ఈవీఎంలను కస్టడీలోకి తీసుకోండి!
- 23 Views
- admin
- April 27, 2017
- జాతీయం తాజా వార్తలు

నైనిటాల్: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎంలు)ను జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోవాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయంటూ కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం పైవిధంగా ఆదేశాలు జారీ చేసింది.
ఫిబ్రవరిలో జరిగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలను ట్యాంపర్ చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈవీఎంలలో ఏ బటన్ నొక్కినా అది భాజపాకే వెళ్తుందని విమర్శించారు.ఈ విషయంపై ఉత్తరాఖండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. నేడు విచారణ చేపట్టారు. కాగా.. ఈవీఎంలపై కాంగ్రెస్తో పాటు.. ఆమ్ఆద్మీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీ కూడా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.
Categories

Recent Posts

