బాహుబలి-2 రికార్డుల కోసం ఎదురు చూస్తున్న అభిమానులు
అనకాపల్లిటౌన్, ఫీచర్స్ ఇండియా: ప్రముఖ చలనచిత్ర దర్శ కుడు ఎస్ఎస్ రాజమౌళి నిర్దేశకత్వంలో ఈ నెల 28న విడుదల వుతున్న బాహుబలి-2 ది కన్‌క్లూజన్ సినిమా ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తి రేపుతుంది. అనకాపల్లి చరిత్రలో అన్ని థియేటర్లల్లో ప్రదర్శి తమవుతున్న సినిమాగా రికార్డుకు ఎక్కుతుంది. అంతేకాక అన్ని థియేటర్లల్లో ఐదు ఆటలు చొప్పున ప్రదర్శింపబడుతున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ప్రేక్షకుల సౌకర్యం కోసం రోజు ఆరు ఆటలు ప్రదర్శించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిన ప్పటికీ ఐదు ఆటలనే ప్రదర్శిస్తున్నట్లు థియేటర్ల యాజమాన్యం తెలి పింది. అన్ని థియేటర్లల్లో పెరిగిన టిక్కెట్ల ద్వారా ఒక్కరోజుకే సుమారు 18లక్షల రూపాయలు గ్రాస్ కలెక్షన్స్ వస్తాయని అం చనా. దీనిని బట్టి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం తొలిరోజు కలె క్షన్స్ ఎంత భారీగా వసూళ్లు అవుతాయోనని సినీ విమర్శకులు బేరీజు కడుతున్నారు. చిత్ర పరిశ్రమలో అపజయాలు ఎరగని దర్శకునిగా ముందుకు సాగుతున్న దర్శకుడు రాజమౌళి బాహు బలి-1 చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు పరిశ్రమ కీర్తిని పెంచారు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో కంప్యూటర్ గ్రాఫిక్స్, విజువల్స్‌తో అద్భుతమైన కధా కధనంతో చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది ప్రపంచ వ్యాప్తంగా అద్భుతాలు సృష్టించారు. అదేవిధంగా వస్తున్న బాహుబలి-2లో రాజమౌళి ఎటువంటి విజువల్స్ ఎఫెక్ట్స్‌తో సినిమా తీసి ఉంటారో చూడాలని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. బాహుబలి-1లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే అంశాన్ని సశేషంగా ఉంచి ప్రేక్షకులు చర్చించేలా చేశారు. ఏడాది పాటుగా ఈ సినిమా పట్ల ఆసక్తి కలగడానికి ఇదొక అంశం. ఈ బాహుబలి చిత్రం పరిశ్రమలో ఎటువంటి రికార్డులు సృష్టిస్తోందో వేచి చూడాల్సిందే. ఈ చిత్రం విడుదల పట్ల యంగ్ హీరో ప్రభాస్ అభిమానులు కోటి ఆశలు పెట్టుకొని ఎదురుచూస్తున్నారు. సినిమా థియేటర్లును తమ అభిమాన కథా నాయకుడు ఫ్లెక్సీలను ఇప్పటికే అలంకరించారు. సినిమా విడుద లవుతున్న థియేటర్లలన్నీ ప్రభాస్ అభిమానులతో ఇప్పటికే సందడి గా మారాయి.


