యోగి హెయిర్‌స్టయిల్ అయితేనే అనుమతి… ఓ ప్రైవేటు పాఠశాల అత్యుత్సాహం

లఖ్‌నవూలోని రిషభ్ అకాడమీ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీఎం యోగీ ఆదిత్యనాథ్ హెయిర్‌స్టైల్ మాదిరిగా విద్యార్థులు హెయిర్ కట్ చేయించుకోవాలని.. లేకపోతే తరగతి గదుల్లోకి అనుమతించబోమని తెలిపింది. విద్యార్థుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు అవాక్కయ్యారు. యాజమాన్యం తీరుపై మండిపడుతూ స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థులు మాంసాహార పదార్థాలను తెచ్చుకోవడంపై కూడా యాజమాన్యం నిషేధం విధించిందని ఆరోపించారు. తల్లిదండ్రుల ఆందోళనతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు.
అయితే ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం స్పందిస్తూ విద్యార్థులు చేస్తున్న ఆరోపణలను కొట్టిపడేసింది. మంచి వస్త్రధారణ, హెయిర్ కట్‌తో రావాలని మాత్రమే తాము సూచించామని పాఠశాల కార్యదర్శి రంజిత్ జైన్ తెలిపారు.
Categories

Recent Posts

