ప్రేమికుల రోజును ఆరోజే ఎందుకు?
- 15 Views
- February 13, 2017
- Home Slider అంతర్జాతీయం
తల్లిదండ్రులు, అక్కాచెల్లెల్లు, స్నేహితులపై ప్రేమను వ్యక్తపరచడానికి ఒక ప్రత్యేకమైన రోజు లేదు. కానీ తాను ప్రేమిస్తున్న అమ్మాయికి తన ప్రేమను వ్యక్తపరచడానికి మాత్రం ఒక రోజు ఉంది. అదే ప్రేమికుల రోజు (వాలెంటైన్స్ డే). ప్రేమ అనేది ఓ అందమైన అనుభూతి, వర్ణనాతీతం. ఇటువంటి ప్రేమ గురించి చెప్పడానికి మాటలు చాలవు. ప్రతీ రోజు ప్రేమికులు తిరుగుతుంటారు, మాట్లాడుకుంటారు. కానీ ప్రేమికుల రోజు మాత్రం వారికి ప్రత్యేకం. అసలు ఫిబ్రవరి 14న ఎందుకు ప్రేమికుల రోజును జరుపుకోవాలి అని అనుకుంటున్నారా.. ఐతే ఇది చదవాల్సిందే. క్రీస్తు శకం 270 ప్రాంతంలో రోమ్‌లో వాలెంటైన్స్ అనే క్రైస్తవ ప్రవక్త ఉండేవాడు. ప్రేమ వల్ల ప్రపంచం ఆహ్లాదంగా, ఆనందంగా మారుతుందని అతని అభిప్రాయం. అందుకే రహస్యంగా యువతీ యువకులకు ప్రేమోపదేశాలు చేసి, వారిలో ప్రేమ వివాహాలను ప్రోత్సహించడం ప్రారంభించాడు. వాలెంటైన్స్‌కి రోజురోజుకు అభిమానులు పెరిగిపోవడంతో రోమ్ రాజు క్లాడియస్‌కి భయం పట్టుకుంది. దేశాన్ని కాపాడాల్సిన యువతకు ప్రేమ పాఠాలు నేర్పి బలహీనులుగా తయారుచేస్తున్నాడన్న అభియోగంపై క్లాడియస్ వాలెంటైన్‌కి మరణశిక్ష విధించాడు. వాలెంటైన్ అభిమానుల్లో క్లాడియస్ కుమార్తె కూడా ఉండటం విశేషం. ప్రేమకు మారుపేరుగా మారిన వాలెంటైన్‌ను ఫిబ్రవరి 14న ఉరితీశారు. వాలెంటైన్ మరణించిన తరువాత రెండు దశాబ్దాలకు క్రీ.శ. 496లో అప్పటి పోప్, గెలాసియస్స్ ఫిబ్రవరి 14ను వాలెంటైన్స్ డేగా ప్రకటించాడు. ఎక్కడో రోమ్‌లో, అదీ శతాబ్దాల క్రితం జీవించిన ఒక క్రైస్తవ ప్రవక్త పేరుతో మొదలైన ఈ ప్రేమికుల రోజు ఇప్పుడు ప్రపంచం ప్రేమికుల దినోత్సవంగా మారిపోయింది. రెండు మనసులు పరస్పరం అనుక్షణం తనప పడేలా చేస్తుంది. శారీరక, మానసిక గాయాలకు లేపనమై సేదతీరుస్తుంది..అందుకే అది ప్రేమ అయింది. రెండు హృదయాల వారథి, నిండు జీవితాల సారథి, ఇదే ప్రేమైక ప్రపంచం. ప్రేమికుల రోజు (వాలంటైన్స్ డే) ఈ పేరు వింటేనే ప్రేమికుల హృదయాలు పరవళ్లు తొక్కుతాయి. ఒకరికి ఒకరు సందేశాలు పంపుకోవటం, భావాలు పంచుకోవటం,ప్రేమికుల రోజు ప్రత్యేకత. క్రీస్తు శకం 270 ప్రాంతంలో రోమ్ నగరంలో వాలంటైన్స్ అనే క్రైస్తవ ప్రవక్త ఉండేవారు. ప్రేమ వల్లనే ప్రపంచం ఆహ్లాదంగా, ఆనందంగా మారుతుందనేది ఆయన అభిప్రాయం. అందుకే ఆయన యువతీ, యువకులకు ప్రేమోపదేశాలు చేస్తూ, ప్రేమ వివాహాలను ప్రోత్సహించటం ప్రారంభించారు. ఈ క్రమంలో వాలంటైన్స్కు రోజురోజుకు అభిమానులు పెరిగిపోతున్నారు. వారిలో రోమ్ చక్రవర్తి క్లాడియస్ కుమార్తె కూడా ఉండటం విశేషం. ఈ విషయం తెలుసుకున్న రోమ్ చక్రవర్తి క్లాడియస్‌కు భయం పట్టుకుంది. దేశాన్ని కాపాడాల్సిన యువతకు ప్రేమ పాఠాలు నేర్పి బలహీనులుగా తయారు చేస్తున్నాడన్న అభియోగం మోపి, వాలంటైన్స్కు మరణ శిక్ష విధించాడు. ప్రేమకు మారుపేరుగా పుట్టిన వాలంటైన్స్ను ఫిబ్రవరి 14న ఉరితీశారు. అతను మరణించిన తరువాత రెండు దశాబ్దాలకు అనగా క్రీస్తుశకం 496లో ఆనాటి పోప్ గెలాసియస్ ఫిబ్రవరి 14ను వాంలటైన్స్ డేగా ప్రకటించారు. ఎక్కడో రోమ్ నగరంలో, అదీ శతాబ్దాల క్రితం జీవించిన ఒక ప్రవక్త పేరుతో మొదలైన వాలంటైన్స్ డే, ప్రస్తుతం ప్రపంచ ప్రేమికుల దినోత్సవంగా మారిపోయింది. సహజంగా ప్రేమికులంటే లైలా-మజ్ను, దేవదాసు- పార్వతి, షాజహాన్- ముంతాజ్లే గుర్తుకు వస్తారు. వాళ్లు ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా ప్రేమించుకున్నారు. వారి ప్రేమ కుల, మతాల అడ్డుగోడల్ని చీల్చుకుని పుట్టింది. చివరికి పెద్దలు అంగీకరించక పోవటంతో లైలా-మజ్ను, దేవదాసు- పార్వతిలు తనువులు చాలించారే తప్ప, ఇంకొకరిని వివాహమాడలేదు. షాజహాన్ విషయానికి వస్తే భార్య ముంతాజ్‌కు ప్రేమకానుకగా ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహాల్‌ను నిర్మించి, బహుమతిగా అందించాడు. ఈ రోజు ప్రేమను వ్యక్త పర్చుకునేందుకు గులాబీలు ప్రత్యేక మైనవి. ఇందుకు రాష్ర్టానికి ఇతర ప్రాంతాల నుంచి రంగురంగుల గులాబీలు వచ్చేస్తున్నాయి. ప్రత్యేకంగా తయారు చేయబడిన తాజ్‌మహాల్ అనే రెడ్‌రోజ్ పుష్పగుచ్ఛాలు షాపింగ్‌మాల్స్‌లో కనువిందు చేస్తున్నాయి. నిజానికి వాలంటైన్స్‌డే మన దేశంలో పుట్టింది కాదు. ఎక్కడో పాశ్చాత్య సంస్కృతిలో జన్మించిన ప్రేమికుల రోజు పండుగ యువతను నిర్వీర్యం చేస్తుందనే వాదన బలంగా వినిపిస్తోంది. భవిష్యత్ ప్రయాణంపై దృష్టిసారించాల్సిన యువతీ, యువకులు ప్రేమ మత్తులో పడి దారి తప్పుతున్నారు. ఇది సమాజానికి మంచిది కాదు. విఫలమైతే తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడటం సరైంది కానేకాదు. కన్న తల్లిదండ్రులను కాదని, ప్రేమించుకున్నామన్న ఒకేఒక్క కారణంతో కుటుంబానికే దూరమవుతున్నారు. పెద్దలను ఒప్పించటం, ఒప్పిస్తామనే ధైర్యం ప్రేమికులకు ఉండాలి. అమ్మాయిలకూ ఓ మనసుంటుంది. మనుసుల్ని గెలవాలి..శరీరం కోసమే కాకుండా ప్రేమ కోసం ప్రేమించండి.


