జోరుగా… హుషారుగా…!
- 19 Views
- February 17, 2017
- Home Slider సినిమా
తైమూర్ అలీ ఖాన్ జననం దరిమిలా సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చిన సైఫ్ అలీ ఖాన్ రంగూన్ ప్రమోషన్స్‌లో బిజీగా గడిపేస్తున్నారు. కొత్త చిత్రం షెఫ్ షూటింగ్‌లోనూ హుషారుగా పాల్గొంటున్నారు. షెఫ్ ఆవేదనభరిత కథే అయినా కామెడీ కూడా అధికంగానే ఉందట. ఈ చిత్రంలో సైఫ్ పోషిస్తున్న పాత్రే ఆసక్తికరం. ఆయన క్యాన్సర్ పేషెంట్‌గా కనిపించనున్నారు. ఈ మూవీలో సైఫ్ క్యాన్సర్ చివరి దశలో ఉన్న రోగి రోల్లో దర్శనమివ్వనున్నారు. అప్పటి వరకూ దూరంగా ఉన్న పనులన్నింటినీ చనిపోయే ముందే చేసేందుకు యత్నించే వ్యక్తిగా కనిపిస్తారు. ఈ క్రమంలో సైఫ్ పాత్ర నవ్వులు పూయించడంతో పాటూ మనసునూ మెలిపెడుందని టాక్. ఢిల్లీ బెల్లీ ఫేమ్ అక్షత్ వర్మ షెఫ్‌ను తెరకెక్కిస్తున్నారు. దక్షిణ ముంబైలో అత్యధిక భాగం చిత్రీకరణ చేసిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చుతుందని చిత్రబృందం చెప్తోంది. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 24న విడుదలవుతున్న రంగూన్లో సైఫ్ కీలక పాత్ర పోషించారు. ట్రైలర్‌తోనే తన పాత్రకు ఆయన ప్రశంసలు దక్కించుకున్నారు. కంగన రనౌత్, షాహిద్ కపూర్లు కూడా కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.


