అనకాపల్లిలో మల్టీఫ్లెక్స్ కాంప్లెక్స్.. జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్
అనకాపల్లి, ఫీచర్స్ ఇండియా: అనకాపల్లిలో బీవోటీ విధానం లో లీజుకు ఇచ్చిన ఆర్టీసీ స్థలంలో త్వరలో మల్టీ కాంప్లెక్స్ నిర్మా ణం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. గురు వారం ఆయన ఆర్టీసీ డిపో ఆవరణలో నిర్మించిన డిపో మేనేజరు కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయ ఆవరణ లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనకాపల్లి ఆర్టీసీ తూర్పు భాగాన ఉన్న స్థలాన్ని లీజుకు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ స్థలంలోనే లీజుదారులు మల్టీఫెక్స్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తారని తెలిపారు. జిల్లాలోని ఆర్టీసీకి చెందిన స్థలాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. విశాఖ ద్వారకా బస్‌స్టేషన్, మద్దిలపాలెం స్థలాలను ఈ విధంగానే లీజుకు ఇచ్చామని తెలిపారు. ద్వారకా బస్‌స్టేషన్‌లో అధునాతన సౌకర్యా లతో హోటల్, రెస్ట్‌రూమ్‌ల రూపకల్పన జరిగిందని అన్నారు. ఆర్టీసీ ఆస్తులను అభివృద్ధి చేసి ఆదాయం పెంచేందుకు ఈ చర్యలు దోహదపడతాయని అన్నారు. ఆర్టీసీ ఈడీ రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేవాల మేరకు సంస్థ స్థలాలను బీవోటీ విధానంలో లీజుకు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఆదాయం పెంపులో భాగంగా పార్శిల్ రవాణా వ్యవస్థను కూడా మరింత మెరుగు పరచడం జరిగిందని అన్నారు. విశాఖ మన్యానికి పది బస్సులను రవాణాశాఖ మంత్రి ద్వారా అందుబాటులోకి వచ్చాయని, మరో 15 బస్సులు రానున్నాయని తెలిపారు. గ్రేటర్లో 35కిలోమీటర్ల నిబంధన ఉన్నందున అనకాపల్లికి సిటీబస్ పాస్‌లను అందించలేక పోతున్నామని తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియచేయడం జరిగిందని త్వరలో సమస్య పరిష్కారం అవుతుం దని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుశాల్ కుమార్, డిపో మేనేజర్ ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.