25ఏళ్లకే రిటైర్మెంట్
లండన్: కొన్ని నెలల కిందట భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ టెస్టు జట్టులో జాఫర్ అన్సారి అనే యువ ఆటగాడున్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఐదు టెస్టుల ఆ సిరీస్‌లో అన్సారి రెండు మ్యాచ్‌లు ఆడాడు కూడా. ఈ స్పిన్నర్ కేవలం 25 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైపోతుండటం విశేషం. అంతర్జాతీయ కెరీర్లో మొత్తంగా మూడు టెస్టులు, ఒక వన్డే ఆడిన అన్సారి.. న్యాయ విద్యను అభ్యసించడం కోసం క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఇంగ్లాండ్ కౌంటీల్లో సర్రే క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అన్సారి.. 71 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 42 లిస్ట్-ఎ మ్యాచ్‌లు, 69 టీ20లు ఆడాడు.
Categories

Recent Posts

