ప్రభాస్ అంటే ఇప్పుడు యువత పిచ్చెత్తిపోతోంది. జాతీయ వ్యాప్తంగా అమ్మాయిల హృదయాలు దోచుకున్న బాహుబలి తన తదుపరి చిత్రంపై ఇప్పుడే అంచనాలని పెంచేసాడు. ప్రభాస్ మలి చిత్రం ‘సాహో’పై క్రేజ్ జాతీయ స్థాయిలో పెంచడానికి ముందుగా టీజర్ షూట్ చేసిన సంగతి తెలిసిందే.
‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో యు.వి. క్రియేషన్స్ నిర్మిస్తోన్న సాహో టీజర్ రేపు సాయంత్రం అఫీషియల్‌గా యూట్యూబ్‌లో రిలీజ్ అవుతుంది. బాహుబలి ప్రదర్శించే ఎనిమిది వేల థియేటర్లలో సాహో టీజర్ వేస్తున్నారు. బాహుబలి కంటే ఈ టీజర్ కోసం ఆత్రంగా చూస్తోన్న ప్రభాస్ ఫాన్స్ చాలా మంది వున్నారు.
బాహుబలిలో రాజుల కాస్టూమ్స్‌లో కనిపిస్తోన్న ప్రభాస్ మళ్లీ మునుపటి స్టయిలిష్ అవతార్‌లో కనిపించే చిత్రం ఇదే కాబట్టి సహజంగానే దీని కోసం ఫాన్స్ ఎదురు చూపులు ఎక్కువగా వున్నాయి. వచ్చే ఏడాది వేసవిలో కానీ విడుదల కాని ‘సాహో’ చిత్రం టీజర్‌పై వున్న క్రేజ్‌ని గుర్తించి పైరేట్స్ దీనిపై ఎటాక్ చేసారు.
అఫీషియల్ రిలీజ్‌కి ముందే టీజర్ బయటకి వచ్చేసింది. వాట్సాప్‌లో, ఫేస్బుక్లో చక్కర్లు కొడుతోన్న ట్రెయిలర్‌ని ఇక ముహూర్తం వదిలేసి ముందుగా వదిలేస్తే మంచిది.