సేవచేయాలనే తపన కలిగి ఉండాలి: ఏయూ రిజిస్ట్రార్
- 14 Views
- February 18, 2017
- Home Slider రాష్ట్రీయం
సేవచేయాలనే తపన కలిగి ఉండాలని తద్వారా సర్పంచ్లు గ్రామాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయగలరని ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు అన్నారు. శనివారం ఉదయం ఏయూ దుర్గాబాయి దేశముఖ్ మహిళా అధ్యయన కేంద్రంలో నిర్వహిస్తున్నమహిళా సర్పంచ్ల శిక్షణ కార్యక్రమం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ మహిళల్లో రాజకీయ చైతన్యం పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళ మంచి ఆర్ధిక వేత్తలుగా నిలుస్తారన్నారు. గ్రామాలలో రవాణా, వైద్యం, శౌచాలయాలు వంటి ప్రాధమిక వసతులను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలు అందించే పథకాలను సద్వినియోగం చేయాల్సి ఉందన్నారు. కేంద్రం సంచాలకులు ఆచార్య బి.రత్నకుమారి మాట్లాడుతూ స్త్రీల సమస్యలపై సహకారం అందిస్తామన్నారు. 24 మంది మహిళా సర్పంచ్లు శిక్షణలో పాల్గొన్నారన్నారు. చైతన్య స్రవంతి అద్యక్షురాలు షిరీన్ రెహ్మాన్ మాట్లాడుతూ మహిళలు తమ హక్కులపై ప్రశ్నించాలన్నారు. రిజర్వేషన్ లేకున్నా ప్రగతి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. నియమావళిని అనుసరించి, అమలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా సంక్షేమానికి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతీ గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో ఆచార్య కె.నిరుప రాణి, టి.సాంబశివరావు, మేరి సుజాత తదితరులు పాల్గొన్నారు. అనంతరం శిక్షణ పూర్తిచేసిన సర్పంచ్లకు యోగ్యతా పత్రాలను ప్రధానం చేశారు.


