భవిష్యత్తు అంతా ఫౌల్ట్రీ రంగానిదే
- 28 Views
- admin
- April 25, 2017
- జాతీయం తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
ఏడేళ్లలో రెట్టింపు ఉత్పత్తి 500 గుడ్లు స్థాయికి కోడి
నా గుడ్డు.. నా రేటు.. నా జీవితం నెక్ నినాదం గతి తప్పుతోందా?
ఏ బ్రీడ్ అన్నది కాదు నాణ్యమైన గుడ్డు, మాంసం ఉత్పత్తి ముఖ్యం
రైతుకు దిగులు పరిశ్రమకు జిగులు
ఫీచర్స్ ఇండియాతో శ్రీనివాస హేచరీస్ అధినేత సురేష్ రాయుడు
ఫౌల్ట్రీ రంగం దిశ మారిపోతోంది. సంప్రదాయ విధానాల నుంచి పరిశోధన దిశలో ఫౌల్ట్రీ వెళ్తోంది. కేవలం రైతు లాభం మాత్రమే కాక వినియోగదారుడి ఆరోగ్యంపై కూడా శ్రద్ద కూడా పెరిగింది. ఈ దశలో గుడ్డు వినియోగం పెరగటంతో ఫౌల్ట్రీ రంగం విస్తరిస్తోంది. ఈ పరిస్థితిలో సంప్రదాయ ఫౌల్ట్రీ యజమానులు ఆ స్థాయికి ఎదిగే ఆర్థిక వనరులు ఉన్నాయా ? పెరిగిన వినియోగానికి తగ్గట్టు గుడ్డు ఉత్పత్తి ఆస్కారం ఉందా ? ఇలాంటి దశలో ఫౌల్ట్రీ రంగంలో కీలకంగా వ్యవహరిస్తున్న శ్రీనివాస్ హేచరీస్ అధినేతతో ఫీచర్స్ ఇండియా ప్రతినిధి ముఖాముఖి.
ప్రశ్న. కోడి పుట్టుక భారత్.. కానీ ఇప్పుటికి కూడా విదేశీ బ్రీడ్ పై ఆధారపడుతున్నాం. మార్పు అవసరం లేదా ?
జవాబు. నిజమే వేల సంవత్సరాల క్రితం భారత్ లోనే కోడి పుట్టింది. వినియోగం కూడా మొదలైంది. అడవుల్లో, ఇంటి వెనుక ఇలా కోడి, గుడ్డు అందుబాటులో ఉండేవి. కానీ భారత సంప్రదాయ స్థాయి నుంచి మార్పులేదు. ఈ దశలో 70 నుంచి 80 సంవత్సరాలు విదేశాల్లో ఎన్నో ప్రయోగాలు జరిపిన తరువాత ఈ స్థాయికి కోడి గుడ్డు వ్యవస్థ వచ్చింది. కేవలం రుచిలోనే కాక ఆరోగ్యం, ఉత్పత్తి అన్నది కీలకం. ఆ రకంగా విదేశీ బ్రీడ్ వినియోగం కొనసాగుతోంది. ఈ దశలో స్వదేశీ బ్రీడ్ అన్న అవసరం లేదన్నది నా అభిప్రాయం. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారడం అవసరం.
ప్ర. బాబ్ కాక్ లాంటి బ్రీడ్ కు మంచి డిమాండ్ ఉంది. ఏంటి ప్రత్యేకత ?
జ. కోడి గుడ్డు అనేది ఇప్పుడు జనంలో ప్రాచూర్యం పొందింది. నాటు కోడి రుచి అన్న ఆలోచన కొందరిలో ఉన్నా వండటంలో శ్రద్ద లేకుంటే రుచి రాదు. అదే బాయిరల్ అయితే సులభంగా తయారు చేసుకోవచ్చు. అలాగే రైతు పరంగా గతంలో కిలో మాంసం రావాలంటే రెండు, రెండున్నర కిలోల దానా వేయాలి. అదే ఇప్పుడు కిలోన్నర దానాతో కిలో మాంసం కోడిని ఇప్పుడు పొందగలగుతున్నాం. దానా ధర పెరిగిన తీరున కోడి గుడ్డు, మాంసం ధర పెరగటం లేదు.గతంలో మటన్ ధర తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు చికెన్ ధర అందుబాటులోకి వచ్చింది. ఇక కోడి గుడ్డు సామర్థ్యం కూడా పెరిగింది. 1998 కాలంలో ఓ కోడి 300 గుడ్లు అందిస్తే ఇప్పుడు 500 గుడ్లు అందించే స్థాయి వస్తోంది.
ప్ర. కోడి గుడ్డు, మాంసం వినియోగం పెరిగింది. కానీ రైతుకు మాత్రం గిట్టుబాటు ధర లేదన్న మాట వినిపిస్తోంది. మరి ధర నిర్ణయిుంచేది నెక్? అలాంటప్పుడు గుడ్డుకు గిట్టు బాటు ధరకల్పించలేకపోతున్నారు ఎందువలన?
జ. నిజమే రైతులను దగ్గర చేసే క్రమంలో బీవీ రావు గారి సమయంలో ఆవిర్భావం జరిగింది. చాలా వరకు రైతులు, ఫౌల్ట్రీ రంగం విస్తరించింది. అందరూ కలిసి ఐక్యతగా ఎంతో కొంత ఈ రంగంలో సంపాదించారు. కానీ ఇప్పుడు నెక్ పరిధిలోని రైతులు లక్షల నుంచి కోట్ల స్థాయికి ఎదిగారు. సరకు ఉత్పత్తి, డిమాండ్ బట్టి త్వరిత గతిన విక్రయించాలని ఫౌల్ట్రీ రైతు ఆలోచిస్తున్నాడు. ఇక ట్రేడర్ నిర్ణయం కూడా కీలకమైంది. రైతు పరిస్థితిని ఆసరాగా తీసుకుని ట్రేడర్ ధరను నిర్ణయించే దశకు ఎదిగాడు. ఇది ఆర్థిక పరమైన అంశం. ఆ అంశాన్ని అధిగమించే పరిస్థితి నెక్ చేయలేదు. ఈ విషయమై గత కొంతకాలంగా నెక్ ఆలోచిస్తోంది. రైతు ధర పెరిగినా, తగ్గినా వినియోగదారుడి ధరలో మార్పు రావడం లేదు. దీనికి ఏం చేయాలి. అన్న విషయమై చర్చ జరుగుతోంది. ఒక రకంగా నా గుడ్డు… నా రేటు.. నా జీవితం అనే నెక్ నినాదం కొంత గతి తప్పిందనే చెప్పాలి. కానీ సరిదిద్దే ఆలోచనలో ఉన్నాం.
ప్ర. గుడ్డు శాఖాహారం అనే ప్రచారం విస్తరించింది. కానీ గుడ్డు వినియోగం ఆ స్థాయిలో పెరగలేదు ఎందుకు?
జ. నిజమే గుడ్డు శాఖాహారం అనే మాట విస్తరించింది. దీని ఆధారంగానే గుడ్డు వినియోగం పెరగాలన్నది సరైన వాదన కాదు. శాఖాహారం అన్న మాట కలిసొచ్చిన విషయమే. కానీ గుడ్డు వినియోగం వల్ల కలోస్ట్రాల్ పెరుగుతుంది… గుండెపోటు వస్తుందన్న అపోహలు తొలిగిపోయాయి. మన దేశంలో చూస్తే ఏడాదికి గతంలో 20 గుడ్లు తినేవాళ్లం,, ఇప్పుడు 65కి మించి వినియోగిస్తున్నాం. దశల వారీగా పెరగాలి. ఒకేసారి వినియోగంపెరిగినా అవసరమైన దానా కూడా అందుబాటులో ఉండాలి కదా.. ఒకేసారి పెరిగితే మార్కెట్ గందరగోళానికి దారి తీస్తుంది. ఏదైనా గుడ్డు వినియోగం పెరుగుతుంది. ఈ దశకు తగ్గట్టు రైతు సిద్దంగా ఉంటాడా లేకా మరో కార్పొరేట్ వ్యక్తి వస్తారన్నది మనం చెప్పలేదు. నిజానికి గుడ్డు ఆరోగ్యం అన్న విషయం తెలిసి ప్రపంచం గుడ్డు కోరుకుటోంది. జపాన్ లో ప్రతీ వ్యక్తి ప్రతీ రోజు ఓ గుడ్డును తీసుకుంటున్నారు. దీనికి తగ్గట్టు దీరాెయిష్పు జపనీస్ లో ఉంది. ఇలా ఆలోచిస్తే త్వరిత గతిన గుడ్డు వినియోగం పెరుగుతోందన్నమాటలు మాత్రం వాస్తం.
ప్ర. ఫౌల్ట్రీ రంగం నగర శివారులోకి పరిమితమైందన్నమాట ఉంది. మరి గ్రామాలకు విస్తరించదా? ప్రభుత్వపరమైన సహాయం తీసుకుంటారా?
జ. ఫౌల్ట్రీ రంగం నిజానికి గ్రామాల కు అందుబుటలోనే ఉండేవి. ఇంకోరకంగాఅర్బన్ శివారులో ఉండేవి. కానీ ఇప్పుడు నగరం విస్తరించడంతో నగరానికి దగ్గరైనట్టు అనిపిస్తోంది. ఈ దశలో గ్రామాల్లో మాత్రం గుడ్డు వినియోగం పెంచే బాధ్యత ప్రభుత్వంతో పాటు మాపై కూడా ఉంది. గుడ్డు వినియోగం పెరిగితే మా ఫౌల్ట్రీ యజమానులు కూడా లాభ పడతారు కదా. ఇక్కడ మార్కెట్ పరంగా గ్రామాలతో పోల్చితే అర్బన్ లో అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే అమ్మకం దారులు గ్రామాల కంటే నగరాలపై ద్రుష్టి పెడుతున్నారు. ఇందులో కొంత మార్పు రావాల్సి ఉంది.
ప్ర. ఫౌల్ట్రీ రంగానికి ప్రభుత్వ సహాయం ఎలా ఉంది?
జ. బాగానే ఉంది. తాజా ప్రభుత్వం చాలా సందరాÄల్లోే మీ అవసరాలు చెప్పండి అని అడుగుతున్నారు. ఇది శుభపరిణామం, ఏ ప్రభుత్వం ఇవ్వని రీతిన సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇచ్చింది. అంగన్ వాడీ కేంద్రాల్లో గుడ్డు అందించాలని కూడా ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. ఇది కలిసొచ్చే అంశమే. కేవలం గుడ్డు ఉత్పత్తి చేయడం, అమ్మడం మాత్రమే కాదు గుడ్డు నాణ్యతలో తీసుకోవాల్సిన శాస్త్రీయ అంశాలపై శ్రద్ద చూపించాలని సీఎం కూడా చెబుతున్నారు. నాణ్యత పెరిగితే ధర పెరిగినా వినియోగదారులు పెరుగుతారు. భవిష్యత్తు మాత్రం బాగానే ఉంటుంది. నిజానికి వారానికి కనీసం మూడు గుడ్లు తీసుకోవాలి అన్న విషయం గ్రామీణ ప్రాంతాలకు తీసుకువెళ్లే యోచన కూడా మాలో ఉంది.
7. మార్కెట్ లో మన స్థానంలో మార్పు ఉండదా ?
జ. ఇండియాలో గుడ్డు ఉత్పత్తి పెరిగింది. మూడు గుడ్లులో ఒక గుడ్డు మన ఎపీ నుంచే వెళ్తున్నాయి. దేశంలో 30 శాతం ఎపీ వాటా. ఇండియాలో గుడ్డు వినియోగం 100 కు పెరిగిందంటే ఈ స్ధాయిలో మన 30 శాతం సరఫరా చేయలగలమా. ఆ స్థితికి రావాలంటే మనలో మార్పు రావాలి. ఏది అసాధ్యం కాదు కానీ ఇప్పుడు ఉత్పత్తి ఆరోగ్యం కరంగానే ఉంది. గుడ్డుతో పాటు మొక్క జొన్న లాంటి దానా అవసరం ఉంది. ప్రస్తుతం చూస్తే మూడు వేల మిలియన్ టన్నుల మొక్క జొన్న అందుబాటులో ఉంది. దీన్ని 2020 నాటికి పది వేల టన్నులకు విస్తరించాలన్నది ప్రభుత్వం లక్ష్యం కూడా. ఒక విషయం గత 50 సంవత్సరాల్లో చేసిన ప్రగతి రానున్న 3 నుంచి అయిదు సంవత్సరాల్లో ఫౌల్ట్రీ రంగం సాధించాలి. దీనికి తగ్గట్టు రైతులు సిద్దంగా ఉండాల్సి ఉంది.
జ. మార్కెట్లో శ్రీనివాసా హేచరీస్ స్థానం?
జ. కోస్తా వరకు మేం పరిమితమయ్యాయి. శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు వ్యాపారం విస్తరించి ఉంది. ఆరోగ్యకరంగా మా వ్యాపారం ఉంది. అంత కంటే ఆశించడం లేదు. బ్రాయిలర్ కూడా హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నాం. ఫీడ్ కూడా ప్రతీ ఏటా 30 నుంచి 40 శాతం విస్తరిస్తున్నాం. మా వ్యాపారం మరో చోటకు విస్తరించడం కంటే ఇక్కడే మార్కెట్ ఉంది. ఇందులో రైతులతో పాటు మేం విస్తరిస్తే సరిపోతుంది. రానున్న ఏడేళ్లలో రెట్టింపు వ్యాపారం జరుగుతుందని అంచనాలు ఉన్నాయి. అలా జరిగితే మాకు లాభం కాబట్టి. ఆ క్రమంలోనే మా ఆలోచన కూడా సీరియస్ గానే ఉన్నాయి.