విపత్తుల నివారణకు ఆర్మీ, జీహెచ్ఎంసీ ఉమ్మడి చర్యలపై చర్చ
- 14 Views
- February 18, 2017
- Home Slider రాష్ట్రీయం
రానున్న వర్షాకాలంలో ఎదురయ్యే విపత్తులను ఎదుర్కొనేందుకు ఉమ్మడిగా చేపట్టాల్సిన చర్యలపై జిహెచ్ఎంసి కమిషనర్ డాక్టర్ జనార్ధన్‌రెడ్డి మిలటరీ అధికారులు కలిసి చర్చించారు. గత వర్షాకాలంలో వచ్చిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో నగరంలో ఏర్పడ్డ పరిస్థితులపై సమీక్షిస్తూ తిరిగి రానున్న వర్షాకాలంలో ఏర్పడే అవాంఛనీయ పరిస్థితులను ఎదుర్కొవడానికి జిహెచ్ఎంసితో పాటు ఇతర శాఖలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆర్మీ అధికారులు జిహెచ్ఎంసి కమిషనర్‌కు స్పష్టం చేశారు. భారీ వర్షాలు, వరదల వల్ల నీటమునిగే ప్రాంతాలు, నీటి నిల్వలు, గుంతలు ఏర్పడే ప్రాంతాల వివరాలను తమకు అందించాలని ఆర్మీ అధికారులు కోరారు. కాగా మార్చి 4వ తేదీన నిర్వహించే సిటీ కన్వర్జెన్సీ సమావేశంలో డిజాస్టర్ మేనేజ్మెంట్పై చర్చించడం జరుగుతుందని, ఆ సమావేశానికి హాజరు కావాలని ఆర్మీ అధికారులకు కమిషనర్ సూచించారు. ఈ సమావేశంలో ఆర్మీ అధికారులు హరీష్‌శర్మ, అబిజీత్లతో పాటు జిహెచ్ఎంసి చీఫ్ ఇంజనీర్ శ్రీధర్, ఎస్ఇ కిషన్ తదితరులు పాల్గొన్నారు.


