చైతూకి సమంత ముద్దు!
- 10 Views
- February 17, 2017
- Home Slider సినిమా
టాలీవుడ్ మోస్ట్ లవబుల్ పెయిర్ అంటే ఠక్కున గుర్తుకొచ్చేది నాగ చైతన్య, సమంత జంట. జనవరి 29న ఈ జంట నిశ్చితార్ధం జరుపుకోగా త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. అయితే ప్రతి అకేషన్ని గ్రాండ్‌గా జరుపుకునే ఈ జంట వేలంటైన్స్ డేని కూడా వెరైటీగా జరుపుకున్నారట. ఈ వేలంటైన్ డే సందర్భంగా సమంత చైతూకి నుదుటిపై ముద్దు ఇచ్చి తన ప్రేమను చాటుకుంది. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. వీరిద్దరి అభిమానులు చూడముచ్చటగా ఉన్న జంటకు ఆల్ ది బెస్టూ చెబుతూ జీవితాంతం ఇలానే సంతోషంగా ఉండాలని కోరారు. ఇక వీరి సినిమాల విషయానికి వస్తే సమంత తమిళ సినిమాలతో బిజీగా ఉంటూనే తెలుగులో రామ్ చరణ్-సుకుమార్ ప్రాజెక్ట్‌తో పాటు రాజు గారి గది సీక్వెల్లో నటించనుంది. ఇక చైతూ సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ ప్రస్తుతం సెట్స్ పైన ఉంది. నాగ చైతన్య హీరోగా కృష్ణ ఆర్.వి మరిముత్తు దర్శకత్వంలో ఓ మూవీ మొదలు కానుంది. ఇటీవల ఈ చిత్రం వారాహి చలన చిత్రం కార్యాలయంలో లాంచనంగా ప్రారంభం అయింది. వారాహి చలన చిత్రం, సురేష్ ప్రొడక్షన్స్ బేనర్లో ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, డి సురేష్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


