 వరకు నిర్వహించనున్న ఎన్టిఆర్ బీచ్ ఫెస్టివల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించేందుకు ఆసక్తిగల యువతీయువకులు, కాలేజీ విద్యార్ధినీ,విద్యార్ధులు 6వ తేదీ లోగా తమ వివరాలు నమోదు చేసుకోవాలని సెట్రాజ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వై.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. యువతీయువకులలో దాగివున్న సాంస్కృతిక కళలు, ఇతర ప్రతిభలను వెలికి తీసేందుకు ఒక వేదిక ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ వేదిక పై భరత నాట్యం, కూచిపూడి, కధాకలి మొదలైన శాస్త్రీయ నృత్యాలు, మృదంగం, తబలా, గిటార్, వీణా, జనపద నృత్యాలు, జానపద గితాలు(బృందాలు) వంటి ప్రద ర్శించడంజరుగుతుందన్నారు.
అలాగే మిమిక్రీ, మ్యాజిక్, వెంట్రటిలాక్విజమ్, మోడరన్ నృత్యాలు వంటివి కూడా ప్రదర్శించవచ్చని ఆయన తెలిపారు. ఈ ప్రదర్శనలు ప్రతీ రోజు ఉ.11 గంటల నుండి మ.12.30 గంటల వరకు, మ.3 గంటల నుండి సా. 5 గంటలవరకు నిర్వహిస్తారన్నారు . ఈ ప్రదర్శనలలో పాల్గొనే యువతీయువకులకు ప్రశంసాపత్రం, మెమెంటోలు అందచేయడం జరుగుతుందన్నారు. ఆసక్తిగల యువతీయువకులు తమ పేరు, ఊరు, మొబైల్ నెంబరు, ప్రదర్శించే అంశముల వివరాలు తమ కళాశాల ద్వారా గానీ, నేరుగా లేదా మెయిల్ ద్వారా గానీ ఈ నెల 6వ తేదీ లోగా నమోదు చేసుకోవాలని సెట్రాజ్ సిఇఓ శ్రీనివాసరావు తెలియజేశారు.


