వుహాన్ (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జోరు కొనసాగుతున్నది. ఈ ఒలింపిక్ పతక విజేత వరుసగా రెండో మ్యాచ్‌లోనూ నెగ్గి క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. సింధు రెండోరౌండ్లో 21-14, 21-15తో అయా ఒహోరి (జపాన్)పై గెలిచింది. సెమీఫైనల్ బెర్త్ కోసం చైనాకు చెందిన హే బి న్గ్జియావోతో సింధు అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో ఐదోసీడ్ తియాన్ హోవీ (చైనా)ని ఓడించి ఆకట్టుకున్న భారత యువ షట్ల ర్ అజయ్ జయరామ్ తర్వాతి రౌండ్లో మాత్రం ఆస్థాయి ప్రదర్శన చూపెట్టలేకపోయాడు. గురువారం జరిగిన రెండోరౌండ్లో జయరామ్ 19-21, 10-21తో సూ జెన్ హావో (చైనీస్ తైపీ) చేతిలో ఓడాడు.
క్వార్టర్స్‌లో సింధు
Categories

Recent Posts

