ఆసియా అరెస్ట్
- 11 Views
- admin
- April 27, 2017
- అంతర్జాతీయం జాతీయం
దిల్లీ: వేర్పాటువాద నేత ఆసియా అంద్రాబీని కశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. యువతను వేర్పాటువాదం వైపు మళ్లించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోందని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రజా రక్షణ చట్టం కింద ఆమెను అరెస్టు చేశారు.
ఇస్లామిస్ట్ వేర్పాటువాద సంస్థ దుక్త్రాన్-ఇ-మిల్లాట్కు అంద్రాబీ నాయకురాలు. అంతేగాక, ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్‌లోనూ ఆమె సభ్యురాలు. కశ్మీర్‌లోయలో యువతను రెచ్చగొట్టేలా అంద్రాబీ ప్రసంగాలు చేస్తుంటుంది. అంద్రాబీ ప్రసంగాలు తమ శిక్షణ శిబిరాల్లో ప్రసారం చేస్తారని గతంలో కొందరు ఉగ్రవాదులు చెప్పడంతో ఆమెపై నిఘా పెట్టారు అధికారులు. మరోవైపు ఆమెపై చర్యలు తీసుకోవాలని కేంద్రం కూడా భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కశ్మీర్ పోలీసులు గురువారం తెల్లవారుజామున ఆమెను అరెస్టు చేశారు. భద్రతాసిబ్బందిపైకి మహిళలు రాళ్లు విసరడం వెనుక అంద్రాబీ ప్రేరణ ఉన్నట్లు సమాచారం.
అంద్రాబీ భర్త ఆషిఖ్ హుస్సేన్ ఫఖ్తూ కూడా ఓ వేర్పాటువాద నేత. అతడు హిజ్బుల్ ముజాహిదీన్ నాయకుడు. ప్రస్తుతం హుస్సేన్ జైల్లో ఉన్నాడు.


