దాహార్తితో అల్లాడుతున్న నాగయ్యపేట గ్రామస్తులు
దేవరాపల్లి, ఫీచర్స్ ఇండియా : మండ లంలోని నాగయ్యపేట గ్రామస్థులు మంచి నీటి కోసం అల్లాడిపోతున్నారు. మరమ్మ త్తుల పేరిట మోటార్‌ను రిపేరు చేయ కుండా పంచాయితీశాఖ అధికారులు కాలయపన చేస్తున్నారు. దీంతో ఈ గ్రామ స్థులు దాహార్తితో అల్లాడుతున్నారు. రిపేర ్లో ఉన్న మోటార్‌ను బాగుచేసి, ప్రజల దాహార్తిని తీర్చమని అడిగిన ప్రజా ప్రతి నిధులపై, తనకు తెలియదంటూ పంచా యితీ సెక్రటరీ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. వివరాల్లోకి వెళితే నాగయ్య పేట గ్రామస్థుల దాహార్తిని తీర్చేందుకు 2000వ సంవత్సరంలో పంచాయితీరాజ్ శాఖ నుండి విడుదలైన నిధులతో ట్యాంక్ మరియు మోటార్షెడ్ నిర్మించారు. అయితే ఈ మోటార్ రిపేరు అని తొల గించి, 14 మాసాలు కావస్తోంది. నేటికీ రిపేరు చేయకపోవటంతో నాగయ్యపేట గ్రామస్థులు మంచినీటి కోసం అల్లాడి పోతున్నారు. దీనిపై మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి పరవాడ రవి, టీడీపీ నాయకుడు కర్రి నాయుడులు స్థానిక సెక్రటరీ ఈశ్వర రావును ఫోనులో వివరణ కోరగా, తనకు తెలియదని సమాధానం ఇచ్చారు. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా బాధ్యత రాహి త్యంగా వ్యవహరిస్తోన్న పంచాయితీ కార్య దర్శిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని నేతలు, స్థానిక గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.