ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి
యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పిలుపు
యలమంచిలి, ఫీచర్స్ ఇండియా: ఎన్నికలు సమీ పిస్తున్న నేపధ్యంలో ప్రతి కార్యకర్తా సైనికుడిలా వ్యవహరించాలని ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు అన్నారు. సంస్థాపరమైన ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లా డారు. రాంబిల్లి, యలమంచిలి మండలాలకు చెందిన పార్టీ నాయకుల్ని ఎన్నుకున్న సందర్భంగా ఆయన పార్టీ సీనియర్ నాయకుడు ఆడారి తులసీ రావు ఇంట్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడుగా ఎన్నికైన ఆడారి ఆనందకుమార్, మండల పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన కాండ్రకోట చిరంజీవి లను అభినందించారు. రాంబిల్లి మండల అధ్యక్షునిగా దిన్‌బాబు ఎంపికయ్యారు.
కార్యకర్తలంతా క్రమశిక్షణతో పనిచేయాలని, జరుగుతున్న అన్ని సమావేశాల్లోను ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను పజలకు వివరించాలని కోరారు.