నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి
ఉక్కు మంత్రికి వినతిపత్రం అందజేసిన
మాజీ మేయర్ పులుసు జనార్థన రావు
గాజువాక, ఫీచర్స్ ఇండియా: ఉక్కు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని, గాజువాక పరిసర ప్రాంతంలో మౌళిక వసతులు కలిపించాలని కోరుతూ కేంద్ర గనుల శాఖ మంత్రి బీరేంద్రసింగ్‌కు, మాజీ మేయర్ బిజెపి నేత పులుసు.జనార్ధనరావు వినతి పత్రం సమర్పించారు. విశాఖ పర్యటన ముగించుకుని ఢిల్లీకి పయనమయ్యేందుకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న కేంద్రమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి సమర్పి ంచరు. నిర్వాసితులు, ఆర్ కార్డుదా రులకు ఉపాధి అవకాశాలు నూరుశాతం కలిపించాలని కోరారు. దీంతో పాటు జీవీఎంసీ 50వ వార్డు వికాస్ నగర్ లోని ఇండోర్ స్టేడియం,స్టీల్ సిటీ ప్రభుత్వ న్యూ ఐటిఐ ల వరుకు వాకింగ్ ట్రాక్ లను ఏర్పాటు కోరారు. దీనికోసం స్టీల్ ప్లాంటు లో నిరుపయోగంగా ఉన్న పాత కన్వేయర్ బెల్ట్‌ను ఇప్పించ వలసిందిగా వినతిలో పేర్కొన్నారు. వెంటనే స్పందించిన కేంద్రమంత్రి పక్కనే ఉన్న ఉక్కు సీఎండీ మధుసూధనరావుకు కన్వెయర్ బెల్ట్ ఉచితంగా అందచేయాలని సుచించారు. వినతి సమర్పించిన వారిలో బి.వి.ఎస్. ప్రకాష్ రావు, గరికిన . పైడి రాజు, కె.ప్రకాష్, డా.జ్ఞానేశ్వర్రావు ఉన్నారు.


