ఊరించేలా పూరి ‘రోగ్’
- 23 Views
- February 18, 2017
- Home Slider సినిమా
బద్రి, ఇడియట్, పోకిరి, దేశముదురు, చిరుత, బుజ్జిగాడు, టెంపర్ వంటి డిఫరెంట్ క్యారెక్టర్ బేస్డ్ బ్లాక్‌బస్టర్ చిత్రాలను రూపొందించిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న మరో చిత్రం ‘రోగ్’. మరో చంటిగాడు ప్రేమకథ క్యాప్షన్. జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్ బ్యానర్‌పై డాక్టర్ సి.ఆర్. మనోహర్, సి.ఆర్. గోపి నిర్మాతలుగా రూపొందుతోన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ వాలెంటెన్స్ డే సందర్భంగా విడుదలైంది. ఇషాన్ హీరోగా నటించిన ఈ సినిమా లావిషింగ్, స్టయిలిష్ విజువల్స్‌తో కూడిన ఈ ఫస్ట్ లుక్కు ఆడియెన్స్ నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ రాబట్టుకుంది. మరో చంటిగాడి ప్రేమకథ అనే ట్యాగ్‌లైన్‌కు మంచి స్పందన వస్తుంది. త్వరలోనే సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఇషాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: బి.రవికుమార్, ఆర్ట్: జానీ షేక్, ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ, మ్యూజిక్: సునీల్‌కశ్యప్, సినిమాటోగ్రఫీ: ముఖేష్.జి, నిర్మాతలు: సి.ఆర్.మనోహర్, సి.ఆర్.గోపి, దర్శకత్వం: పూరి జగన్నాథ్. ఇదిలావుండగా, రామా రీల్స్ పతాకంపై మంచు విష్ణు-సురభి జంటగా తమిళ-తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. హీరోహీరోయిన్లు మంచు విష్ణు-సురభిలపై భారీ సెట్లో లవ్ సీన్‌ను చిత్రీకరిస్తున్నారు. సదరు సన్నివేశం ట్రాఫిక్ జామ్‌లో చిత్రీకరించి ఉండాల్సి రావడంతో పెద్ద సంఖ్యలో వెహికిల్స్‌ను ఏర్పాటు చేశారు. జి.ఎస్.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆదివారంతో రెండోభారీ షెడ్యూల్ పూర్తికానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుధీ కుమార్ పూదోట (జాన్) మాట్లాడుతూ ‘‘నేడు రామోజీ ఫిలిమ్ సిటీలో ఏర్పాటుచేసిన ప్రత్యేకమైన సెట్లో హీరోహీరోయిన్ల నడుమ లవ్ సీన్‌ను చిత్రీకరిస్తున్నాం. అలాగే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిపాం. మంచు విష్ణుకి కథానాయకుడిగా మంచి పేరు తీసుకురావడంతోపాటు కమర్షియల్‌గా సూపర్ హిట్ అయ్యే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. యూనివర్సెల్ కాన్సెప్ట్ కావడంతో బైలింగువల్ సినిమాగా రూపొందిస్తున్నాం. దర్శకుడు జి.ఎస్.కార్తీక్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విధానం బాగుంది. ఇప్పటివరకూ వచ్చిన ఔట్ పుట్తో మా యూనిట్ సభ్యులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. తమన్ నేతృత్వంలో పాటల కంపోజింగ్ కూడా జరుగుతోంది. త్వరలో సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తాం’’ అని అన్నారు.


