గ్రీన్‌బెల్టు పెంపొందించడంపై శ్రద్ధ: కమిషనర్ హరినారాయణన్
- 28 Views
- February 18, 2017
- Home Slider రాష్ట్రీయం
విశాఖపట్నం ఆకర్షణీయనగరంగా అభివృద్ధి చెందుతున్నందతున జాతీయ రహదారి ప్రక్కన గ్రీన్‌బెల్టు పొంపొందించడం, మురుగు డ్రెయిన్ల నిర్వహణపై శ్రద్ధ వహించాలని జివియంసి కమీషనర్ హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. క్షేత్రపర్యటనలో భాగంగా శనివారం కాకానినగర్ నుండి ఎయిర్ పోర్టు వరకు గల గ్రీన్ బెల్టు ప్రాంతాన్ని, మురుగు కాలువలను సందర్శించారు. ఈ సందర్భముగా ప్రముఖులు నగరానికి వచ్చే ప్రదేశమైనందున మురుగుకాలువలను సక్రమంగా నిర్వహించాలని పేర్కొన్నారు. అదేవిధంగా గ్రీన్ బెల్టును సక్రమంగా అభివృద్ధి చేయడం ద్వారా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు. అనంతరం వెంకటాపురం, బాజీ జంక్షన్ యస్.టి.పి పంప్‌హౌస్‌లను సందర్శించి పలు సూచనలు చేశారు. యస్.టి.పి పంప్ హౌస్‌లను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. పర్యటనలో ఛీప్ ఇంజనీర్ బి.జయరామరెడ్డి, యస్.ఇ.లు రాంమెహన్, ప్రసాదరాజు, ఇ.ఇ.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


