వాలెంటైన్స్ డేపై దేశానికో లెక్క…
- 19 Views
- February 13, 2017
- Home Slider అంతర్జాతీయం
యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో ప్రేమికుల రోజుకు ప్రాంతీయ సంప్రదాయాలు ఉన్నాయి. నోర్ఫోల్క్లో జాక్ వేషంలోని వాలెంటైన్ ఇళ్ల వెనుక తలుపులను తట్టి అక్కడ మిఠాయిలు, పిల్లలకు బహుమతులు ఉంచి వెళతాడు. అతను తినుబండారులు వదిలిపెట్టి వెళ్లినప్పటికీ, ఎక్కువ మంది పిల్లలు ఈ రహస్య వ్యక్తి విషయంలో భయపడుతుంటారు. వేల్స్లో, ఎక్కువ మంది పౌరులు జనవరి 25న సెయింట్ వాలెంటైన్స్ డేకు బదులుగా లేదా దీని మాదిరిగానే సెయింట్ డ్వైన్వెన్స్ డేను జరుపుకుంటారు. వెల్ష్ ప్రేమికులకు రక్షకుడిగా కీర్తించబడుతున్న సెయింట్ డ్వైన్‌వెన్ సంస్మరణార్థం ఈ రోజును జరుపుకుంటున్నారు. సంప్రదాయబద్ధంగా కాథలిక్ దేశమైన ఫ్రాన్స్‌లో వాలెంటైన్స్ డేను సెయింట్ వాలెంటైన్‌గా గుర్తిస్తారు. ఇతర పశ్చిమ దేశాల మాదిరిగానే ఇక్కడ ఈ రోజును జరుపుకుంటారు. స్పెయిన్‌లో వాలెంటైన్స్ డేగా తెలుసు, యునైటెడ్ కింగ్డమ్లో మాదిరిగానే ఇక్కడ ఈ సెలవుదినాన్ని జరుపుకుంటారు, కాటాలోనియాలో మాత్రం దీనికి బదులుగా గులాబీలు లేదా పుస్తకాలు ఇచ్చే సంబరాలను సెయింట్ జార్జెస్ డే రోజున నిర్వహిస్తారు. పోర్చుగల్‌లో దీనిని సాధారణంగా బాయ్/గర్ల్‌ఫ్రెండ్స్ డేగా గుర్తిస్తారు. డెన్మార్క్, నార్వే దేశాల్లో, వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) వాలెంటైన్స్ డేగా తెలుసు. భారీస్థాయిలో దీనిని జరుపుకోనప్పటికీ, ఎక్కువ మంది ప్రజలు తన భాగస్వామితో కలిసి రాత్రి విందు చేయడం, రహస్య ప్రేమికులగా కార్డులు పంపడం లేదా ప్రేమికులకు ఎర్రటి గులాబీ ఇవ్వడం చేస్తుంటారు. స్వీడన్లో దీనిని ఆల్ హార్ట్ డేగా పిలుస్తారు. అమెరికా సంస్కృతి ప్రభావం, పువ్వుల పరిశ్రమ వ్యాపార ప్రయోజనాల కోసం 1960వ దశకంలో ఇది ప్రారంభమైంది. ఇక్కడ ఇది అధికారిక సెలవుదినం కాదు, అయితే మదర్స్ డే కంటే ఎక్కువగా సౌందర్య సాధనాలు, పువ్వుల విక్రయాలు జరిగే రోజుగా వాలెంటైన్స్ డే వేడుకలు గుర్తింపు పొందాయి. ఫిన్లాండ్లో వాలెంటైన్స్ డేను విచిత్రంగా పిలుస్తారు, దీని అర్థం ఫ్రెండ్స్ డే. పేరు సూచిస్తున్న విధంగానే, ఈ రోజును ఎక్కువగా ప్రేమించే వ్యక్తులతోపాటు మిత్రులను గుర్తుకు తెచ్చుకుంటారు. ఎస్టోనియాలో వాలెంటైన్స్ డేను మరోలా పిలుస్తారు, దీనికి కూడా ఫ్రెండ్స్ డే అని అర్థం. స్లొవేనియాలో సెయింట్ వాలెంటైన్ వేళ్ల తాళాలను తీసుకొస్తాడనే జాతీయం ప్రచారంలో ఉంది, అందువలన ఫిబ్రవరి 14న మొక్కలు, పువ్వులు పెరగడం ప్రారంభమవుతుందని విశ్వసిస్తారు. వైన్యార్డుల్లో (వైన్ తయారీకి ఉపయోగించే ద్రాక్ష పంట పండించే ప్రదేశాలు) పంటపొలాల్లో మొదటి పనులు ప్రారంభించేందుకు గుర్తుగా వాలెంటైన్స్ డేను జరుపుకుంటారు. అంతేకాకుండా పక్షులు ఈ రోజున ఒకదానికొకటి ప్రేమ లేదా వివాహ ప్రతిపాదన చేస్తాయని చెబుతుంటారు. అయితే, ఇటీవల కాలం నుంచే దీనిని ప్రేమికుల రోజుగా జరుపుకుంటున్నారు. సంప్రదాయబద్ధంగా మార్చి 12న జరుపుకునే సెయింట్ గ్రెగోరీస్ డేను ప్రేమికుల రోజుగా పరిగణిస్తారు. మరో జాతీయం ప్రకారం వాలెంటైన్… వసంతకాలపు మొదటి సెయింట్), కొన్ని ప్రదేశాల్లో (ముఖ్యంగా వైట్ కార్నియోలా) సెయింట్ వాలెంటైన్‌ను వసంతకాలం ప్రారంభమవడానికి సూచనగా పరిగణిస్తున్నారు. రొమేనియాలో, ప్రేమికులకు సంప్రదాయ సెలవుదినం, దీనిని ఫిబ్రవరి 24న జరుపుకుంటారు. రొమేనియన్ల జానపదసాహిత్యంలోని ఒక పాత్ర నుంచి ఈ పేరు వచ్చింది, ఇది బాబా డోచియా కుమారుడి పేరు అయివుంటుందని భావిస్తున్నారు. పేరులోని ఒక భాగమైన డియర్ అనే పదాన్ని, లవ్ పదంలోనూ గుర్తించవచ్చు. ఇటీవల సంవత్సరాల్లో, సంప్రదాయ సెలవుదినం ఉన్నప్పటికీ, రొమేనియా కూడా వాలెంటైన్స్ డే వేడుకలు జరుపుకోవడం ప్రారంభించింది. దీని వలన అనేక గ్రూపులు, పలుకుబడి ఉన్న వ్యక్తులు, సంస్థలు, పలు జాతీయ సంస్థలు నిరసనలు మొదలుపెట్టాయి, వాలెంటైన్స్ డే ప్రాధాన్యతలేని, వ్యాపారాత్మక వేడుకని, పశ్చిమ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న డాంబికమైన ఆచారం అంటూ వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. యూదుల సంప్రదాయం ప్రకారం సాధారణంగా వెనుకటి ఆగస్టు నెలలో 15వ రోజును ప్రేమ దినంగా పరిగణించేవారు. పురాతన కాలంలో బాలికలు తెలుపు వస్త్రాలు ధరించి వైన్యార్డులలో నృత్యం చేసేవారు, అక్కడ బాలురు వారి కోసం వేచి ఉండేవారు ఆధునిక ఇజ్రాయేల్ సంస్కృతిలో ప్రేమను వ్యక్తపరిచేందుకు, వివాహ ప్రతిపాదన చేసేందుకు, కార్డులు లేదా పువ్వుల వంటి బహుమతులు ఇచ్చేందుకు ఇదొక ప్రసిద్ధమైన రోజు. గ్వాటెమాల, సాల్వడార్ ప్రాంతాల్లో వాలెంటైన్స్ డేను డే ఆఫ్ లవ్ అండ్ ఫ్రెండ్షిప్గా భావిస్తారు. దాదాపుగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో జరుపుకునే తరహాలోనే ఇక్కడ కూడా వేడుకలు జరుపుకుంటారు, ఈ రోజున ప్రజలు వారి స్నేహితుల చర్యలను ప్రశంసించడం ఇక్కడ సాధారణంగా కనిపిస్తుంది. బ్రెజిల్లో ఇదే వేడుకను జూన్ 12న జరుపుకుంటారు, ఈ రోజున జంటలు బహుమతులు, చాక్లెట్లు, కార్డులు, పూలగుత్తులు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. సెయింట్ ఆంథోనీస్ డే వేడుకలు జరిగే ముందురోజును దీనికోసం ఎంపిక చేసినట్లు భావిస్తున్నారు, ఈ దేశంలో సెయింట్ ఆంథోనీని మ్యారేజ్ సెయింట్‌గా పరిగణిస్తారు, ఈ రోజున ఒంటరిగా ఉన్న మహిళలు సంప్రదాయబద్ధంగా మంచి భర్త లేదా మగతోడు కోసం సింపాటియాస్ అని పిలిచే ప్రసిద్ధ మతాచారాలను నిర్వహిస్తారు. సాంస్కృతిక, వ్యాపార కారణాల వలన ఇక్కడ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేను జరుపుకోరు, బ్రెజిల్లో ప్రసిద్ధ పడవ పోటీల సెలవుదినం కార్నివల్‌కు కాస్త ముందు లేదా తరువాత వాలెంటైన్స్ డే వస్తుండటం వేడుకలు జరుపుకోకపోవడానికి ప్రధాన కారణం… ఈ దేశంలో అనేక మంది లైంగిక వాంఛ, వేశ్యాలోలత్వానికి సంబంధించిన ఈ కార్నివల్‌ను జరుపుకుంటున్నారు. ఈ సెలవుదినం ఫిబ్రవరి ప్రారంభం నుంచి మార్చి ప్రారంభ రోజుల మధ్యలో వస్తుంది. వెనిజులాలో అధ్యక్షుడు హుగో చావెజ్ ఫిబ్రవరి 15, 2009న జరగబోతున్న ఆ దేశ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ 14న వేడుకలు చేసుకునేందుకు ఏ మాత్రం సమయం లేదని, కేవలం ఒక చిన్న ముద్దు లేదా తేలికైన వేడుకతో సరిపెట్టుకోవాలని సూచించాడు, ఎన్నికలు ముగిసిన తరువాత ఒక వారంపాటు ప్రేమ వేడుకలు జరుపుకోమని సూచించాడు. దక్షిణ అమెరికాలోని ఎక్కువ ప్రాంతాల్లో లవ్ అండ్ ఫ్రెండ్షిప్ డే, రహస్య మిత్రుడు వేడుకలు బాగా ప్రసిద్ధి చెందాయి, వీటిని ఫిబ్రవరి 14న ఒకేసారి జరుపుకుంటారు (ఒక్క కొలంబియా దేశంలో మాత్రం ఈ వేడుకలను సెప్టెంబరు నెలలో మూడో శనివారం జరుపుకుంటారు). రహస్య మిత్రుడు వేడుకల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తి యాదృచ్ఛికంగా గుర్తు తెలియని బహుమతి ఇస్తాడు (ఇది క్రిస్మస్ సంప్రదాయమైన సీక్రెట్ శాంతాను పోలి వుంటుంది). వ్యాపార చర్యల ఫలితంగా, ఈ ప్రాంతంలోని కొన్ని దేశాల్లో వాలెంటైన్స్ డేను భారీగా జరుపుకుంటున్నారు, సింగపూర్ వాసులు, చైనీయులు, దక్షిణ కొరియా వాసులు వాలెంటైన్స్ డే బహుమతుల కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. జపాన్‌లో అతిపెద్ద మిఠాయిల కంపెనీల్లో ఒకటైన మోరినాగా 1960లో కేవలం మహిళలు మాత్రమే పురుషులకు చాక్లెట్లు ఇవ్వాలనే సంప్రదాయం ప్రారంభమవడానికి కారణమైంది. ముఖ్యంగా, కార్యాలయ మహిళలు వారి సహోద్యోగులకు చాక్లెట్లు ఇస్తారు. ఒక నెల తరువాత, మార్చి 14న జపాన్ జాతీయ మిఠాయి పరిశ్రమల సంఘం సృష్టించిన వైట్ డేను బదులు రోజుగా జరుపుకుంటారు, ఈ రోజున పురుషులు వాలెంటైన్స్ డే రోజు తమకు చాక్లెట్లు ఇచ్చిన మహిళలకు తిరిగి బహుమతులు ఇస్తుంటారు. పశ్చిమ దేశాల మాదిరిగా, కాండీలు, పువ్వులు లేదా రాత్రివిందు రోజుల వంటి బహుమతులు ఇక్కడ పెద్దగా కనిపించవు. ఇదిలా ఉంటే సహోద్యోగ పురుషులు అందరికీ చాక్లెట్లు ఇవ్వాలనడం అనేక మంది మహిళలకు అభ్యంతరకరమైంది. ఈ రోజున ఎక్కువ చాక్లెట్లు పొందిన పురుషులు గర్వపడుతుంటారు. పురుషుల్లో చాక్లెట్ల సంఖ్య బాగా చర్చనీయాంశమవుతుంది, చాక్లెట్ల సంఖ్యను బయటకు చెప్పకుండా ఉంటామనే హామీ పొందిన తరువాతే వారు దీనిపై మాట్లాడుతుంటారు. ఇందులో గర్ల్ అంటే (బాధ్యత), చాక్లెట్ జనరంజకంకాని సహోద్యోగులు కేవలం అతి-ఉపకార బద్ధమైన తక్కువ రకం చాక్లెట్లను పొందుతారు. దీనికి పూర్తిగా భిన్నంగా ఇచ్చేవే ఇంటిలోచేసిన చాక్లెట్; వీటిని ప్రేమించినవారికి ఇస్తుంటారు. స్నేహితులు, ముఖ్యంగా యువతులు, పిలిచే చాక్లెట్లను ఇచ్చిపుచ్చుకుంటారు; ఇందులో టోమో అంటే మిత్రుడు అని అర్థం. దక్షిణ కొరియాలో, మహిళలు ఫిబ్రవరి 14న పురుషులకు చాక్లెట్లు ఇస్తుంటారు, పురుషులు మార్చి 14న చాక్లెట్-యేతర మిఠాయిలను ఇస్తారు. ఏప్రిల్ 14న (బ్లాక్ డే). ఫిబ్రవరి 14 లేదా మార్చి 14న ఎటువంటి బహుమతులు అందుకోనివారు చైనా రెస్టారెంట్‌కు వెళ్లి బ్లాక్ న్యూడిల్స్ తింటూ, వారి ఒంటరి జీవితాన్ని గుర్తు చేసుకొని విచారిస్తారు. కొరియన్లు నవంబరు 11న కూడా జరుపుకుంటారు, యువ జంటలు ఈ రోజున ఒకరికొకరు పెపెరో కుకీలను ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ రోజున పంచుకునే పొడవైన ఆకారంలో కుకీలను 11/11 తేదీ ప్రతిబింబిస్తుంది. కొరియాలో ప్రతి నెలలో 14వ తేదీని ప్రేమకు సంబంధించిన రోజుగా పరిగణిస్తారు, వీటిలో ఎక్కువ రోజులు అప్రసిద్ధమైనవే. జనవరి నుంచి డిసెంబరు వరకు: కాండిల్ డే, వాలెంటైన్స్ డే, వైట్ డే, బ్లాక్ డే, రోజ్ డే, కిస్ డే, సిల్వర్ డే, గ్రీన్ డే, మ్యూజిక్ డే, వైన్ డే, మూవీ డే, హగ్ డే. చైనాలో, పురుషుడు తాను ప్రేమించిన మహిళకు చాక్లెట్, పువ్వులు లేదా రెండూ ఇచ్చే సాధారణ సంప్రదాయం పాటిస్తారు. ఫిలిప్పీన్స్‌లో ప్రేమికుల రోజును హార్ట్స్ డేగా పిలుస్తారు. సాధారణంగా పువ్వుల ధరను పెంచేందుకు దీనిని జరుపుకోవడం ప్రారంభించారు. చైనా సంస్కృతిలో ప్రేమికులకు సంబంధించి ది నైట్ ఆఫ్ సెవెన్స్ అనే పాత సంప్రదాయం ఒకటి భాగమై ఉంది. పురాణ గాథ ప్రకారం, కౌహెర్డ్ స్టార్ మరియు వీవర్ మెయిడ్ స్టార్ సాధారణంగా పాలపుంత (తెల్లని నది) చేత వేరు చేయబడివుంటాయి, అయితే వాటికి నదిని దాటి కలుసుకునేందుకు చైనీయుల క్యాలెండర్ ప్రకారం 7వ నెల 7వ రోజున అనుమతించబడివుంది. ఇదే రోజున కొరియాలో వేడుక జరుపుకుంటారు, అయితే శృంగారంతో చాలాకాలం క్రితమే ఈ రోజు అనుబంధం తెగిపోయింది. జపాన్‌లో కొద్దిగా వైవిధ్యం ఉండే పద్ధతి ఆచరణలో ఉంది, దీనిని గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం జులై 7న జరుపుకుంటారు. దీనికి సంబంధించిన పురాణ గాథ కూడా చైనా పురాణ గాథ మాదిరిగానే ఉంటుంది. అయితే, సెయింట్స్ వాలెంటైన్స్ డే లేదా ప్రేమికులు ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకునే ఆచారంతో దీనికి ఎప్పుడూ, ఎటువంటి సంబంధం లేదు. భారతదేశంలో హిందూ మతవాదులు ప్రేమికుల రోజుతో స్పష్టంగా విభేదించారు. 2001 నుంచి ప్రతి ఏటా ప్రేమికుల రోజుకు సంబంధించిన వస్తువులు విక్రయించేవారితో హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి పశ్చిమ దేశాల సాంస్కృతిక కాలుష్యంగా ఈ రోజును పరిగణించే శివసేన కార్యకర్తలు ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా, ముంబయి మరియు దాని పరిసర ప్రాంతాల్లో బాల్ థాకరే, ఇతరులు ప్రేమికుల రోజుకు ముందు ఎటువంటి సంస్కృతి విరుద్ధమైన కార్యకలాపాలు సాగించవద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు. వారి హెచ్చరికలను అతిక్రమించినవారితో, ముఖ్యంగా పార్కుల వంటి బహిరంగ ప్రదేశాల్లో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగేవారిని, ఇతర అనుమానిత ప్రేమికులను పట్టుకొని శివసేన సాయుధ కార్యకర్తలు కరుకుదనం ప్రదర్శించారు. దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో పార్కుల్లో, ఇతర బహిరంగ ప్రదేశాల్లో కనిపించినవారికి శివసేన, ఇతర సారూప్య సంస్థల కార్యకర్తలు అక్కడికక్కడే వివాహం జరిపించారు. ప్రేమికుల ది నోత్సవాన్ని ఆచరించడం మన సంస్కృతి కాదంటున్న శ్రీరామసేన అధ్యక్షులు ప్రమోద్‌ముతాలిక్ సంఘంలో చోటు చేసుకున్నకులము అస్పృశ్యత, మహిళలపై దౌర్జన్యం వంటి వాటిపై ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. ముతాలిక్ వ్యాఖ్యల వల్ల శ్రీరామసేన కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది రూపాయల ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేశారని ఈ నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి మల్లికార్జున ఖర్గే, మాజీముఖ్యమంత్రి ధరంసింగ్ ప్రేమికుల దినోత్సవాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించినప్పటికీ ప్రస్తుతం ఇరాన్లో ప్రేమికుల రోజును జరుపుకుంటున్నారు. యువ ఇరానియన్లు ఈ రోజున బయటకు వెళ్లి బహుమతులు కొనుగోలు చేయడం, వేడుకలు జరుపుకోవడం చూడవచ్చు. సౌదీ అరేబియాలో 2002, 2008 సంవత్సరాల్లో, మత పోలీసులు అన్ని ప్రేమికుల రోజు వస్తువులను నిషేధించారు, దుకాణాలవారిని ఎరుపు వర్ణంలోని వస్తువులన్నింటినీ తొలగించాలని ఆదేశించారు, దీనిని ఇస్లాంయేతర సెలవుదినంగా పరిగణిస్తూ ఈ నిర్ణయాలు తీసుకున్నారు. 2008లో ఈ నిషేధం కారణంగా గులాబీలు, ఆకర్షణీయ కాగితానికి నల్ల బజారు సృష్టించబడింది. ఇలా దేశానికో పేరు ఉన్నప్పటికీ వాలెంటైన్స్ డే ప్రసిద్ధి చెందడానికి మాత్రం మన దేశ యువతే ప్రధాన కారణంగా భావించవచ్చు. పాశ్చాత్య నాగరికత అనే పేరుకే గానీ, మన వారు ప్రేమికుల రోజు పేరిట బరితెగించే విధంగా ప్రవర్తించడమే హిందూ సంప్రదాయవాదులకు ఆగ్రహాన్ని రప్పిస్తోంది… తప్ప వేడుకలపై మాత్రం కాదన్నది వాస్తవ పరిస్థితులను చూస్తే అర్ధమవుతుంది.


