తొలిచూపుతో అదరగొట్టిన అల్లు అర్జున్
- 9 Views
- February 18, 2017
- Home Slider సినిమా
అల్లు అర్జున్ కథానాయకుడిగా రూపొందుతోన్న ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా నుంచి ఫస్టులుక్ వచ్చేసింది. మహాశివరాత్రి రోజైన 24వ తేదీన టీజర్‌ను వదలనున్నారు. కొత్త చిత్రంలో తమ అభిమాన కథానాయకుడు ఎలా కనిపిస్తాడోనని వేచి చూస్తున్న వారికి అల్లు అర్జున్ అదిరిపోయే లుక్‌తో ఎంట్రీ ఇచ్చారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘దువ్వాడ జగన్నాథమ్’. హరీశ్ శంకర్ దర్శకుడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. నుదుటిన విభూది ధరించి స్కూటర్‌పై కూరగాయల సంచులతో వస్తున్న బన్ని ఫస్ట్‌లుక్‌తో అదరగొట్టేసింది. అల్లు అర్జున్ సరసన పూజాహెగ్డే కథానాయికగా నటిస్తోంది. దిల్ రాజు నిర్మాత. దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. మరోవైపు ఈ చిత్రంపై చిన్న వివాదం నెలకొంది. కర్ణాటకలోని హాసన జిల్లా బేలూరు చెన్నకేశవ ఆలయంలో శివలింగం, ఇతర శైవాచారాలకు సంబంధించిన సెట్లను నిర్మించారు. అదే సమయంలో ఈ చారిత్రక ఆలయంలోకి భక్తులను కట్టడి చేశారంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. వైష్ణవ ఆలయంలో శైవానికి సంబంధించిన సెట్లను వేయటం, భక్తులను అనుమతించకుండా అడ్డుకోవటం సరికాదని స్థానికులు నిరసన తెలిపారు. వారం రోజులుగా పూజలను సైతం నిర్వహించలేకపోతున్నామని ఆలయ ప్రధాన అర్చకుడు కృష్ణ భట్ ఆవేదన వ్యక్తం చేశారు. మేము అన్ని అనుమతులు తీసుకొనే ఈ మూవీ చిత్రీకరణ మొదలు పెట్టామన్నారు.


