ఎట్టకేలకు స్వగృహ ఇళ్లకు కదలిక!
- 22 Views
- February 18, 2017
- Home Slider రాష్ట్రీయం
సర్కార్‌కు గుది బండలా తయారైన రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు మోక్షం కలగనుంది. హైదరాబాద్‌లో నిర్మించిన స్వగృహ ఫ్లాట్లను ప్రభుత్వ ఉద్యోగులకు అమ్మాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వగృహ ఫ్లాట్లు కేటాయిస్తున్నామన్నారు. హౌజింగ్ సెక్రటరీ చిత్ర రాంచంద్రన్. టీఎన్జీఓలు, టీజీఓలు, ఉపాధ్యాయ, డ్రైవర్ల సంఘాలు ఇలా 8 ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై చర్చించారు. హౌజింగ్ సెక్రటరీ. ఫ్లాట్ల అమ్మకానికి జీవో నంబర్ 201 విడుదల చేశామని చెప్పారు. దీనిపై ఉద్యోగుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు ఓకే అంటే రెండు నెలల్లో వాటిని కేటాయిస్తామన్నారు. బండ్లగూడ స్వగృహలో పూర్తయిన ఫ్లాట్లు స్క్వేర్ ఫీట్‌కు 19 వందలు, నిర్మాణంలోని ఫ్లాట్లను స్క్వేర్ ఫీట్‌కు 17వందల రూపాయల ధర నిర్ణయించారు. పోచారం ప్రాంతంలోని పూర్తయిన ఫ్లాట్లకు 17 వందలు, నిర్మాణంలో ఉన్న ఫ్లాట్లకు 15 వందల రూపాయలు ధర నిర్ణయించారు. వీటిని కొనుగోలు చేయాలనుకునేవాళ్లు రాజీవ్ స్వగృహ అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు డౌన్ లోడ్ చేసుకుని, వెయ్యి రూపాయలు చెల్లించి నమోదు చేసుకోవాలన్నారు. ఖచ్చితంగా ఎంప్లాయ్ ఐడీ, అడ్రస్ ప్రూఫ్, సాలరీ సర్టిఫికెట్స్ జతపర్చాల్సి ఉంటుంది. బండ్లగూడ స్వగృహ ప్రాజెక్టులో ఏ-కేటగిరి కింద పూర్తయినవి మూడు బెడ్రూమ్ల 132 ఫ్లాట్స్, బి కేటగిరి కింద రెండున్నర బెడ్రూమ్ల ప్లాట్స్ 36, సీ కేటగిరి కింద డబుల్ బెడ్ రూం ప్లాట్స్ 37, డీ కేటగిరి కింద సింగిల్ బెడ్ రూం 111 ప్లాట్స్ ఉన్నాయి. నిర్మాణంలోని ఫ్లాట్లలో ఏ-కేటగిరీ కింద మూడు బెడ్ రూంల ఫ్లాట్స్ 216, బీ కేటగిరీ కింద రెండున్నర బెడ్ రూంల ప్లాట్స్ 408, సీ కేటగిరి కింద 674 ఫ్లాట్లున్నాయి. డీ కేటగిరీ కింద సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు 631 ఉన్నాయి. పోచారం స్వగృహ ప్రాజెక్టులో పూర్తయిన ఫ్లాట్లు ఏ-కేటగిరీలో 3 బెడ్ రూంలవి రెండున్నాయి. బీ-కేటగిరీలో ఫ్లాట్లు లేవు. సీ-కేటగిరీలో రెండు బెడ్ రూంల ఫ్లాట్స్ 884 ఉన్నాయి. డీ-కేటగిరీలో సింగిల్ బెడ్ రూం ఫ్లాట్లు 82 ఉన్నాయి. నిర్మాణంలోని ఫ్లాట్లు ఏ-కేటగిరీలో 3 బెడ్ రూంలవి 90, బీ కేటగిరీలో రెండున్నర బెడ్ రూంల ఫ్లాట్స్ 53 ఉన్నాయి. సీ కేటగిరిలో ఫ్లాట్లు లేవు. డీ కేటగిరిలో సింగిల్ బెడ్ రూం ఫ్లాట్స్ 360 ఉన్నాయి. స్వగృహ ప్రాజెక్టులోని ఫ్లాట్లను ఉద్యోగులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు హౌజింగ్ సెక్రటరీ చిత్ర రామచంద్రన్. బండ్లగూడలో పూర్తయిన ఫ్లాట్లను స్క్వేర్ ఫీట్‌కు 12 వందలు, నిర్మాణంలో ఉన్నవాటిని 950 రూపాయలకు ఇవ్వాలంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. పోచారంలో పూర్తయిన ఫ్లాట్లు స్క్వైర్ ఫీట్‌కు 11 వందలు, నిర్మాణంలో ఉన్నవాటిని 850 రూపాయలకు ఇవ్వాలంటున్నారు. చాలాకాలంక్రితం కట్టిన ఫ్లాట్లు కాబట్టి కేవలం ఫ్లాట్ విస్తీర్ణానికే ధర చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటున్నారు ఉద్యోగ నేతలు. కామన్ ఏరియాను ఫ్లాట్ ధరలో కలపొద్దని అంటున్నారు.


