సాంకేతికత ప్రగతిని పరిచయం చేసిన నిపుణులు
- 19 Views
- December 15, 2016
- జాతీయం
విశాఖపట్నం, డిసెంబర్ 14 (న్యూస్‌టైమ్): నూతన ఆలోచనలతో పనిచేయడమే ఆవిష్కరణలకు నాంది పలుకుతుందని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి ప్రభుజోత్ సింగ్ భక్షి అన్నారు. బుధవారం ఉదయం ఏయూ స్నాతకోత్సవ మందిరంలో మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ నిర్వహిస్తున్న డిజిటల్ సమ్మిట్ మూడో రోజు కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు విద్యార్థులు నూతన సాంకేతితను పరిచయం చేశారు. ఈ సందర్భంగా భక్షి మాట్లాడుతూ ‘ ఐఓటి విత్ క్లౌడ్ అర్ బెటర్ టుగెదర్ టు బిజినెస్ ఇన్నోవేటివ్’ అంశంపై ప్రసంగించారు. నిర్ణయం తీసుకునే ముందు అవసరమైన సమాచారం పొందడం, విశ్లేషణ జరపడం, క్లిష్టమైన ఆలోచన నైపుణ్యాలతో పనిచేయాలని సూచించారు. భవిష్యత్తును ఐఓటి ప్రభావితం చేస్తోందన్నారు.
దీనిపై పలువురు విద్యార్థులను వేఇకపైకి పిలచి స్వయంగా ఆచరణలో చూపించారు. డిజిటల్ బిజినెస్, ప్రస్తుత ఇ బిజినెస్‌కు భిన్నంగా ఉంటుందన్నారు. ప్రజలు, వస్తువులు, వ్యాపారం అనే మూడు అంశాలను ఆధారంగా చేసుకుని ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. విభిన్న సాంకేతికతు సమన్వయం జరుపుతూ ఐఓటి పనిచేస్తుందన్నారు. క్లౌడ్ అనువర్తనాలు ప్రపంచ వ్యాప్తంగా వినియోగాన్ని విపులంగా తెలియజేశారు. మైక్రోసాఫ్ట్‌కు చెందిన రితేష్ మోడి డెవలపర్స్ లక్షణాలు వివరించారు.
విభిన్న అంశాలపై పరిజ్ఞానం కలిగి ఉండటం, డేటాబేస్ పొందడం, విభిన్న ఆపరేటింగ్ సిస్టమ్స్‌పై పనిచేసే సామర్ధ్యం కలిగి ఉండాలన్నారు. నేడు లక్షలాది మంది వినియోగదారులు నూతనంగా పరిచడం అవుతున్నారన్నారు. ఈ కామర్స్ రంగం నేడు ఫిజికల్ సర్వర్ నుంచి వర్చువల్ సర్వర్ దిశగా పయనిస్తోందన్నారు. ఖర్చు తక్కువగా ఉండటం, అనుసంధానించడానికి అనువుగా ఉండటంతో వీటికి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. అధికశాతం సమస్యలకు వర్చువలైజేషన్ పరిష్కారం చూపుతోందన్నారు.
మైక్రోసాఫ్ట్‌కు చెందిన అభిజిత్ జానా, మిరాకిల్ డైరెక్టర్ చాణక్య లోకం తదితరులు సాంకేతిక మార్పులు, ఆవిష్కరణలపై ప్రసంగించారు. కార్యక్రమానికి రాష్ట్రంలోని విభిన్న కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయంత్రం నిర్వహించిన సాంసృతిక కార్యక్రమాలు అలరించాయి. గోలివాడ పంప్‌హౌస్ పనులు ప్రారంభించిన ఆర్టీసీ చైర్మన్ కరీంనగర్,డిసెంబర్ 14 (ఎపిఇఎంఎస్): అంతర్గామం మండలంలోని గోలివాడలో నిర్మిస్తున్న పంప్‌హౌస్ పనులను ఆర్టీసీ చైర్మన సోమారపు సత్యనారాయణ బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కాళేశ్వరం, మేడిగడ్డ పంప్‌హౌస్‌ల ద్వారా వచ్చే నీటిని గోలివాడ పంప్‌హౌస్‌కు సరఫరా జరుగుతుందని అన్నారు.
ఈ నీటిని గ్రామాల ప్రజలు తాగునీటిగాను రైతులకుసాగునీటిగాను ఉపయోగ పడుతుందని అన్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంతంలో ఇలాంటి అభివృద్ధి పనులను చేపట్టలేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల దాహార్తిని తీర్చేందుకు పంటలకు సాగునీటి అందించేందుకు పంప్‌హౌస్ పనులు చేపడుతుందని అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు కాళేశ్వరం, ముక్తేశ్వరం ప్రాజెక్టుల నీటిని ఉపయోగించుకోవచ్చునిన, అలాగే ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు నీటిని లక్షల ఎకరాలకు సాగునీటిగా ఉపయోగించుకోవచ్చన్న దృష్టితోనే ముఖ్యమంత్రి అహర్నిషలు కృషి చేస్తున్నారని సత్యనారాయణ అన్నారు.
అభివృద్ధి పనులను చూసి ఓరవలేకనే ప్రతిపక్షాలు ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రిపైనా బుదరజల్లె ప్రయత్నాలు చేస్తున్నారని సత్యనారాయణ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి రేయింబవళ్లు ఎలా కష్టపడి సాధించారో తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కూడా అదే తరహాలో కృషి చేస్తున్నారని అన్నారు. తమ ప్రభుత్వం ప్రజల పక్షపాతిదని అన్నారు. రైతుల, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు సంద్యారాణి, ఎంపిపి రాజేషం, సర్పంచ్ రమ్య, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


