ప్రత్యేకత చాటుకుంటున్న నాని
- 13 Views
- February 17, 2017
- Home Slider సినిమా
భలే భలే మగాడివోయ్ అంటూ తెరంగ్రేటం చేసిన నాని మూవీ కెరీర్ చాలా సాదా సీదాగా స్టార్ట్ అయింది. ఒక్కో సినిమాకూ ఒక్కో స్టెప్ ఎక్కుతూ వస్తున్నాడు. తన సినిమాలో కలెక్షన్ల రికార్డుల్ని తనే బ్రేక్ చేసుకుంటున్నాడు. నాని యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ నేను లోకల్. ఈ పిక్చర్ రిలీజైన ఫస్ట్ వీక్‌లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఓవర్సీస్లో కూడా కలెక్షన్స్ లో దూసుకుపోతోంది. నాని మూవీ నేను లోకల్ ఫస్ట్ వీక్‌లోనే 20 కోట్ల రూపాయల షేర్‌ను రీచ్ అయింది. 10 రోజుల్లో 26.5 కోట్ల షేర్ వసూలు చేసిందని లేటెస్ట్ న్యూస్. నాని అదివరకు చేసిన భలే భలే మగాడివోయ్ సినిమా 30 కోట్లను క్రాస్ చేసింది. ఇప్పటికే 26 కోట్లు దాటిన నేను లోకల్ కూడా 30 కోట్లకు చేరుకోవడమే కాక, అధిగమిస్తుందని కూడా అంటున్నారు. నానికి వచ్చిన ఇమేజ్ ఇందుకు కారణమని చెబుతున్నారు. ఒక్కో మూవీతో నాని ఒక్కో అడుగు ముందుకు వెళ్లడానికి కారణం ప్రతి సినిమాలో అతను చేస్తున్న డిఫరెంట్ రోల్స్ చేస్తూ పోవడమే. ఒక సినిమాలో వేసిన కేరక్టర్ కూ, మరో సినిమాలో వేసే కేరక్టర్కూ అసలు పోలికే ఉండదు. ప్రస్తుతం నాని అమెరికాలో తన లేటెస్ట్ పిక్చర్ షూటింగ్లో ఉన్నాడు. నేను లోకల్ సక్సెస్‌తో తన రెస్పాన్సిబిలిటీ మరింత పెరిగిందని, ఒళ్లు దగ్గర పెట్టుకుని చేయాలని నాని చెప్పడం ఎదిగే కొద్దీ ఒదగమనీ అనే మాటను నిజం చేస్తున్నది.


