15 నుంచి అడవుల జిల్లాలో గిరిజన ఉత్సవం
ఆదిలాబాద్: జిల్లాలో గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు మూడు రోజులపాటు గిరి ఉత్సవ పేరిట కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఉట్నూరులో ఈనెల 15, 16, 17 తేదీల్లో సాంస్కృత ప్రదర్శనలను నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఐటిడిఎ సీఈవో ఆర్వి కల్నల్ పేర్కొన్నారు. ఎంతో ఘనమైన గిరిజన సంప్రదాయాలను బాహ్య ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ గిరి ఉత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు.
ఈనెల 15న ఉట్నూరులోని కొమరంభీమ్ ప్రాంగణంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనే వారికి గుర్తింపు కార్డులతో పాటు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాలను ఆదివాసీ గిరిజన సంఘాల సమన్వయంతో విజయవంతం చేసేలా అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని కోరారు.
Categories

Recent Posts

