ఘనంగా నూకాంబిక అమ్మవారి నెల పండుగ
- 27 Views
- admin
- April 26, 2017
- రాష్ట్రీయం స్థానికం
కంచరపాలెం, ఫీచర్స్ ఇండియా :
జీవీఎంసీ 36వ వార్డు దేవేంద్రనగర్లో వెలసిన శ్రీనూకాంబిక అమ్మవారి నెల పండుగ జాతరను ఘనంగా నిర్వహించారు. కంచరపాలెం పరిసర ప్రాం తాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావటంతో ఆలయం కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. 35, 36, 37వ వార్డు టిడిపి, బీజేపీ, వైఎస్ఆర్ సీపీ నాయకులు అమ్మవారిని దర్శించు కొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం అమ్మవారి ఆలయం నుండి ఐటీఐ జంక్షన్ శ్రీరామ్‌నగర్ మీదుగా తిరిగి దేవేంద్రనగర్ వరకూ ఊరేగింపు నిర్వహించారు. భక్తులు ఒంటి నిండా శూలాలు గచ్చుకొని, కావడీలతో ఆడుతూ పాడుతూ అమ్మవారి ఆలయానికి చేరుకు న్నారు. అనంతరం అగ్నిగుండం తొక్కే కార్యక్రమంలో భక్తులు పాల్గొని, మొక్కులు తీర్చుకున్నారు. జాతర సందర్భంగా నిర్వహిం చిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.