పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
- 14 Views
- admin
- April 26, 2017
- రాష్ట్రీయం స్థానికం
ఎండ వేడిమికి విలవిలలాడుతున్న జనం
అనకాపల్లిటౌన్, ఫీచర్స్ ఇండియా: వేసవి కారణంగా రోజు రోజుకు ఎండలు తీవ్రత పెరుగుతుండడంతో ఎండ తాకిడి తట్టుకోలేక ప్రజలు విలవిలలాడుతున్నారు. ఉదయం వాతా వరణంలో అల్ప ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ పది గంటలు దాటిన తరు వాత ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో పాటు వేడిగాలులు వీయ డంతో ఉక్కపోత ఎక్కువౌతుంది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవు తున్నారు. ఉదయం తొమ్మిది గంటలు దాటిన తరువాత రోడ్డెక్కా లంటే జనం బెంబేలెత్తిపోతున్నారు. పదకొండు గంటలు దాటిన తరువాత రోడ్లున్నీ నిర్మూనుష్యంగా మారిపోతున్నాయి. భవిష్యత్తు లో ఎండ తీవ్రత పెరుగుతుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఎండలు తీవ్రత కారణంగా వ్యాపారాలు సన్నగిల్లు తున్నాయని వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ఎండలు కారణంగా ఏసీ సినిమా థియేటర్లుకు మాత్రం ఓ మాదిరి గా కలెక్షన్లు పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి వ్యాపార లావాదేవీలపై వచ్చే ప్రజలు ఎండను తట్టుకోలేక మధ్యా హ్నం సినిమా హాళ్లును ఆశ్రయిస్తున్నారు. శీతలపానీయాలు, చెరకురసం, కొబ్బరిబొండాలు, పుచ్చకాయలు విక్రయాలు ఎండలు పుణ్యమా అని ఊపందుకున్నాయి. ప్రయాణికులు వడ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు వహించాలని వైద్యనిపుణులు చెబు తున్నారు. వడదెబ్బ తగలకుండా ఉండేందుకు పాదచారులు, ద్విచక్రవాహనచోదకులు తమ ముఖాలకు, తలకు తగినన్ని జాగ్రత్త లు తీసుకోవాలని, సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం ఎండబారిన పడకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని వైద్యులు చెబుతున్నారు.


