మీకు తెలుసా?
- 16 Views
- January 18, 2017
- Home Slider అంతర్జాతీయం
చాంగ్ ఈ 3… ఒక చంద్ర మండల శోధన మిషన్, ఒక రోబోటిక్ లాండర్, రోవర్‌తో ఉన్న దీనిని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహిస్తుంది. చైనీస్ చంద్ర అన్వేషణ కార్యక్రమం రెండవ దశ భాగంగా 1 డిసెంబర్ 2013న చాంగ్ ఈ 3 విజయవంతంగా ప్రారంభించబడింది. ఇది చైనా ప్రయోగించిన మొదటి చంద్ర రోవర్ అవుతుంది. 1976లోని సోవియట్ లూనా 24 మిషన్ తరువాత 37 సంవత్సరాలలో చంద్రునిపై సున్నితంగా దిగేందుకు చేయబడిన మొదటి అంతరిక్ష నౌక.
దీనికి చాంగ్ ఈ అని చైనీస్ పురాణ చంద్రుడి దేవత పేరు పెట్టారు. చాంగ్ ఈ 1, చాంగ్ ఈ 2 చంద్ర ఆర్బిటర్స్కు తదుపరిది. ఈ చంద్ర ప్రోబ్‌ను యుతు (కుందేలు) లేదా జాడే రాబిట్ అని కూడా అంటారు. ఈ పేరును ఆన్లైన్ పోలింగ్ ద్వారా ఎంపిక చేశారు. ఈ పేరు చైనీస్ పురాణం ప్రకారం వచ్చింది, చైనీస్ పురాణం ప్రకారం ఒక తెల్ల కుందేలు చంద్రునిపై జీవిస్తుంటుంది. యుతు రోవర్ ఉన్న చాంగ్ ఈ 3 ప్రయోగంతో రోవర్లను పంపిన దేశాలలో అమెరికా, రష్యా తరువాత చైనా మూడవ దేశంగా నిలిచింది. చాంగ్ ఈ 3 ఒక చంద్ర రోవర్ కలిగి వుంటుంది, ఈ రోవర్ లాండర్ నుండి విస్తరించడానికి, స్వతంత్రంగా చంద్రుని ఉపరితలం అన్వేషించడానికి రూపొందించబడింది.
ఈ ఆరు చక్రాలు కలిగిన రోవర్ అభివృద్ధి షాంఘై ఏరోస్పేస్ సిస్టమ్ ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూట్ నందు 2002లో ప్రారంభమైంది. మే 2010లో పూర్తయింది. రోవర్ నిలబడినపుడు ఎత్తు 1.5 మీటర్లు (4.9 అడుగులు) ఉంటుంది. బరువు సుమారు 120 కిలోలు ఉంటుంది. ఇది సుమారు 20 కిలోల పేలోడ్ (మోయగల బరువు) సామర్థ్యం కలిగి ఉంటుంది, ఈ రోవర్ వాస్తవ సమయంలో వీడియో ప్రసారం చేస్తుంది, త్రవ్వ గలుగుతుంది, మట్టి నమూనాలపై సాధారణ విశ్లేషణలు చేయగలుగుతుంది.
దీనికి ఉన్న ఆటోమేటిక్ సెన్సార్ల వలన ఇది ఇతర వస్తువులతో ఢీ కొనకుండా చక్కగా నావిగేట్ చేయగలదు (ప్రయాణించగలదు). దీనికి కావలసిన శక్తి దీనికి అమర్చబడిన సోలార్ ప్యానెల్ ద్వారా అందించబడుతుంది. ఆరు చక్రాలు కలిగిన ఈ రోవర్ 3 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో దాని 3 నెలల మిషన్ సమయంలో గరిష్టంగా 10 కిలోమీటర్లు (6.2 మైలు) ప్రయాణించి అన్వేషించేలా రూపొందించబడింది. ఇక, టైటన్ గురించి చెప్పుకోవాల్సి వస్తే… ఇది శని సహజ ఉపగ్రహాల లోకెల్లా అతి పెద్దది.
మొత్తం సౌరకుటుంబంలో దట్టమైన వాయుమండలం గల సహజ ఉపగ్రహం ఇదొక్కటే. ఇది శని గ్రహం నుండి ఆరో స్థానంలో వున్న దీర్ఘగోళాకార చందమామ. పేరుకి ఉపగ్రహమే అయినా దీనికి గ్రహం వంటి లక్షణాలు ఉన్నాయి. చంద్రుడి కన్నా దీని వ్యాసం సుమారు 50% హెచ్చు, ద్రవ్యరాశి 80% హెచ్చు. మొత్తం సౌరమండలంలో కెల్లా టైటన్ రెండవ అతి పెద్ద సహజ ఉపగ్రహం. అతి పెద్దది బృహస్పతికి చెందిన గానిమీడ్. అతి చిన్న గ్రహమైన మెర్క్యురీ కన్నా టైటన్ ఘనపరిమాణంలో పెద్దదే అయినా, మెర్క్యురీతో పోల్చితే ద్రవ్యరాశిలో 41% మాత్రమే వుంటుంది.
శని చందమామల్లో కెల్లా మొట్టమొదట కనుక్కోబడినది టైటనే. దీన్ని 1655లో డచ్ ఖగోళశాస్త్రవేత్త క్రిస్టియన్ హైగెన్స్ కనుక్కున్నాడు. మన చంద్రుణ్ణి మినహాయిస్తే ఇది సౌర కుంటుంబంలో కనుక్కోబడ్డ ఐదవ సహజ ఉపగ్రహం.


