డమాస్కస్ ఎయిర్‌పోర్టు వద్ద భారీ పేలుడు
- 12 Views
- admin
- April 27, 2017
- అంతర్జాతీయం


సిరియా: సిరియా రాజధాని డమాస్కస్‌లోని అంతర్జాతీయ విమానశ్రయం సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఎయిర్‌పోర్టు శివారు నుంచి భారీ పేలుడు శబ్ధాలు వినిపించాయని స్థానికులు చెబుతున్నట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. అయితే పేలుడుకు గల కారణాలు, పూర్తి వివరాలు తెలియరాలేదు. పేలుడు దృశ్యాలను కొందరు సోషల్‌మీడియాలో పోస్టుచేశారు.
అయితే ఇది ఇజ్రాయిల్ దాడి అయి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇటీవల కూడా ఇజ్రాయిల్ సిరాయాలో ఇలాంటి దాడికి పాల్పడింది. గోలాన్ హైట్స్ ప్రాంతంలోని ప్రో-గవర్నమెంట్ క్యాంప్‌పై ఇజ్రాయిల్ బాంబు దాడి చేసింది. ఆ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో తాజా దాడి కూడా ఇజ్రాయిలే చేసి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Categories

Recent Posts

