ఆస్కార్ వేదికపై ఓంపురికి నివాళి
- 9 Views
- February 27, 2017
- Home Slider సినిమా
లాస్ ఏంజిల్స్: ప్రతిష్ఠాత్మక అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా భారతీయ నటుడు ఓంపురికి ఘన నివాళి అర్పించారు. వెండితెరపై నటుడిగా తనదైన ముద్రవేసిన ఓంపురి ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఓంపురితో పాటు ‘స్టార్‌వార్స్’ నటి క్యారీ ఫిషర్, డెబ్బీ రేనాల్డ్స్, బిల్ పాక్సటన్లను కూడా నివాళులర్పించారు. చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించి ఇటీవల కన్నుమూసిన వారిని స్మరిస్తూ నటి జెన్నిఫర్ ఎనిస్టన్ ఓ వీడియోను ప్రదర్శించారు. బిల్ నన్, జార్జ్ కెన్నడీ, జెనీ వైల్డర్, పాటీ డ్యూక్, గ్యారీ మార్షల్, ఎంటాన్ ఎల్చిన్, మ్యారీ టేలర్ మూరే, ప్రిన్స్, జాన్ హర్ట్, నాన్సీ రియాగన్, కర్టిస్ హన్సన్లను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
Categories

Recent Posts

