విశ్వవిఖ్యాత పవిత్ర పుణ్యక్షేత్రం… హరిద్వార్
- 15 Views
- February 18, 2017
- Home Slider అంతర్జాతీయం
ప్రపంచంలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలలో ఒకటైన హరిద్వార్ దేశీయంగా పరమ పవిత్ర హిందూ పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతోంది. ఇది ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. హిందువుల పుణ్యక్షేత్రం. ద్వారం అంటే లోపలకు ప్రవేశించే దారి. హరి అంటే విష్ణువు హరిద్వార్ అంటే హరిని చేరే దారి. ఇది హరిద్వార్ జిల్లాలో ఉన్న ఒక మున్సిపాలిటీ. క్రీ.శ.1888 డిసెంబర్ 28 హరిద్వార్‌కు జిల్లా అంతస్తు ఇవ్వబడింది. క్రీ.శ.2000 సెప్టెంబర్ 9 హరిద్వార్ ఉత్తరఖాండ్ లో ఒక భాగమైంది. ఉత్తరాఖండ్ ఇండియన్ రిపబ్లిక్లో 27వ రాష్ట్రం. ఆధ్యాత్మిక క్షేత్రం నేపథ్యంలోనే ఇది ప్రస్తుతం రాష్ట్ర పారిశ్రామిక కేంద్రంగా కూడా అభివృద్ధి పథంలో ఉంది. హరిద్వార్ అమృతం చిందిన నాలుగు క్షేత్రాలలో ఒకటి. మిగిలిన మూడు అలహాబాద్ లోని ప్రయాగ, ఉజ్జయిని, గోదావరి జన్మ స్థలమైన నాసిక్. సాగరమథనం తరువాత గరుత్మంతుడు అమృతభాండాన్ని తీసుకొని వచ్చే సమయంలో అమృతం నాలుగు ప్రదేశాలలో చిందినట్లు పురాణ కథనం. ప్రస్తుతం ఇవి పుణ్యక్షేత్రాలుగా మారాయి. 12 సంవత్సరాల కాలానికి ఒక సారి ఈ క్షేత్రాలలో కుంభమేళా జరుగుతుంది. 3 సంవత్సరముల వ్యవధిలో ఒక్కొక్క క్షేత్రంలో కుంభమేళా జరపడం ఆనవాయితీ. ప్రయాగలో జరిగే మహాకుంభమేళాకు భక్తులు, యాత్రీకులు ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడ కూడి వేడుక జరపడం ఆనవాయితీ. ఈ సమయంలో భక్తులు గంగా తీరంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తుంటారు. కుంభమేళా సందర్భంగా హరిద్వార్ సమీపంలోని జ్వాలాపూర్లో జరిగే భారీ ఊరేగింపులో పాల్గొనేందుకు విచ్చేసిన హిందూ మత నాయకులూ, సాధు, సంత్‌లకు సంప్రదాయం ప్రకారం అంజుమన్ కామ్ గంధన్ పంచాయత్‌కు చెందిన ముస్లిం పెద్దలు సాదర స్వాగతం పలుకుతారు. హిందూ స్వాములకు ముస్లిం పెద్దలు భక్తి పూర్వకంగా దక్షిణలు సమర్పించి వారి ఆశీస్సులు పొందుతారు. అందుకు ప్రతిగా హిందూ స్వాములు ముస్లిం పెద్దలను ఆలింగనం చేసుకుని వారిని ఆశీర్వదిస్తారు. ముస్లింలకు ప్రసాదాలు అందజేస్తారు. కుంభమేళాలో పెష్వాయ్ సందర్భంగా హిందూ మత నాయకులను ఇలా సత్కరించడం, అలాగే, ముస్లింల ఉత్సవాలకూ, పండుగలకూ ఇక్కడి హిందూ నాయకులు శుభాకాంక్షలు తెలపడం, సత్కరించడం సంప్రదాయంగా వస్తోంది. తరతరాలుగా ఈ ప్రాంతంలో మత సామరస్యం వెల్లివిరుస్తోంది. హరిద్వార్ ప్రకృతి ఆరాధకుల స్వర్గసీమ. హరిద్వార్ భారతీయ సంప్రదాయానికి, నాగరికతకు ప్రతి బింబం. పురాణాలలో ఇది కపిస్థాన్ గానూ, మాయాపురి మరియు గంగాపురిగా వర్ణించబడింది. ఉత్తరఖాండ్‌లో ఉన్న ఈ నగరం చార్ ధామ్ అని పిలవబడే గంగోత్రి, యమునోత్రి, కేదారినాథ్ మరియు బదరీనాథ్‌లకు ప్రవేశ ద్వారం. శైవులు దీనిని హరద్వార్గానూ వైష్ణవులు దీనిని హరిద్వార్గానూ పిలుస్తుంటారు. హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు అని అర్ధం. క్రీ.పూ 1700 నుండి 1300 మధ్య జీవించిన ప్రజలు టెర్రాకోట్టా (బంకమన్నుతో తయారుచేసిన వస్తువులను భట్టీలలో కాల్చి ఉపయోగించే) సంస్కృతి (అనగా, సిరామిక్ వస్తువులను ఉపయోగించేవారు) కలిగివున్నారని పూరాతత్వ పరిశోధనలు ఋజువుచేస్తున్నాయి. క్రీ.శ 629లో భారత దేశంలో పర్యటించిన చైనా హ్యూయన్ త్సాంగ్ రచనల్లో దీని వర్ణన ఉండటం వ్రాత పూర్వకంగా మొదటి సాక్ష్యంగా గుర్తించ బడింది. హ్యూయన్ త్సాంగ్ పర్యటించిన కాలం మహారాజు హర్షవర్ధనుడి (590-647) పరిపాలనా కాలంగానూ హ్యూయ త్సాంగ్ చే ఇది మొ-యు-లోగా సూచించ బడింది. మొ-యు-లో అంటే మాయాపురి సరిహద్దు అని హరిద్వార్ దక్షిణ భాగమని ఊహిస్తున్నారు. మొ-యు-లో ఉత్తర భాగంలో గంగాద్వార్ (గంగా ముఖద్వారం) కోవెల ఉన్నట్లు అతనిచే సూచింపబడింది. 16వ శతాబ్దంలో అక్బర్ పరిపాలనలో అబుల్ ఫజల్ చే వ్రాయబడిన ఆయిన-ఎ-అక్బరీ గ్రంథంలో హరిద్వార్ మాయాపురిగా సూచింపబడింది. జహంగీర్ చక్రవర్తి (1596-1627) పరిపాలనా కాలంలో ఈ ప్రదేశాన్ని సందర్శించిన ఆంగ్లేయ యాత్రికుడు థోమస్ కోర్యాట్ హరిద్వార్‌ని ‘హరద్వారా’ శివుని రాజధానిగా సూచించాడు. కపిలముని ఇక్కడ ఆశ్రమం నిర్మించుకుని నివసించడం వలన ఇది కపిస్థాన్గా కూడా పిలువబడినట్లు పురాణ కథనం. సత్య యుగంలో శ్రీ రామచంద్రుని పూర్వీకుడూ సూర్య వంశరాజు అయిన సరుని కుమారులలో ఒకడైన భగీరథుడు కపిల ముని శాపగ్రస్తులైన తన పితృదేవతలకు 60,000 మందికి ముక్తిని ప్రసాదించగోరి స్వర్గంనుండి గంగా దేవిని ఇక్కడకు రప్పించినట్లు హిందూ పురాణాల వర్ణన. ఈ కారణంగా హిందువులు మరణించిన తమ పితరుల ముక్తి కోసం వారి చితాభస్మం ఇక్కడకు తీసుకు వచ్చి గంగానదిలో కలపడం ఆనవాయితీ. విష్ణుమూర్తి తన పాదముద్రలను ఇక్కడ హరికి పురిలో వదిలి వెళుతున్నానని చెప్పినట్లు పురాణ కథనం. సదా ఈ పాదముద్రలు గంగానదిచే తడపబడటం విశేషం. 1399 జనవరి 13న టర్కీ రాజు ‘తిమూర్ లాంగ్’ (1336-1405) దండయాత్రలో హరిద్వార్ తిమూర్ లాంగ్ వశమైంది.
సిక్కు గురువు ‘గురునానక్’ (1469-1539) హరిద్వార్ లోని ‘కుష్వన్ ఘాట్’లో స్నానం చేసిన సందర్భం వార మతగ్రంథాలైన ‘జన్మసఖి’లో చోటుచేసుకుంది. హరిద్వార్ పురాతన సంస్కృతికి, సంప్రదాయాలతో సుసంపన్న మైన ఆధ్యాత్మిక నగరం. ఆధ్యాత్మిక వారసత్వం కలిగిన హరిద్వార్‌లో ఇప్పటికీ చాలా హవేలీలు, మఠాలు పురాతన చిత్రాలు, శిల్ప సంపదతో విలసిల్లుతున్నాయి. హరిద్వార్ పురాణ కాలంనుండి ప్రస్తుత కాలం వరకు తన పుతారన్త్వాన్ని, ఆధ్యాత్మిక వైభవాన్ని నిలుపుకుంటూ అభివృద్ధి పధంలో పయనిస్తున్న భారతీయ నగరాలలో ఒకటి. హరిద్వార్ బౌద్దుల కాలందాటి, ఆగ్లేయుల పరిపాలన చవిచూసి ప్రస్తుత ఆధునిక కాలంలో కూడా భక్తులను ఆధ్యాత్మికంగా ఆకర్షిస్తూ కొనసాగుతున్న ప్రముఖ హిందూ పుణ్య క్షేత్రాలలో ఒకటి. హరిద్వార్ పడమట సరిహద్దులలో సహరాన్పూర్, ఈశాన్యంలో సరిహద్దులలో డెహరాడూన్, తూర్పున పౌరీ గర్హ్వాల్, దక్షిణ సరిహద్దులలోరూర్కీ, ముజఫర్ నగర్, బిజ్నోర్. హరిద్వార్ జిల్లా ఒకేఒక పార్లమెంట్ నియోజకవర్గాన్ని, 9 ఉత్తరాఖండ్ నియోజకవర్గాలను కలిగి ఉంది. జిల్లా రూర్కీ, హరిద్వార్ మరియు లక్సర్గా మూడు ఉప భాగాలుగా విభజింపబడింది. వాటిని భగవాన్‌పూర్, రూర్కీ, లక్సర్కాన్పూర్, నర్సన్, బహద్రాబాద్గా ఆరు ఉప విభాగాలుగా విభజించారు. జిల్లా ప్రధాన కార్యాలయాలు హరిద్వార్‌కు రైల్వే స్టేషనుకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోష్నాబాద్‌లో ఉన్నాయి. నవోదయా విద్యామందిర్, సేవా ఆయోగ్, సంస్కృత అకాడమీ లాంటి సంస్థలు ఇక్కడ స్థాపించ బడినాయి. హరిద్వార్ గంగానది కొండలను దాటీ మైదానంలో ప్రవేశించే మొదటి ప్రదేశం.గంగా జలాలు ఎక్కువగా స్వచ్ఛంగా ఉంటాయి. వానాకాలం తప్పితే మిగతారోజులలో ఈ జలాలు శీతలంగానే ఉంటాయి.గంగా నది ఇక్కడి నుండి అనేక పాయలుగా విడిపోయి ప్రవహించడం వలన నదీ ద్వీపాల అనేక నదీద్వీపాలు ఏర్పడ్డాయి. ఈ నదీ ద్వీపాలు సమృద్దిగా నీరు లభించడం వలన ఏత్తైన వృక్షాలతో సుందరంగా ఉంటాయి. వర్షాలాలంలో మాత్రం రాణీ పుర్ రావ్, పాత్రి రావ్, రావీ రావ్, హరిణై రావ్, బేగమ్ నది మొదలైన కొన్ని జలపాతాలనుండి నీరు ప్రవహించి చిన చిన్న సెలఏర్లు నదిలో కలుస్తూ ఉంటాయి. జిల్లాలో చాలా భాగం అటవీ ప్రాంతం. జిల్లా సరిహద్దులలో ఉన్న ‘రాజాజీ నేషనల్ పార్క్’ అటవీ జీవితం, సాహస జీవితం గడపాలనుకొనే వారికి గమ్యస్థానం. హరిద్వార్ నగరం వైశాల్యం 2360 కిలోమీటర్లు. ఉత్తరాఖండ్ నైరుతీ భాగంలో ఉంది. హరిద్వార్ సముద్రమట్టానికి 249.7 మీటర్ల ఎత్తులో ఈశాన్యంలో శివాలిక్ కొండలు దక్షిణంలో గంగానదుల మధ్యభాగంలో ఉంది. 2001 జనాభా లెక్కలననుసరించి హరిద్వార్ జనాభా 1,44,213. వీరిలో మగవారు 54%, ఆడవారు 46%. హరిద్వార్ ప్రజల అక్షరాస్యత 70% ఇది దేశ సరాసరి కంటే ఎక్కువ. దేశ సరాసరి అక్షరాస్యత 59.5%. హరిద్వార్‌లో మగవారి అక్షరాస్యత 75% ఆడవారి అక్షరాస్యత 64%. ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల సంఖ్య 12%. వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 15.6 డిగ్రీల సెంటిగ్రేడ్. శీతా కాలంలో 16.6 డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి -06 డిగ్రీల సెంటిగ్రేడ్. మహారాజు విక్రమాదిత్యుడు తన సోదరుడు భర్తృహరి మరణానంతరం అతని జ్ఞాపకార్ధంగా గంగా నది తీరంలో స్నానఘట్టం కట్టించాడని ప్రతీతి. భర్తృహరి ఈ ప్రదేశంలో పవిత్ర గంగానది తీరాన తపసు చేసి ఇక్కడే తనువు చాలించిన కారణంగా అతని పేరుతో ఈ నిర్మాణాన్ని చేపట్టినట్లు ఇక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు. తరువాతి కాలంలో ‘హరి కా పురి’గా నామాంతరం చెందిది.ఈ పవిత్ర స్నాన ఘట్టం బ్రహ్మ కుండ్‌గా కూడా పిలుస్తారు.సాయంకాల సమయంలో గంగాదేవి హారతి ఇచ్చే ఆచారం ఉంది.తరువాత భక్తులు పితృదేవతా ప్రీత్యర్ధం నదీ జలాలలో తేలిపోయే దీపాలను వదులుతుంటారు ఈ దృశ్యం మనోహరంగా ఉండి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. 1800 తరువాత కాలలంలో ఇక్కడి స్నాన ఘట్టాలను పునరుద్ధరించి అభివృద్ధి చేసారు. చండీ దేవి ఆలయం కాశ్మీర్ రాజు సుచత్ సింగ్ చే1929లో గంగానది అవతలి తీరంలో నీల పర్వత శిఖరం పైన నిర్మించబడింది. ఇది చండీఘాట్కు 3 కిలోమీటర్ల దూరంలో నీల్ పర్వత శిఖరంపైన ఉంది. రాక్షసరాజులైన సుంభ-నిశుంభుల సైన్యాధిపతి చండ-ముండ ఈ ప్రదేశంలో చంఢీ దేవిచే సంహరించ బడినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఆ కారణంగా ఆ ప్రదేశం చంఢీఘాట్ పిలువబడుతుంది. ఈ దేవిని ఆదిశంకరాచార్యులు కీ.పూ 8 వ శతాబ్దంలో ప్రతిష్ఠించినట్లు పురాణ కథనం. ఈ దేవాలయాన్ని ఉదయం 8.30 నుండి సాయంత్రం 6 గంటలవరకు కాలిబాటన లేక రోప్‌వే ద్వారా చేరవచ్చు. ఆలయ నిర్వహణ ఫోన్ నంబర్ 01334-220324. మంశాదేవి కోవెల బిల్వ ప్రర్వత శిఖరంపైన ఉంది. మంశాదేవి అంటే మనసులోని కోరికలను తీర్చేదేవి అని అర్ధం. ఇది భక్తుల ఆకర్షణీయ కోవెలలలో ఒకటి. ఈ కోవెలను చూడటానికి కేబులు కారులో ప్రయాణం చేయడం ద్వారా ఊరంటినీ చూడటం భక్తులకు ఆనందమైన అనుభవం.ఈ కోవెలలో రెండు ప్రధాన ఆలయంలో 5 చేతులు మూడు ముఖాలు కలిగిన విగ్రహం ఒకటి, 8 చేతులు కలిగిన విగ్రహం ఒకటి మొత్తం రెండు విగ్రహాలు ఉన్నాయి. 11వ శతాబ్దంలో నిర్మించినట్లు అంచనా. ఇది ఆదిశక్తి ఆలయం. ఇది సిద్ధ పీఠాలలో ఒకటి. ఈ ప్రదేశంలోసతీదేవి హృదయం నాభి పడినట్లు పురాణ కథనం. హరిద్వార్ లో భైరవ ఆలయం నారాయణీ శిలా ఆలయంతో ఇది కూడా పురాతన ఆలయాలలో ఒకటి. హరిద్వార్‌కి దక్షిణంలో ఉన్న కంకాళ్ అనే ఊరిలో సతీదేవి తండ్రి అయిన దక్షుడి ఆలయం ఉంది. పురాణాల ఆధారంగా సతీ దేవి తండ్రి దక్షుడు తలపెట్టిన యాగానికి త్రిమూర్తులలో ఒకడు తన అల్లుడూ అయిన మహాశివునికి ఆహ్వానం పంపలేదు. సటీదేవి పుట్టింటి మీద మమకారాన్ని వదులుకోలేక తన తండ్రిని భర్త అయిన శివుని ఎందుకు పిలవలేదని అడగటానికి పిలవక పోయినా యగ్జానికి వెళుతుంది. అఖ్ఖడ తన భర్త అయిన శివునిను పిలవకుండా యాగం చేయడం అపరాధమని తన తండ్రిని హెచ్చరిస్తుంది. దురహంకార పూరితుడైన దక్షుడు తన కుమార్తెను అవమానించి అల్లుడైన శివుని దూషిస్తాడు. అది భరించలేని సతీదేవి అదే యజ్ఞకుండంలో దూకి ప్రాణ త్యాగంచేస్తుంది. సతీదేవి ప్రాణత్యాగం తెలుసుకున్న శివుడు తన ఆగ్రహంతో వీరభద్రుని సృష్టించి దక్షుణ్ణి సంహరించమని పంపిస్తాడు. వీరభద్రుని చేతిలో మరణించిన దక్షుణ్ణి దేవతలు, దక్షిణి భార్య కోరికపై తిరిగి దక్షుని శరీరానికి మేక తలను అతికించి బ్రతికిస్తాడు. ఈ పురాణ సన్నివేశానికి గుర్తుగా ఇక్కడ దక్ష మహాదేవ్ కోవెల నిర్మించారు. ఈ పక్షులశరణాలయం భీమగోడా ఆనకట్ట దగ్గర ఉంది. నీల్ ధారా సమీపంలో గంగానదిపై నిర్మించిన ఆనకట్ట పేరే భీమ్‌గోడా రిజర్వాయర్. ఇది ప్రకృతి ఆరాధకులకు ముఖ్యంగా పక్షులంటే ఆసక్తి కనబరిచేవారికి ఇది స్వర్గ సీమ. శీతాకాలంలో ఇక్కాడకు వలస వచ్చే విడేశీ పక్షులకు ఇది నివాసం. కంఖాళ్ లో’సతీకుండ్’పౌరాణిక ప్రాముఖ్యత కలిగిన ప్రడేశాలలో ఇది ఒకటి. ఇది సతీ దేవి ఆత్మాహుతి చేసుకున్న యజ్ఞగుండం. హరికి పురి నుండి ఇది ఒక కిలోమీటర్ దూరంలో ఉంది.ఇది పౌరాణిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలలో ఇది ఒకటి. పాండవులు హిమాలయాలలో ప్రయాణిస్తూ హరిద్వార్‌కి వచ్చినప్పుడు రాజకుమారుడు భీమసేనుడు దాహం తీర్చుకోవడానికి మోకాలితో కొట్టడం ద్వారా రాతినుండి రప్పించినప్పుడు ఈ సరసు ఏర్పడిందని పురాణ కథనం. పాలరాతిలో చెక్కిన పాలసముద్ర మథనం దృశ్యాల ప్రదర్శన ఇక్కడికి విచ్చేసే పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. హరిద్వార్‌లోని అత్యంత మనోహర దృశ్య కావ్యం ఇది. సప్తఋషులైన అత్రి, వశిష్ఠుడు, కశ్యపుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, భరధ్వాజుడు, గౌతములకు అనుకూలంగా ఇక్కడ గంగా నది ఏడు భాగాలుగా చీలి ప్రవహిస్తుంది. కంఖాళ్లో హరిహర ఆశ్రమంలో ఉన్న ఈ బ్రహ్మాండ శివలింగం 150 కిలోల బరువు ఉంటుంది. రుద్రాక్ష చెట్టు ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఇది దూధాధారి బర్ఫానీ ఆశ్రమంలో ఒకభాగమైన పాలరాతి కోవెల. ప్రత్యేకంగా రాముడు, సీతా, హనుమంతుని గుడులు యాత్రీకులకు ప్రత్యేక ఆకర్షణ. ఇది రాజాజీ నేషనల్ పార్క్‌లో ఉన్న ఈ సురేశ్వరీ దేవత గుడి. ఇక్కడి ప్రశాంత వాతావరణం యాత్రీకుల మనసు దోచుకుంటూ విస్తారంగా భక్తులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఇది హరిద్వార్‌కి సరిహద్దులలో ఉంది ఇక్కడికి పోవాలంటే అటవీశాఖ అనుమతి పొందవలసి ఉంటుంది. ఆధునిక కాలంలో నిర్మించిన అద్దాల మండపం. ఇప్పుడు ఇది యాత్రీకుల ప్రత్యేక ఆకర్షణ. ఇది అనేక అంతస్తులతో నిర్మించిన గుడి. భారత మాతకు భక్తి భావంతో సమర్పించిన గుడి ఇందులో ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్క శకానికి చెందిన భారత దేశ చరిత్ర చిత్రించారు. రామాయణం మొదలైన పురాణ కాలం నూడి ప్రస్తుత కాలం వరకు చరిత్ర చోటు చేసుకోవడం ఇక్కడి ప్రత్యేకత. ఆనందమయి మా ఆశ్రమ్ హరిద్వార్ ఐదు ఉపనగరాలలో ఒకటైన కంఖాళ్లో ఉంది. సుఫీ సన్యాసి చిష్టి ఆర్డర్ (ఈయనకు సరకార్ కబీద్ పాక్ అనే ఇంకొక పేరు ఉంది) కొరకు 13వ శతాబ్దంలో ఇబ్రహీమ్ లోడీ నిర్మించిన దర్గా.రూర్కేకి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలియార్ గ్రామంలో దర్గా ఆఫ్ హజారత్ అలాదీన్ కాలియార్ పేరుతో నిర్మించిన ఈ దర్గాకు రంజాను మాసంలో నెలబాలుడిని దర్శించడానికి భారత దేశంలోని అనేక భక్తులను ఆకర్షిస్తుంది. చిన్మయా కళాశాలఇది శివాలిక్ నగర్లో ఉంది.ఇది హరిద్వార్‌కు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారతీయ ప్రౌద్యోగిక సంస్థానం (ఐ.ఐ.టీ) రూర్కీఇది హరిద్వార్‌కు అరగంట కారు ప్రయాణ దూరంలో ఉంది. బ్రహ్మాండమైన, అందమైన ఆవరణతో ఉన్న ఈ కళాశాల ఉన్నత భారదేశంలో విద్యను అందించే ప్రముఖ కళాశాలలో ఒకటి. గురుకుల్ కాంగ్రీ విశ్వవిద్యాలయం ఇది హరిద్వార్ జ్వాలాపూర్ బైపాస్ పక్కన గంగాతీరంలో ఉంది.భారత దేశంలోని పురాతన విశ్వవిద్యాలయాలలో ఇది ఒకటి. ఇది ఆర్యసమాజ స్థాపకుడైన శ్రద్ధానంద సరస్వతి (1856-1926)చే స్థాపించబడింది. ప్రారంభంలో ఇది కుటీరాలలో నిర్వహించబడింది. ప్రాచీన ఇక్కడ వేదాలు, సంస్కృతం, ఆయుర్వేదం, వేదాంతం మొదలైనపాఠ్యాంశాలతో ఆధునిక శాస్త్రాలైన సైన్స్ (సామాన్య శాస్త్రం) జర్నలిజం కూడా బోధించబడతాయి. 1945లో స్థాపించిన ఇక్కడి ఆర్కియాలజీ మ్యూజియమ్‌లో హరప్పా నాగరికత (క్రీ.పూ3500-1500క్రీ.పూ) నుండి ప్రస్తుత కాలం వరకు ఉపయోగంలోఉన్నఅనేక శిల్పాలు, నాణ్యాలు, చిత్రాలు, మూల గ్రంథాలు, ఇతర కళాఖాండాలు ఉన్నాయి.మహాత్మా గాంధీ ఇక్కడకు మూడుసార్లు వచ్చి కొంత కాలం ఇక్కడి ప్రశాంత వాతావరణంలో గడిపాడు. విశ్వ సాంస్కృతిక మహా విద్యాలయ ప్రాచీన సంప్రదాయానికి, నాగరికతకు, ఆచారాలకు, సంస్కృతికి మొదలైన పాఠ్యాంశాలతో సంస్కృత మూలగ్రంధాలు లభించే ఒకేఒక విశ్వవిద్యాలయం. ఇటువంటి విశ్వవిద్యాలయం ప్రపంచంలో ఇది ఒకటే. ఎస్.టి మేరీస్ సీనియర్ సెకండరీ స్కూల్ ఇది జ్వాలాపుర్లో ఉంది. ఇది పిల్లలకు ఉన్నతశ్రేణి విద్యను అందించడంలో మొదటి స్థానంలో ఉంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, రాణీపుర్ఇది ప్రముఖ విద్యాసంస్థలలో ఒకటి.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్‌లో ఇది ఒకటి.ఉన్నత విద్యాప్రమాణాలు కలిగి ప్రత్యేక వసతులు కలిగి, ప్రయోగ శాలలు అద్భుత వాతావరణం కలిగిన విద్యాసంస్థలలో ఇది ఒకటి. డి.ఎ.వి సెంట్రల్ పబ్లిక్ స్కూల్ఇది జగజిత్పూర్లో ఉన్న ఈ విద్యాసంస్థ తన విద్యార్థిలకు పాఠ్యాంశాలనే కాక నీతిని చక్కగా బోధించడం కారణంగా ఇక్కడ చదివిన విద్యార్థులు ప్రపంచం నలుమూలల ప్రకాశిస్తున్నారు. కేంద్రీయ విద్యాలయ బి,హెచ్.ఇ.ఎల్ ఇది హరిద్వార్‌లోని ముఖ్య పాఠ శాలలో ఒకటి.ఇది 1975 జూలై 7న ప్రారంభించ బడింది. ఇది ప్రభుత్వానికి చెందిన విద్యాసంస్థ సెంట్రల్ బోర్డ్ సెకండరీ ఎజ్యుకేషన్ (మాధ్యమిక పాఠశాల). ఇక్కడ ప్రీ-ప్రైమరీ నుండి సీనియర్ సెకండరీ (7వ తరగతి) వరకూ తరగతులను నిర్వహిస్తారు. విద్యార్థుల సంఖ్య 1728. మతపరంగా ముఖ్యత్వం ఉన్న నగరం కనుక ఇక్కడ సంవత్సరం అంతా ఉత్సవాలు జరుగుతుంటాయి. వీటిలో ముఖ్యమైనవి సోమవతి అమావాస్య మేళా, గుఘల్మేళా దీనిలో 20-25 లక్షల భక్తులు పాల్గొంటారు. 12 సంవత్సరాలకు ఒక సారి జరిగే కుంభమేళా. గురు గ్రహం కుంభరాశిలో ప్రవేశించే సమయంలో 12 రోజుల పాటు జరిగే ఉత్సవం ఇది. 629 క్రీ.శ. చైనా పర్యాటకుడు హ్యూయన్ త్సాంగ్ (602-664) వ్రాసిన గ్రంథంలో ఈ ఉత్సవాన్ని గురించిన వర్ణన మొదటి రాతపూర్వక రుజువు. 1988లో జరిగిన కుంభమేళాలో 1 కోటి మంది భక్తులు, కుంభమేళా సమయంలో గంగా స్నానమాచరించటానికి ఇక్కడకు వచ్చి చేరినట్లు అంచనా. దేవగురువైన బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు కుంభమేళా ఉత్సవం ప్రారంభమవుతుంది. ఇది ప్రతి 12 సంవత్సరాలకొకసారి జరుగుతుంది. ఇదికాక ప్రతి 6 సంవత్సరాలకొకసఅరి అర్థమేళా జరుగుతుంది. ఈసారి అర్థమేళా, కుంభమేళా రెండూ 2010లో ఇక్కడ జరగనున్నాయి. మంశాదేవి, చండీదేవి, మాయాదేవి అనే ముగ్గురమ్మలు హరిద్వార్ లో వెలిసిన శక్తి రూపాలు. మంశా పహాడ్ మీద మంశాదేవి, నీలపర్వతం మీద చండీదేవి ఆలయాలున్నాయి. ఇక్కడ కంఖాల్ దేవాలయాల సముదాయంలో బృహదీశ్వరాలయం, దక్షమహాదేవాలయం, సతీకుండ్ ఉన్నాయి. ఈ ప్రాంతంలో పూర్వం దక్ష ప్రజాపతి యజ్ఞం చేసాడని చెబుతారు. ప్రాచీన భారతదేశంలోని ఆశ్రమాలు విద్యవిధానం ఇక్కడ కనిపిస్తాయి. శివానందాశ్రమం, స్వర్గాశ్రమ్, పరమార్థ్ నికేతన్, గీతాభవన్ వీటిలో ముఖ్యమైనవి. గీతాభవన్‌లో ఉచిత ఆయుర్వేద వైద్య కేంద్రం ఉంది. ఇక్కడ భారతమాత మందిరం ఉంది. ఈ మందిరాన్ని 1983లో ప్రధాని ఇందిరా గాంధీ ప్రారంభించారు. చీలాడమ్ ఇది చక్కని విహార కేంద్రం.ఇక్కడ కృత్రిమ సరస్సు ఒకటి నిర్మించారు. ఏనుగులు, ఇతర అడవి జంతువులను ఇక్కడ చూసే వీలుంది. శివాలిక్ పర్వతపాద ప్రాంతంలోని జంతువుల సంరక్షణకోసం ఏర్పాటుచేసింది రాజాజీ నేషనల్ పార్కు. సుమారు 820 చ.కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న కేంద్రంలో 150 ఆసియా ఏనుగులు, 23 రకాల క్షీరదాలు, 315 పక్షిజాతులు చూడవచ్చును. ఢిల్లీ మనాపాస్ను కలుపుతూ నిర్మించిన 58వ జాతీయ రహదారిలో ప్రయాణించి హరిద్వార్‌ను చేరవచ్చు. హరిద్వార్‌లోని రైల్వే స్టేషను నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలను చేరటం సులువే. సమీపంలో ఉన్న విమానాశ్రయం డెహరాడూన్‌లోని జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్. అయినప్పటికీ ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం ద్వారా వెళ్ళడమే సౌకర్యంగా ఉంటుంది. బి.హెచ్.ఇ.ఎల్ టౌన్ షిప్ 12 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న ఈ సంస్థ నవరత్న ప్రభుత్వ పరిశ్రమలలో ఒకటి. ది హెవీ ఎలెక్ట్రానికల్ ఎక్విప్మెంట్ ప్లాంట్, సెంట్రల్ ఫౌండరీ ఫోర్గ్ ప్లాంట్, ఈ పశ్రమలలో 8,000 మంది నిపుణులను ఉద్యోగాలలో నియమించారు. ఆరు విభాగాలుగా విభజింప టౌన్ షిప్లో ఉన్నత ప్రమాణాలు కలిగిన గృహాలూ, పాఠశాలలు, ఆరోగ్యసదుపాయాలు మొదలైన అన్ని వసతులు కలిగి ఉంది. బహద్రాబాద్ ఇది హరిద్వార్ ధిల్లీ హైవేలో హరిద్వార్‌కి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది.1955లో అప్పర్ గంగా కెనాల్ దగ్గర నిర్మింపబడిన విద్యుదుత్పత్తి కేంద్రం బహద్రాబాద్ సమీపంలోని పత్రీ పల్లెలో ఉంది. ఖేడ్లి, కిసాన్పుర్, రొహాల్కి, బోంగ్లా, సీతాపూర్, అలిపూర్ మొదలైన పల్లెలల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన బ్లాక్ డెవల్ప్మెంట్ కార్యాలయం ఉంది. 2034 ఎకరాలలో విస్తరించి ఉన్న పారిశ్రామిక ప్రాంతం ఇక్కడి ప్రత్యేకతల్లో ఒకటి. ఉత్తరాంచల్ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి రంగంచే నిర్వహించ బడుతున్న ప్రభుత్వ రంగ సంస్థ.హిందూస్థాన్ లీవర్, డాబర్, మహీంద్రా&మహీంద్రా మొదలైన ప్రముఖ సంస్థలు ఇక్క్డడ తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి.. ఢిల్లీ, హరిద్వార్ హైవేకు మూడు కిలోమీటర్ల దూరంలో రెండవ పారిశ్రామిక నగర నిర్మాణానికి సన్నాహాలు చేస్తుంది. బి.హెచ్.ఇ.ఎల్ టౌన్షిప్ ఆనుకొని టౌన్షిప్ అభివృద్ధి చేసే ప్రయత్నాలు ప్రారంభించింది. జ్వాలాపుర్ హరిద్వార్ పురాతన ప్రదేశం.జ్వాలాపుర్ హరిద్వార్ యొక్క ఆర్థిక, పారిశ్రామిక కేంద్రం. వాణిజ్య కేంద్రం, ప్రజావసరాల కొరకు షాపింగ్ సెంటర్ కూడా ఇక్కడ ఉన్నాయి. శివాలిక్ నగర్ఇది హరిద్వార్ లోని బ్రంహాండమైన అధునాతన నివాసగృహ సముదాయాలున్న ప్రదేశం.ఇది వివిధ విభాగాలుగా విభజించి నిర్మించిన గృహ సముదాయం.ఇది బి.హెచ్.ఇ.ఎల్ఉద్యోగుల కోసం నిర్మించారు.


