బాలీవుడ్ ఉమెన్ ట్రాఫికింగ్ ముఠా అరెస్టు…వందమంది యువతులను అక్రమంగా పారిస్ తరలించారు
- 17 Views
- admin
- April 27, 2017
- అంతర్జాతీయం జాతీయం
బాలీవుడ్ లో ఉమన్ ట్రాఫికింగ్ కు పాల్పడిన ముఠా ఆటను ముంబైపోలీసులు కట్టించారు. ఆరిఫ్ ఫారూకీ అనే కెమెరామేన్ను, అసిస్టెంట్ కెమెరామెన్ రాజేశ్ పవార్‌ను, ఫాతేమా ఫరీద్‌ను కూడా పోలీసులు అరెస్టు చేసినట్టు ముంబై పోలీసులు ప్రకటించారు. నలుగురు మైనర్లను అక్రమంగా ఫ్రాన్స్ కు తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో యాంటీ ఉమన్ ట్రాఫికింగ్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ ప్రారంభించగా భారీ రాకెట్ బట్టబయలైంది. భారత్ నుంచి పారిస్ కు అక్రమంగా యువతులను తరలించడం వెనుక పెద్ద గ్యాంగ్ ఉందని గుర్తించారు. పంజాబ్ లో ఉన్న ఓ వ్యక్తి మైనర్ల తల్లిదండ్రులను కలిసి వారిని విదేశాలకు పంపించేలా సర్దిచెప్పి తరలిస్తుంటాడని పోలీసులు తెలిపారు.
పోలీసులు విడిపించిన నలుగురు మైనర్లు పంజాబ్ కు చెందినవారని పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా వారి నుంచి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని, వాటిల్లో సునీల్ నంద్ వానీ, నర్సయ్య ముంజలి అనే వ్యక్తుల ఫోన్ నెంబర్లు ఉన్నాయని తెలిపారు. దీంతో వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నామని వారు చెప్పారు. నంద్ వానీ తాజాగా ఐదు నుంచి ఆరుగురు మైనర్లను ముంబై నుంచి పారిస్ తరలిస్తుండగా, ముంజలి మరో ఇద్దరు మైనర్లను పారిస్ తరలించే ప్రయత్నంలో ఉండగా వారికి వీసాలు దొరకలేదని, దీంతో వారిని తరలించలేకపోయారని పోలీసులు తెలిపారు.
అయితే ఈ గ్యాంగ్ ఇప్పటివరకు సుమారు 100 మైనర్ యువతులను వారి తల్లిదండ్రులకు పిల్లలకు మంచి విద్య, తల్లిదండ్రుల స్థితిగతుల్లో మార్పుల పేరుతో వారు అక్కడ ఏం చేస్తారో తెలియకుండా జాగ్రత్త పడుతూ పంపారని తెలిపారు. అలా తరలించిన వంద మంది 14 నుంచి 16 ఏళ్లలోపు మైనర్లని, వారికి 18 ఏళ్లు వచ్చే వరకు అక్కడే ఉంచి, ఆ తరువాత ఫ్రెంచ్ పౌరసత్వానికి దరఖాస్తు చేస్తారు. అది వచ్చిన తరువాత వీరి అసలు రంగు చూపిస్తారని తెలిపారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉందని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు.

Categories

Recent Posts