హోప్ ఫర్ హ్యుమానిటీ ఆధ్వర్యంలో చలి కోట్ల పంపిణీ
- 20 Views
- January 18, 2017
- Home Slider అంతర్జాతీయం
మేరీల్యాండ్ రాష్ట్రానికి చెందిన హోప్ ఫర్ హ్యుమానిటీ సంస్థ, ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో ల్యాండోవర్లోని విలియం పాకా ప్రాథమిక పాఠశాలలో వంద మంది పేద విద్యార్థులకు చలి కోట్లు పంపిణీ చేశారు. తానా సహాయ కార్యదర్శి కొల్లా సుబ్బారావు పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమానికి తానా కార్యదర్శి వేమన సతీష్, ప్రాంతీయ ప్రతినిధి జి.విజయ్, మాజీ ప్రాంతీయ ప్రతినిధి కె.త్రిలోక్, హోప్ ఫర్ హ్యుమానిటీ సంస్థ అధ్యక్షుడు వానపాముల బాలాజీ, ఉపాధ్యక్షులు వి.జయప్రద, డైరెక్టర్ పి.నాగేంద్ర, సభ్యులు అట్లూరి శ్రేయ, వి.కిరణ్మయి, ఎన్.జ్యోతి, రాంచౌదరి, సుధాకర్, రాధాకృష్ణ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
చలికోట్లు పంపిణీ చేసినందుకు ప్రిన్స్ జార్జి కౌంటీ పర్యవేక్షకురాలు డెవిస్ రాస్, పాకా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డోరొతి క్లోవర్స్లు తానా అధ్యక్షుడు నన్నపనేని మోహన్‌కు, హోప్ ఫర్ హ్యుమానిటీ కార్యవర్గానికి ధన్యవాదాలు తెలిపారు.


