జగపతి బాబు స్టన్నింగ్ లుక్
వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. వెరైటీ పాత్రలలో నటిస్తూ అందరి అభిమానాలు అందుకుంటున్నాడు. ఒక వైపు టైటిల్ రోల్ ప్లే చేస్తూనే మరో వైపు సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో నటిస్తున్నాడు. ప్రస్తుతం అర్జున్ వసుదేవ్ దర్శకత్వంలో సూర్యా భాయ్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు జగపతి బాబు. ఈ సినిమా ఇటీవల ఓ షెడ్యూల్ పూర్తి చేసుకోగా తర్వాతి షెడ్యూల్‌ని మే 5 నుండి జరుపుకోనుంది. చిత్ర నిర్మాతలు ఈ చిత్రాన్ని జూలై లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఆనంద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో జగపతి బాబు సరసన పాపులర్ హీరోయిన్ కథానాయికగా నటించనుందట. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో జగపతి లుక్ చాలా స్టన్నింగ్ గా ఉంది. ఇక జగపతి బాబు ప్రధాన పాత్రలో ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘పటేల్ ఎస్.ఐ.ఆర్’ అనే మూవీ కూడా తెరకెక్కుతుంది. డెబ్యూ డైరెక్టర్ వాసు పరిమి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా వారాహి చలన చిత్రం బేనర్ పై సాయి కొర్రపాటి ఈ చిత్రం ను నిర్మిస్తున్నాడు. జగపతి బాబు ఈ చిత్రంలో కంప్లీట్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు. ఇటీవల ఈ చిత్ర టీజర్ కూడా విడుదలైంది.


