నేడే అప్పన్న నిజరూప దర్శనం
- 16 Views
- admin
- April 28, 2017
- రాష్ట్రీయం స్థానికం
సింహాచలం ఫీచర్స్ ఇండియా : ప్రహల్లాదుని రక్షణ సమయంలో హిరణ్యకశ్యపునితో చేసిన యుద్ధంలో ఎత్తిన అవతారాలలో అప్రమేయమైనది శ్రీవరాహన సింహ అవతారం. హరినామం వీడని భక్త ప్రహ్లాదున్ని శిక్షించడానికి తండ్రి హిరణ్యకశ్యపుడు అతణ్ణి సముద్రంలోకి తోసి పైన పర్వతాన్ని నిలిపాడు. ప్రహ్లాదుడు ఆ పర్వతం కింద నుంచి సముద్ర గర్బంలో వేగ స్రాంతం నితాంతం ఖగపతిమ మతం పయన్యన్య పాణౌ సింహోద్రౌ శ్రీఘ్రపాద క్షితాపిహిత పదః పాతుంమాం నరసింహం అంటూ వేడుకున్నదే తడువుగా వైకుంఠం నుంచి శిరికించేప్పుడు శంబు చక్రములు చేదోయి సంధింపడు అని మహా భాగవతంలో బమ్మెర పోతన చెప్పిన రీతిలో పరుగు పరుగున శ్రీమహావిష్ణువు బయలు దేరాడట. తాను కట్టుకున్న పీతాంబరం జారిపోతుంటే ఆదుర్దాలో ముడి వేసుకోవడం కూడా మరచి ఒక చేత్తో పట్టుకున్నాడు. విష్ణుమూర్తి వేగాన్ని తట్టుకోలేక అతని వాహనం గరుత్మంతుడు రొప్పుతూ చెమటలు గక్కుతున్నాడు. భక్త రక్షణార్థం పరమాత్ముడు గరుత్మంతుని పైనుంచి ఒక్క ఉదుటున కిందకి దూకాడు. దీంతో ఆయన పాదాలు పాతాళం వరకు చొచ్చుకుపోయాయి. అప్పుడు వరాహ అవతారంలో భూమిని ఎత్తి వేదాలను రక్షించిన తీరున సింహగిరి పర్వతాన్ని ఎత్తి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించాడు. అనంతర కాలంలో హిరణ్య కశ్యపునికి బ్రహ్మ ఇచ్చిన వరాలకు అనుగుణంగా సాయం సంధ్య వేళ ఇంట, బయట కాకుండా ద్వారబంధం మీద ఎటువంటి ఆయుధాలు లేకుండా నఖములతో సంహరించాడు. శిరణ్యకశ్యపుని సంహారానికి ఎత్తిన వినూత్న రూపంలోని విష్ణువును చూసి భీతినొందిన దేవ దానవుల కోసం శాంతి మూర్తిగా తన తండ్రి, పెద తండ్రులను సంహరించిన వరాహా, నసింహ రూపాలతో సేవించుకునే భాగ్యాన్ని కల్పించాలని భగవంతుణి? ప్రహ్లాదుడు వేడుకోవడంతో సింహగిరిపై వరాహ నసింహునిగా ద్వయావతారుడిగా మహావిష్ణువు కొలువుతీరారు . నాట ినుంచి నేటి వరకు భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటున్నాడు సింహాచలేశుడు.
ప్రహ్లాదుని రక్షణార్థం సింహగిరిపై అవతరించిన నసింహ స్వామి కొంతకాలం ప్రహ్లాదునిచే పూజాదికాలు అందుకున్న తరువాత మరి కొంత కాలంపాటు కనీసం దూప దీప నైవేద్యాలకు నోచుకోకపోవడంతో స్వామిపై పుట్ట వెలసింది. షట్చక్రవర్తులలో ఒకరైన చంద్రవంశపు రాజు పురూరవ చక్రవర్తి తన ప్రేయసి ఉర్వశితో కలసి విహార యాత్రకు వెళుతుండగా సింహగిరిపై అతని వాహనం ఆగిపోయింది. ఆ రాత్రి సింహగిరిపైనే విశ్రాంతి తీసుకున్న పురూరవుని స్వప్నంలో వరాహ నసింహ స్వామి సాక్షత్కరించాడు. సింహగిరిపై ఈశాన్య దిక్కులో పవిత్ర గంగధార సమీపంలోని మాలతీలతలతో కప్పబడిన వాల్మీకం (పుట్ట) లో తాను ఉన్నానని దానిని తొలగించి ఆరాధించాలని ఆజ్ఞాపిస్తాడు. దీనితో ఉదయం స్వామి పేర్కొన్న గుర్తుల ప్రకారం తన పరివారంతో కలిసి సింహగిరిపై వెతకగా పుట్టలో స్వామి ఉన్నట్టు రాజు కనుగొంటాడు. ఆవిధంగా పురూరవునికి సాక్షత్కరించినది, తొలుత ప్రహ్లాదునికి దర్శనమిచ్చినది రోజు వైశాఖ శుక్లపక్ష తదియ కావడం విశేషం.
పుట్టను తొలగించి గంగాధర పవిత్ర జలాలతో, వివిధ రకాల పండ్ల రసాలు, పంచామతాలతో పురూరవ చక్రవర్తి స్వామికి అభిషేకాలు జరిపించాడు. అలా ఆరాధించిన తరువాత మరోసారి పురూరవుని స్వామి సాక్షాత్కరించి ఇంతకాలం పుట్టల్లో ఉన్నాను.. చల్లగా ఉన్నాను… ఇప్పుడు బయటకు వచ్చాను…. చల్లదనం కోసం పుట్ట మన్నుకు బదులుగా అదే బరువు గల గంధపు పుట్టను సమర్పించాలని ఆనతిచ్చాడు ఆ విధంగా చందన సమర్పణ.. చందనోత్తరణ పురూరవుని నుంచి ప్రారంభమై నేటికీ ఆచారంగా కొనసాగుతూ వస్తుంది. నాటి నుంచి ఏటా వైశాఖ శుక్ల తదియనాడు భక్తులకు వరాహలక్ష్మీన సింహస్వామి నిజరూప దర్శన భాగ్యం కలుగుతుంది .
ఉత్తరాంధ్ర ప్రజలు స్వావి ువారిని సింహాద్రి అప్పన్న పేరుతో కొలవడం ఆచారంగా వస్తుంది. అప్పడంటే తండ్రి అని అర్ధం. తమిళ భాషలోని అప్పా నుంచి అప్పన్న పదం పుట్టిందని పెద్దలమాట. సింహాద్రి అప్పన్న నిరంతరం జాలు వారే జలదారుల నడుమ చల్లని ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువుదీరారు. సింహగిరిపై పన్నెండు సహజ సిద్దమైన జలధారలు ప్రవహిస్తూ ఉండేవని గ్రామంలోని పెద్దలు చెబుతారు. గంగధరా నుంది వచ్చే జలాలను నిత్యం సుప్రభాత సేవ వేళ తీర్థ బిందె సంప్రదాయం పేరుతో అర్చక స్వాములు తీసుకువచ్చి అప్పన్న సేవలకు వినియోగించడం జరుగుతుంది. పోటు (పాకశాల లేదా వంటశాల) నిత్యం ప్రవహించే దార నుంచి లభించే జలాలను స్వామి వారికి నివేదించే బాలభోగం, రాజభోగాలకు తయారుచేసే ప్రసాదాల తయారీలో వినియోగిస్తారు .
చందన సమర్పణ …. సింహాద్రి అప్పన్నపై తొలివిడత చందన సమర్పణ గావించేందుకు దేవాలయ వైదిక అధికారులు, సుమారు ఇరవై మంది సిబ్బంది నాలుగు రోజులపాటు మూడు మణుగుల (125 కిలోలు) చందనాన్ని అరగదీసి సిద్ధం చేస్తారు.
ఆ చందనం ముద్దలో ఆలయ స్థానాచార్యులు, ప్రధానార్చకులు, అర్చకులు, సుగంధ ద్రవ్యాలను మిళితం చేస్తారు. చందనంలో మిళితం చేసిన సుగంధ ద్రవ్యాలలో వట్టివేళ్ళు, కచోరాలు, బావంచాలు, గవిలాలు, పచ్చాకు, కస్తూరిపసుపు, కుంకుమ పువ్వు , పచ్చ కర్పూరం వంటి ద్రవ్యాలను నూరి కలుపుతారు.
అదేవిధంగా సహస్ర ఘటాభిషేకం వేళ అష్టోతర శతరజిత కలశాలతో పంచామ తాభిషేకం చేసేందుకు అవసరమైన 108 వెండి కలశాలను సప్తవర్ణ సూత్రాలను కట్టి సిద్ద చేస్తారు తెల్లవారు జామున అప్పన్న స్వామిపై ఏడాదిపాటు పూజలందుకున్న చందనాన్ని తొలగించిన తరువాత స్వామివారి హదయం మీద కొద్దిపాటి చందనం ముద్దను పెడతారు. దానిని హదయ చందనంగా అభివర్ణిస్త్తారు. ఆ హదయ చందనాన్ని కూడా అర్చకులు అరగదీసి ఆలయ బండాగారంలో ఉంచుతారు. సహస్ర ఘటాభిషేకం అనంతరం స్వామి వారికి సీతలోపచారాలను సమర్పిస్తారు.
చందనోత్సవాన్ని పురస్కరించుకుని వాహనాల రాకపోకలు, పార్కింగ్ వంటి కార్యచరణలపై జిల్లా ట్రాఫిక్ పోలీసులకు డ్యూటీలపై సూచనలు ఇస్తున్న ట్రాఫిక్ ఉన్నతాధికారులు.
పాసులకోసం పడిగాపులు
ఏడాదికి ఒకేసారి వచ్చే శ్రీ వరహాలక్ష్మీ నసింహ స్వామి చందనోత్సవం. స్వామి వారు నిజ రూపదర్శనంలో భక్తులకు కనువిందు చేయనున్నారు. ఈ రూపాన్ని దర్శించుకుడనాకి దేశ నలుమూలల నుండి తండోపతండాలుగా భక్తులు తరలివస్తుంటారు. దీనిలో భాగంగా జిల్లాలో ఉన్నటువంటి భక్తులు ఫ్రీ పాస్లు గురించి దేవస్థానం అధికారులచుట్టూ ప్రదక్షించడం, వారితో వాగ్విదాలతో దేవాలయ కార్యాలయం మారుమ్రోగిపోయింది. ఇటు బ్యాంకులలో కూడా భక్తులు అధికారులతో వాదనలు చేస్తున్నారు. అధికారులు మాత్రం అందరికి పాసులు అందేలా చేస్తామని ఇందులో ఎటువంటి దుర్వినియోగం జరగడం లేదని అధికారులకు సహకరించాలని కోరుతున్నారు.


