ప్రజా సంక్షేమమే టీడీపీ ధ్యేయం
బీటీ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే బండారు
సబ్బవరం ఫీచర్స్ ఇండియా : మండలంలో పలు అభివృద్ధి పనులకు అనకాపల్లి ఎంపి ముత్తంశెట్టి శ్రీనివాస్, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ లాలం భవానీలు శంఖు స్థాపన చేశారు.
రూ.2.20 లక్షలతో పినగాడి కె.కోటపాడు రోడ్డు నుండి ఎల్లిప్పి, బొటివలస రోడ్డుకు, కోటి 74లక్షల వ్యయంతో సబ్బవరం, వెంకన్నపాలెం రోడ్డు, సబ్బవరం- అనకాపల్లి రోడ్డుకు వయా గాలి భీమవరం, పల్లవానిపాలెం గ్రామం వరకూ బి.టి రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు ఎంపి తెలిపారు. అలాగే సబ్బవరం నరవ రోడ్డు నుండి చింతగట్ల అగ్రహారం వరకూ రూ.54 లక్షలుతో రోడ్డు నిర్మాణం చేపట్ట నున్నారు. ఎం.ఇ.ఎస్ నుండి సబ్బవరం రోడ్డు నుండి అప్పయ్యపాలెం మరియు అమరపిన పాలెం, తమ్మయ్యపాలెం వరకూ కోటి 34లక్షలతో రోడ్డు పనులకు శంఖు ప్థాపన చేశామన్నారు. ప్రజా సంక్షేమమే టిడిపి ప్రభుత్వ ద్యేయమన్నారు.
గ్రామాల అభివృద్ధికి టిడిపి పాటుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఈ.సి.ఎస్. ఛైర్మన్ అప్పారావు, గవర శ్రీను, గేదెల సత్యనా రాయణ, శరగడం శంకరరావు, మడ్డు సూర్యనారాయణ, పల్లా తాతారావు, కోరాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


