శశికళ ఫ్లెక్సీలు చిత్తుచిత్తు
- 15 Views
- admin
- April 26, 2017
- జాతీయం తాజా వార్తలు
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి, శశికళ మేనల్లుడు దినకరన్ అరెస్టయిన కొద్ది గంటల్లోనే పార్టీలో మరో ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. చెన్నైలోని అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో చిన్నమ్మ శశికళ ఫ్లెక్సీలను తొలగించారు కార్యకర్తలు. శశికళ బ్యాన్లర్లు తీసేయాలని పన్నీర్ వర్గం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
అన్నాడీఎంకే చీలిక వర్గాలు విలీనం దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. అయితే శశికళ, ఆమె కుటుంబాన్ని పార్టీ నుంచి దూరంగా పెడితేనే విలీనానికి ఒప్పుకుంటామని పన్నీర్ సెల్వం వర్గం డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో శశికళ, దినకరన్ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోరని అన్నాడీఎంకే ప్రకటించింది. దీంతో విలీనానికి అడ్డంకులు తొలగిపోయాయి. అయితే పార్టీ కార్యాలయం నుంచి శశికళ బ్యానర్లు తొలగించి ‘ఆఫీస్‌ను పవిత్రంగా ఉంచాలి’ అని పన్నీర్ వర్గం డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో నేడు ఫ్లెక్సీలను తొలగించారు. దీనిపై పన్నీర్ వర్గం మీడియా ప్రతినిధి స్వామినాథన్ స్పందించారు. ఫ్లెక్సీలు తొలగించడం సంతోషంగా ఉందన్నారు.
కాగా.. అన్నాడీఎంకే పార్టీ రెండాకుల గుర్తు వ్యవహారంలో దినకరన్‌ను దిల్లీ పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విలీనం విషయంపై నేడు ప్రకటన వెలువడే అవకాశాలు కన్పిస్తున్నాయి.


