ఆమె ఏమైంది?
- 18 Views
- admin
- April 29, 2017
- రాష్ట్రీయం స్థానికం
ఆరిలోవ (విశాఖపట్నం): విశాఖలో ఓ మహిళ అదృశ్యం వెనుక అగ్రిగోల్డ్ వ్యవహారాలేమైనా ఉన్నాయా అనే విషయంపై నగరంలో చర్చ సాగుతోంది. ఆ మహిళ అగ్రిగోల్డ్ మాజీ డైరక్టర్ భార్య కావటంతో అనుమానాలకు తావిస్తోంది. విశాఖపట్నం ఆరిలోవ శ్రీకాంత్నగర్లో డొప్ప రామ్మోహన్రావు నివాసం ఉంటున్నారు. ఆయన అగ్రిగోల్డ్ మాజీ డైరెక్టర్. అగ్రిగోల్డ్ కేసులోనే ఆయనను సీబీసీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన భార్య ఉషాలక్ష్మి (50) గత ఏడాది మే 8న అదృశ్యమైనట్లు ఆమె కుమారుడు గాజువాక పోలీసులకు జూన్ 23న ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసిన నాలుగు నెలల తర్వాత గాజువాక పోలీసులు ఈ కేసును ఆరిలోవకు బదిలీ చేశారు. ఈ కేసు ఆరిలోవ స్టేషన్కు చేరి కూడా ఆరు నెలలు గడిచిపోయింది. అదృశ్యమైన నెలన్నరకు దీనిపై ఫిర్యాదు చేయడం.. పోలీసులు సైతం నెలల తరబడి కేసును తమవద్దే ఉంచుకొని ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్కు కేసు బదిలీ చేయటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదృశ్యమైన మహిళ పేరిట భారీగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం.


