1500 మంది రామ్ యుద్ధం
రామ్ హీరోగా బోయపాటి ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఫైట్ మాస్టర్ శివ అధ్వర్యంలో బుధవారం నుంచి ఈ యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారు.1500 మంది ఫైటర్లు ఈ సీన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తరువాత ఈ సినిమా టీమ్ ఫారిన్ వెళ్లనుందని తెలుస్తోంది. ఫారిన్ లో ప్రధానమైన పాత్రల కాంబినేషన్లోని సన్నివేశాలను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. తమన్ బాణీలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్‌గా నిలవనున్నట్టు చెబుతున్నారు. అభిమానుల అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందనేది చూడాలి. బోయపాటి సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఏ రేంజ్ లో ఉంటాయనేది తెలిసిందే. అదే రేంజ్లో ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ ను కూడా ఆయన డిజైన్ చేయించాడు. ఆ భారీ యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరించే పనిలో బోయపాటి ఉన్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.


