శతాబ్ధి ఉస్మానియా
- 55 Views
- admin
- April 26, 2017
- జాతీయం తాజా వార్తలు రాష్ట్రీయం
జాతిరత్నాలను అందించిన విశ్వ విద్యాలయం
ఉస్మానియా విశ్వవిద్యాలయ సంబురాలు జరుపుకు ంటున్నది గత కీర్తిని తలుచుకొని గర్వపడటానికే కాదు. వర్తమానంలోనూ ఆ వారసత్వాన్ని కొనసాగించే విధంగా స్ఫూర్తిని పొందడానికి!
వందేండ్లుగా ప్రపంచం నలుచెరగులా విజ్ఞాన సౌరభాలు వెదజల్లుతున్న ఉస్మానియా విశ్వవి ద్యాలయం నేటినుంచి శతాబ్ది వేడుకలను జరుపుకోనుండటం తెలంగాణ సమాజానికి గర్వకా రణం. ఈ సంబురాలను పరిణత రాజకీయవేత్తగా, పరిపాలనాదక్షుడిగా ఘనత వహించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించనుండటం ఉస్మానియా విశ్వవిద్యాలయ ఘనకీర్తికి తగినట్టుగా ఉన్నది. దేశప్రధానిగా మన్ననలు అందుకొన్న పి.వి.నరసిం హారావుతోపాటు అహింసా మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి నేడు ముఖ్యమంత్రిగా పరిపాల నకు కొత్త భాష్యం చెబుతున్న కేసీఆర్ వంటి అనేకమంది మహామహులు ఈ విశ్వవిద్యాలయం ఒడిలో ప్రపంచాన్ని అభ్యసించినవారే! తన అక్కున చేరిన బిడ్డలకు విద్యతోపాటే జీవితాన్ని బోధించడం, ప్రపంచాన్ని పరిచయం చేయడం ఈ విశ్వవిద్యాలయ విశిష్టత. సాహిత్యం మొదలుకొని శాస్త్రవిజ్ఞానం వర కు ప్రతి రంగంపై ఉస్మానియా విశ్వవిద్యాలయ ముద్ర చెరిగిపోనిది. ఈ విశ్వవిద్యాలయ ప్రస్తావన లేకుండా తెలంగాణ సమాజమే కాదు, విశ్వ విజ్ఞానమూ పరిపూర?ం కాదు. 1917 ఏప్రిల్ 26వ తేదీన నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఫర్మానాతో ఆయువు పోసుకున్న ఈ విశ్వవిద్యాలయం ప్రారంభంలోనే చరిత్రను సష్టించింది. భారతీయ భాషను మాధ్యమంగా చేపట్టిన విశ్వవిద్యాలయంగా విశ్వకవి రవీంద్రునితో సహా దేశాభిమానుల అభినందనలను అం దుకున్నది. స్వాభిమానానికి ప్రతీకగా నిలిచింది. ఈ సంబురాల ప్రారంభం ప్రస్తుత విద్యార్థులకే కాదు, ప్రపంచమంతా వ్యాపించి ఉన్న పూర్వ విద్యార్థులకూ ఉద్విగ్న ఘట్టం. తెలంగాణ గత వైభవానికి, పురోభివద్ధికి సూచిక.
ఈ విశ్వవిద్యాలయం ఉన్నతమైన విద్యను బోధించాలని, నిరుపేదల ద్వారం దగ్గరికి విద్యను గొనిపోవాలని ప్రారంభోత్సవం సందఠంగా ఆనా టి ఉపకులపతి ప్రార్థించారట. చేతిలో చిల్లిగవ్వ లేకుండా, ఉస్మానియా ప్రాంగణంలో అడుగు పెట్టి విద్యార్జన అనంతరం ఉన్నత స్థానాలకు ఎదిగిన పేదింటి బిడ్డలు అనేకమంది ఉన్నారు. ఆదిలాబాద్ మొదలుకొని హైదరాబాద్ వరకు తెలంగాణ నలుమూలల్లో- పల్లెపల్లెనా, పట్టణాలలోనూ గురువులుగా, పరిపాలకులుగా సమాజానికి చోదక శక్తులు గా ఉన్నది ఉస్మానియా విద్యార్థులే. అనేక మంది సాహితీవేత్తలను, సంఘ సేవకులను, పరిపాలనా దక్షులను, అంతరిక్షం, భూగఠం మొదలుకొని భిన్నరంగాల శాస్త్రవేత్తలను ఈ విశ్వవిద్యాలయం స ష్టించింది. అనేక దేశాలు ఉస్మానియా విద్యార్థుల మేధోశక్తితో సుసంపన్నమ వుతున్నాయి. ఉస్మాని యా విశ్వవిద్యాలయం తొలినాళ్ళలోనే ప్రపంచంలోని అనేక విశ్వవిద్యాయాల తో, పరిశోధనా సంస్థలతో అనుసంధానమై విజ్ఞానాభివ ద్ధి కోసం సాగిన సమిష్టి క షిలో పాలుపంచుకున్నది.
పాశ్చాత్యులకు దీటుగా దక్షిణార్థగోళం లో ఉత్తమ వేధశాలలు లేనప్పుడు, మేమున్నామం టూ ఇక్కడి ఖగోళవేత్తలు ఆకాశాన్ని వడబోసి లక్షలాది నక్షత్రాల ఆనుపాను లు కనిపెట్టారు. గగనాన్ని వీక్షించినంత అలవోకగా భూగఠ ప్రకంపనాలను నమోదు చేసి, ఆ పరిజ్ఞానాన్ని ఆక్స్ఫర్డ్ వంటి విశ్వవి ద్యాలయాలతో పంచుకున్నారు. ఆరంభంలోనే అనేక సబ్జెక్టులలో బోధన ప్రారంభించిన ఘనత అమెరికా, యూరప్ దేశాలతో సహా ఎక్కడ ఏ విశ్వవిద్యాలయానికీ లేదు. సాహిత్యానికి-విజ్ఞానానికి, ప్రాచీనతకు-ఆధునికతకు మధ్య సమతుల్యం సాధించాలన్న నిజాం ఆలోచనలను విశ్వవిద్యాలయం ఆచరణలో పెట్టింది. సామాజిక శాస్త్రాలలోనూ, జీవ, భౌతిక, రసాయనాది ప్రక తి శాస్త్రాలలోనూ పరిశోధకులకు చిరునామాగా వర్ధిల్లిన చరిత్ర ఉస్మానియా విశ్వవిద్యాలయానిది. ఆ క షికి గుర్తింపుగానే 1937లో ఉస్మానియా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 24వ మహాసభలకు వేదికగా వెలిగిపోయింది.
ఉస్మానియా విశ్వవిద్యాలయ సంబురాలు జరుపుకుంటున్నది గత కీర్తిని తలుచుకొని గర్వపడటానికే కాదు. వర్తమానంలోనూ ఆ వారసత్వాన్ని కొనసాగించేవిధంగా సూార్తిేని పొందడానికి! పరాయిపాలకులు దశాబ్దాల పాటు తెలంగాణ సమాజాన్ని సంక్షోభంలో ముంచెత్తారు. విద్యారంగాన్నీ కలుషితం చేశారు. ఉస్మానియా ప్రతిష’నూ చెడగొట్టే కుట్రలు సాగాయి. అయినా స్వాభిమానంతో స్వరాష్ట్రం సాధించుకున్న తెలంగాణ సమాజం ఆత్మవిశ్వాసంతో పురోభివ ద్ధి దిశగా పయనిస్తున్నది. సంక్షోభం నుంచి సంక్షేమం వైపు పయనిస్తున్నది. కుట్రలు, కుహకాలను నుసిచేసి మానవీయతను పాదుకొల్పుతున్నది.
ఈ కీలక ఘట్టంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అందిపు చ్చుకున్న విజ్ఞానాన్ని, చైతన్యాన్ని నిర్మాణాత్మకంగా, బంగారు తెలంగాణ సాధనకు ఉపయోగించవలసిన బాధ్యత విద్యార్థు లది. ముందుతరాల విద్యార్థులు తమ విజ్ఞానాన్ని, ఔన్నత్యాన్ని చాటుకొని విశ్వవిద్యా లయానికి ప్రపంచవ్యాప్త ఖ్యాతిని తెచ్చిపెట్టారు. నేటి విద్యా ర్థులు ఆ మహోన్నత విజ్ఞాన పరంపరకు వార సులు. ఆ విజ్ఞాన జ్యోతిని అందుకొని విశ్వవి ద్యాలయ ప్రతిష’ను ఇనుమడింప చేసినప్పుడు, నేటి విద్యార్థుల ఘనతను చెప్పుకొని తెలంగాణ సమాజం మురిసిపోతుంది.


