ప్రత్యేక ప్రతిభావంతులకు చేయూతనివ్వాలి
రూ.14లక్షల ఉపకరణాలు ఉచిత పంపిణీ ఎమ్మెల్సీ చలపతిరావు
యలమంచిలి, ఫీచర్స్ ఇండియా: జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రతిభా వంతులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. స్థానిక నల్లమారెమ్మ గుడి దగ్గర జరి గిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. 185 మందికి రూ.14లక్షలు విలువైన ఉపకరణాలను వారికి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా చలపతిరావు మాట్లాడుతూ అంగవైకల్యం ఉన్న వ్యక్తులను ఆదుకోవడం అందరి కర్తవ్యమని, వారి కార్య క్రమాలు అన్నీ వారే చేసుకొనే విధంగా తోడ్ప డాలని చలపతి రావు అన్నారు. జిఎంఆర్ చేస్తోన్న సేవా కార్యక్ర మాలను అభినందించారు. జిఎం ఆర్ హైవేస్ ప్రాజెక్టు మేనేజర్ రామేశ్వరరావు మాట్లాడుతూ ఈ ఉపకరణాలు నేషనల్ ఇని ట్యూట్ ఆఫ్ లోకోమొటివ్ డిజేబిలిటీస్ కలకత్తా వారి ద్వారా సరఫరా చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆత్మ ఛైర్మన్ విజయబాబు, అసిస్టెంట్ డైరెక్టర్ డిజీబి లిటీ వెంకటేశ్వరరావు, హైవే టీమ్ లీడర్ నాగే శ్వరరావు, ఫౌండేషన్ మేనేజర్ సాయి కిరణ్ తది తరులు పాల్గొన్నారు.


