రాష్ట్రపతి పేరును చేర్చడంపై హైకోర్టు ప్రశ్న
- 20 Views
- February 13, 2017
- Home Slider రాష్ట్రీయం
పలు గొడవలకు కారణమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ అప్పారావును తొలగించడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేరును కూడా చేర్చారు. ఈ పిటిషన్‌ను సోమవారం విచారించిన హైకోర్టు రాష్ట్రపతి పేరును ఎందుకు చేర్చారని పిటిషనర్ తరఫు న్యాయవాదిని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. వీసీని నియమించింది రాష్ట్రపతి కాబట్టే ఆయన పేరు కూడా చేర్చామని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ అభియోగానికి తగ్గట్టుగా వచ్చే సోమవారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. కేసు తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.