చందనోత్సవానికి ముస్తాబైన సింహగిరి
- 18 Views
- admin
- April 27, 2017
- రాష్ట్రీయం స్థానికం
సింహాచలం, ఫీచర్స్ ఇండియా : ఈనెల 29న సింహగిరిపై జరగ నున్న చందనోత్సవానికి అధికారులు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. అప్పన్న నిజరూప దర్శనం కోసం సుమారు మూడు లక్షల మంది వరకూ భక్తులు తరలిరానుండటంతో వారికి ఎటు వంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మండుతున్న ఎండల నేపధ్యంలో చలువ పందిళ్లు, షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇక్కట్లు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఏడాదిలో 364 రోజులు నిత్యరూపంలో దర్శన మిచ్చే స్వామివారు వైశాఖ శుద్ధతదియనాడు నిజ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ప్రతియేటా జరిగే ఉత్సవాల్లో ఈ చందనోత్సవం అత్యంత ప్రధానమైనది. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అధికారులు ఐదువందలు, రెండువందల రూపాయల టిక్కెట్లు అందుబాటులో ఉంచారు. వీవీఐపీ లకు ప్రోటోకాల్ పాసులు మంజూరు చేసారు. వారికీ కేటాయించిన సమయాల్లోనే దర్శనానికి రావాలని అధికారులు విజ్ఞప్తిచేస్తు న్నారు. స్వామి నిజరూప దర్శనం అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులు తొలి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం గవర్నర్ ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. భక్తులకు తెల్లవారుజామున నాలుగుగంటల నుండే దర్శనాలు ప్రారంభమవుతాయి. గత ఏడాది సుమారు రెండులక్షలమంది దర్శించు కున్నారని ఈ ఏడాది ఆ సంఖ్య దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు . భక్తులను దష్టిలో ఉంచుకుని వారికీ ఎటువంటి ఇబ్బం దులు కలుగకుండా ఎండవేడిమికి తట్టుకోడానికి సింహగిరి అంతటా తాటాకు పందిళ్లు ఏర్పాటు చేసారు. ప్రత్యేక క్యూ లైన్లలో మజ్జిగలు , మంచినీరు భక్తులకు అందేవిధంగా ఏర్పాట్లు చేసారు.తెల్లవారు నాలుగుగంటల నుండి దర్శ నాలు మొదలుకొని రాత్రి తొమ్మిదిగంటలవరకు దర్శనమిస్తారు. అనంతరం సహస్ర ఘటాభి షేకం, 108 కలశాలతో గంగాధర జలాలతో స్వామికి అభిషేకం చేస్తారు. అనంతరం మూడు మణుగుల (125కిలోల) చందనాన్ని అరగదీసి స్వామికి సమర్పి స్తారు. దీనితో చందనయాత్ర ముగుస్తుంది. నగర పోలీస్ కమిషనర్ గట్టి పోలీస్ బందోబస్తును, ప్రత్యేక బలగాలను కూడా వినియోగిస్తు న్నారు. సింహగిరి అంతటా సీసీ కెమెరాలను అమర్చారు. వీవీఐపీ లు రాక దష్యా పటిష్ట బందోబస్తును నిర్వహిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం నిత్య అన్నదానాన్ని రోజంతా కొనసాగిస్తున్నారు. వైద్య సదుపాయం కోసం నాలుగు అంబులెన్సులను సిద్ధం చేసారు. స్వామిదర్శనానికి వచ్చే భక్తులకు ఉచిత బస్సు సదుపాయాన్ని ఏర్పాటు చేసారు. రెండు లక్షల లడ్డులను సిద్ధం చేసారు. భక్తులందరు నీలాద్రిగుమ్మం నుండే స్వామిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేసారు. భక్తుల సౌకర్యార్థం ఎడికక్కడ బయో టాయిలెట్స్ ను ఏర్పాటు చేసారు. 38 స్వచ్చంద సేవాసంస్థలు భక్తుల సౌకర్యార్థం వారి సేవలు వినియోగించనున్నారు. ఈ చందనోత్సవాన్ని విజయవంతం చేయడానికి జిల్లా అన్నిశాఖల సమన్వయంతో ఉత్సవాన్ని విజయవంతం చేస్తామని దేవస్థానం ఈఓ కోడూరి రామచంద్ర మోహన్ తెలిపారు.


