దొరకునా ఇటువంటి సేవ…
- 16 Views
- admin
- April 26, 2017
- జాతీయం రాష్ట్రీయం సినిమా
సంగీత, సాహిత్యాలనే జోడు చక్రాలను సంస్కతీ సంప్రదాయాలనే ఇరుసుకు జత చేసి తెలుగు సినిమాను కొత్త దారుల్లో పయనింపజేసిన దిగ్దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్. మనవైన మహోన్నత విలువల్ని పరిరక్షించుకుంటూ తరతమ భేదాలు లేకుండా అభ్యుదయ భావాలతో సమాజం తులతూగాలని అభిలషించిన స్వాప్నికుడాయన. ఆయన చిత్రాలు తెలుగు సినీ కొలనులో స్వర్ణకమలాల్ని పూయించి, ప్రేక్షకుల హదయాం తరంగాల్ని శంకరాభరణంతో రాగరంజితం చేశాయి. సంగీతప్రియుల వీనుల్లో సిరిసిరిమువ్వల నాదాల్ని శ్రావ్యంగా వినిపించాయి. సినిమా కళకు ఓ సామాజిక ప్రయోజనాన్ని ఆపాదించి స్వీయ సంస్క తి రక్షణకు వెండితెరను ఓ సాధనంగా వాడుకున్న స్వాతిముత్యం కె.విశ్వనాథ్. తెలుగు సినిమా సాంస్కతిక పునరుజ్జీవనానికి తనవంతు స్వయంకషి చేసిన ఆపదాÄందవుడిగా ఆయన్ని అభివర్ణించవొచ్చు. అటువంటి మహోన్నత వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం 2016 సంవత్సరానికిగాను అత్యంత ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక చేయడం తెలుగు సినీ కళామతల్లి చేసుకున్న సుకతం.
రికార్డిస్ట్‌గా సినీ ప్రయాణం…
విశ్వనాథ్ పూర్తిపేరు కాశీనాథుని విశ్వనాథబాబు. గుంటూరు జిల్లా పెదపులివర్రులోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారాయన. విశ్వనాథ్ తండ్రి సుబ్రహ్మణ్యం వాహినీ పిక్చర్స్‌లో మేనేజర్‌గా పనిచేస్తుండేవారు. తండ్రి ద్వారా విశ్వనాథ్‌కు చిత్ర పరిశ్రమతో పరిచయం ఏర్పడింది. విజయవాడలో డిగ్రీ పూర్తి చేసిన విశ్వనాథ్ తండ్రి సూచన మేరకు ఆయన పనిచేస్తున్న వాహిని స్టూడియోస్‌లోనే రికార్డిస్ట్‌గా ఉద్యోగం సంపాదించారు. అక్కడే విశ్వనాథ్‌లోని కళాతష్ణకు, సజనాత్మకతకు బీజం పడింది. రికార్డిస్ట్‌గా పనిచేస్తూనే సినిమా రంగంపై సమగ్ర అవగాహన పెంచు కున్నారు. ఆ సమయంలోనే బీఎన్‌రెడ్డి, కేవీరెడ్డి, దుక్కిపాటి మధుసూదనరావు, తాతినేని ప్రకాశరావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి ప్రము ఖులతో పరిచయం ఏర్పడింది.
ఏఎన్నాఆర్‌తో స్నేహమే విశ్వనాథ్ జీవితాన్ని మలుపుతిప్పింది. అన్నపూర్ణ సంస్థలో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన పలు సినిమాలకు సహాయ దర్శకుడిగా, స్క్రిప్ట్, మ్యూజిక్ కో ఆర్డినేటర్‌గా పనిచేశారు విశ్వనాథ్. అనతి కాలంలో అన్ని విభాగాలపై పట్టు సాధించి మంచి పేరును సంపాదించుకున్నారు. విశ్వనాథ్‌లోని ప్రతిభాపాటవాల్ని గుర్తించిన ఏఎన్నాఆర్, దుక్కిపాటి మధుసూదనరావు ఆత్మగౌరవం సినిమాతో ఆయన్ని దర్శకుడిగా తెలుగుతెరకు పరిచయం చేశారు. తొలి చిత్రమే విశ్వనాథ్‌కు ఎనలేని పేరుప్రఖ్యాతులతో పాటు అవార్డులను తెచ్చిపెట్టింది. తతీయ ఉత్తమ చిత్రంగా, ఉత్తమ కథా చిత్రంగా ఆత్మగౌరవం నంది పురస్కారాలను అందుకోవడంతో తెలుగు చిత్ర సీమలో విశ్వనాథ్ పేరు మారుమోగింది.
సంగీత సాహిత్యాలకు ప్రాణప్రతిష్ట
కె.విశ్వనాథ్ చిత్రాల్లో భారతీయ విలువల పరిరక్షణ, సంగీతసాహిత్యాల పట్ల ఎనలేని మమకారం కనిపిస్తుంది. సంస్కతి, సంప్రదాయాల్ని కాపాడు కుంటూనే కులవ్యవస్థ, వరకట్నంతో పాటు వివిధ సాంఘిక దురాచారాలపై పోరాడాలనే బలమైన సంకల్పం గోచరిస్తుంది. తొలి చిత్రం ఆత్మ గౌరవంతో నంది అవార్డును అందుకొని అసమాన ప్రతిభాశాలిగా తన కెరీర్‌కు బాటలు వేసుకున్నాడు విశ్వనాథ్. సిరిసిరిమువ్వ చిత్రంతో దర్శకుడిగా ఆయన ప్రతిభ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. నాట్యాన్ని అమితంగా ఇష్టపడే ఓ పల్లెటూరి మూగ అమ్మాయి తన కలల సాఫల్యం కోసం చేసిన ప్రయాణం, ఈ క్రమంలో ఆమెకు అండగా నిలిచే ఓ అనాథ యువకుడి కథతో హదయాన్ని స్పశించే భావోద్వేగాలతో సిరిసిరిమువ్వ చిత్రాన్ని తెరకెక్కించారు. జయప్రద, చంద్రమోహన్లు తమ పాత్రలకు జీవం పోశారు. ఈ చిత్రం హిందీలో సర్గమ్ పేరుతో పునర్మిం చబడి పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఝుమ్మంది నాదం..సయ్యంది పాదం.. వంటి గీతాలు ఇప్పటికీ సంగీతప్రియుల్ని అలరిస్తూనే వున్నాయి.
ట్రెండ్ మార్చిన శంకరాభరణం
కె.విశ్వనాథ్ కీర్తికిరీటంలో కలికితురాయిలా నిలిచిన చిత్రం శంకరాభరణం. ఈ సినిమా 1979లో విడుదలైంది. భారతీయ సంగీత, సాహిత్యాల ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. 70వ దశకంలో మూసకథలతో కూనరిల్లుతున్న తెలుగు సినిమాకు కొత్త వెలుగులద్దిన చిత్రంగా అఖండ ప్రజాదరణ సొంతం చేసుకుంది. ఈ సినిమా అనంతరం కె.విశ్వనాథ్ కళాతపస్వి బిరుదాంకి తుడయ్యారు.
ఈ చిత్రం దేశవ్యాప్తంగా శాస్త్రీయ సంగీతా భిమానుల ప్రశంసలందుకొంది. అప్పటికి అంతగా పేరులేని జె.వి.సోమయాజులు, మంజు భార్గవి వంటి నటీనటులను ప్రధాన తారాగణంగా ఎంచుకొని వారిని ప్రేక్షకుల హదయాల్లో చిరస్థాయిగా నిలిచేలా చేశారు కె.విశ్వనాథ్. ఈ సినిమా ప్రభావంతో అలనాడు ఎంతోమంది కర్ణాటక సంగీతాన్ని అభ్యసించారంటే అతిశ యోక్తికాదు.
ఈ సినిమాలోని ప్రతి పాట ఇప్పటికి నిత్య నూతనంగా వినిపిస్తూనే వుంటుంది. సాధారణ ప్రజలకు సంగీతంపై పెద్దగా అవగాహన లేని సమయంలో వచ్చిన ఈ సినిమా సంగీతంపై సామాన్య ప్రజల్లో సైతం మక్కువను పెంచింది. కె.వి.మహదేవన్ సంగీతాన్నందించిన ఈ సినిమా తెలుగు సినీ సంగీతభరిత కావ్యంగా చరిత్రలో నిలిచిపోయింది. 1980లో జాతీయ ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా ఎంపికైంది. కె.వి.మహదేవన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం ఉత్తమ నేపథ్య గాయనీగాయకులుగా జాతీయ అవార్డుల్ని స్వీకరించారు.
తెలుగు సంస్కతి
పరిరక్షణే ధ్యేయంగా….
విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సాగరసంగమం, శతి లయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం, స్వాతిముత్యం, సప్తపది, ఆపద్భాందవుడు, శుభసంకల్పం, స్వయంకషి చిత్రాలు అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. సప్తపది (1981) చిత్రంలో కులాల అంతరాలు చెరిగిపోవాలనే సందేశాన్నిచ్చారు. మమతానురాగాల పునాదిపైనే మానవ సంబంధాలు విరాజిల్లుతాయని చాటిచెప్పారు. ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనుసౌతాది అన్ని వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాయి అనే ఈ చిత్రంలోని పాట తత్వాన్ని సప్తపది సంపూర్ణంగా ఆవిష్కరించింది. స్వాతి ముత్యం (1985) చిత్రం ఓ విధవరాలు, ఓ అమాయకపు యువకుడి జీవన బంధానికి అందమైన దశ్య రూపంలా నిలిచింది. కమల్‌హాసన్ కెరీర్లో మహాద్భుతంగా చిత్రంగా స్వాతిముత్యం ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. సాగరసంగమం శతి లయలు స్వర్ణకమలం సంగీతసాహిత్యాల ఔన్నత్యాన్ని చాటిచెప్పాయి.
బాక్సాఫీస్ ఫార్ములాను దూరంగా వుంటూ తాను నమ్మిన విలువలే ప్రామాణికంగా సినిమాల్ని తీశారు కె.విశ్వనాథ్. శ్రమకై జీవన సౌందర్యాన్ని ఎంతగానో ఆరాధించిన ఆయన షూటింగ్ సమయంలో యూనిట్ అందరి మాదిరిగానే ఖాఖీ డ్రెస్‌ను ధరించే వారు. తాను అందరిలో ఒకరిననే సందేశా న్నదించేవాడు. కె.విశ్వనాథ్ ప్రతి చిత్రం సంగీత సాహిత్యాల, సంప్రదయాల గొప్పతనాన్ని ఆవిష్కరించింది. సాంఘిక దూరాచారాలపై పోరాడింది. దర్శకుడిగానే కాకుండా నటుడిగా చక్కటి ప్రతిభను చాటారు కె.విశ్వనాథ్. సంతోషం, స్వరాభిషేకం, వజ్రం, శుభ సంకల్పం, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, నరసింహనాయుడుతో పాటు పలు సినిమాలు నటుడిగా కె.విశ్వనాథ్‌కు మంచి పేరును తీసుకొచ్చాయి. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో ఆరు జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాయి. మరికొన్ని చిత్రాలు ఎన్నో ప్రాంతీయ పురస్కారాల్ని సొంతం చేసుకున్నాయి.
దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక కావడం అదష్టంగా భావిస్తున్నానని, ఆ కాశీనాథుడే దిగి వచ్చి స్వయంగా అవార్డును ఇచ్చినట్లుగా ఉందని అన్నారు కె.విశ్వనాథ్. 2016 ఏడాదికి గాను కేంద్ర ప్రభుత్వం సోమవారం కె. విశ్వనాథ్‌కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. బి.ఎన్.రెడ్డి, పైడి జయరాజు, ఎల్.వి. ప్రసాద్, బి.నాగిరెడ్డి, ఏఎన్నాఆర్, డి.రామనాయుడు తర్వాత ఈ పురస్కారాన్ని అందుకున్న తెలుగువాడిగా కె. విశ్వనాథ్ నిలిచారు. అవార్డుకు ఎంపికైనా సందఠంగా కె. విశ్వనాథ్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ సుదీరె సినీ ప్రయాణంలో ఎన్నడూ నిర్మాతలు నన్ను ఇబ్బం దులకు గురిచేయలేదు.
వారి సహకారంతోనే మంచి సినిమాలు చేయగ లిగాను. తెలుగుదనం, మనవైన సంస్క తులు సంప్రదాయాలపైనే ఎక్కువ సినిమాలు చేశాను. నా కెరీర్లో సిరివెన్నెల సినిమా కోసం ఎక్కువ కష్టపడ్డాను. అంతలా మరే సినిమాకు శ్రమిం చలేదు. నైతిక
విలువలకు కట్టుబడి సినిమాలు చేశాను కాబట్టే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు నాకు వచ్చింది. అవార్డుల రూపంలో తల్లిదండ్రుల దీవెనలు ఫలించడం సంతోషంగా ఉంది. సజనా త్మకతతో ఆలోచించే వారిలో సంతప్తి ఎప్పటికీ ఉండదు. ప్రస్తుత తరం దర్శకులు ఎన్నో ఒత్తిడుల మధ్య సినిమాల్ని తెరకెక్కిస్తున్నారు. ఆ ధోరణి మంచిది కాదు. వారికి నేనిచ్చే సలహా అంటూ ఏమి లేదు అని తెలిపారు.


