మండే ఎండకు టాప్ హీరోయిన్ కొత్త కవరింగ్
- 21 Views
- admin
- April 27, 2017
- తాజా వార్తలు సినిమా
మండి పోతున్న ఎండకు కిందా మీదా పడిపోతున్నారు. ఈ పాడు ఎండలు ఎప్పటికి పోతాయో అనుకునేటోళ్లే ఎక్కువ. మనిషి చేసిన తప్పులకు ఫలితమే ఈ కాలిపోతున్న ఎండలని ఎవరైనా ఫీలయ్యారా? అంటే లేదనే చెప్పాలి. ఎండలు.. దాని వల్ల జరిగిపోతున్న నష్టాల చిట్టా విప్పితే.. ఇప్పటికైతే తెమలదు. ఆ విషయాన్ని కాస్త పక్కన పెట్టేద్దాం. ఫోటోలో ఫుల్ గా కవర్ చేసేసిన చిన్నదాన్ని చూశారా? అమె ఎవరంటారు?
గుర్తు పట్టటానికి ఏ మాత్రం అవకాశం లేనట్లుగా మొత్తం క్లాత్ తో ముఖాన్ని లేయర్లు.. లేయర్లుగా చుట్టేసిన తీరు చూస్తే.. కవరింగ్‌లో కొత్త తరహా అన్నట్లు లేదు. ఇదంతా ఫ్యాషన్ కోసమో.. మరింకేమిటో కాదు.. మాడిపోయేలా చేస్తున్న ఎండల తీవ్రత నుంచి ముఖారవిందాన్ని.. గ్లోను మిస్ చేసుకోకుండా ఉండేందుకు ఓటాప్ హీరోయిన్ పడుతున్న పాట్లు ఇవి.
ఉదయం ఎనిమిది దాటితే చాలు.. రెచ్చిపోతున్న భానుడి దెబ్బకి ఎవరైనా దడవాల్సిందే. ఎవరికి వారు.. సూరీడు దెబ్బ తమ మీద పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భానుడి భగభగల నుంచి తమనుకాపాడుకోవటానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో.. అన్నింటిని ఫాలో అయిపోతున్నారు. కాలుష్యంతో నిండిన నగరంలో ఒంటిని కాపాడుకునేందుకు.. ముఖం నిండుగా స్కార్ఫ్ లతో కవర్ చేసే అమ్మాయిలు చాలామందే కనిపిస్తారు. కానీ.. వారందరికి కొత్త స్ఫూర్తినిచ్చేలా ఉన్న ఈ భామ ఓ టాప్ హీరోయిన్.ఆమె ఎవరో కనుక్కోగలరా?
గుర్తు పట్టేందుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వని రీతిలో ముఖాన్ని క్లాత్ తోకవర్ చేసిన ఈ అందాల భరిణె.. ఇంకెవరో కాదు.. టాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్‌ప్రీత్ సింగ్. ఓ మూవీ షూటింగ్ లో భాగంగా.. షాట్ గ్యాప్ లో.. మండిపోతున్న ఎండ నుంచి ముఖారవిందాన్ని కాపాడుకోవటానికి పడుతున్న పాట్లు ఇవి. రకుల్ పుణ్యమా అని.. ముఖాన్ని ఇంతలా కవర్ చేసేసే సరికొత్త స్టైలింగ్‌ను అమ్మాయిలు షురూ చేస్తారేమో..?


