దావూద్ ఇబ్రహీమ్‌కి ఏమైంది?
- 22 Views
- admin
- April 29, 2017
- అంతర్జాతీయం జాతీయం తాజా వార్తలు
దిల్లీ: అండర్ వరల్డ్ డాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహిం చనిపోయినట్లు వదంతులు వ్యాపిస్తున్నాయి. దావూద్ గుండెపోటుకు గురయ్యారని, ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని శుక్రవారం పాకిస్థాన్‌కు చెందిన కొన్ని మీడియా వర్గాలు పేర్కొన్నాయి.దీంతో దావూద్ చనిపోయాడంటూ వదంతులు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తను అతడి చిరకాల సన్నిహితుడు చోటా షకీల్ కొట్టిపారేశాడు. భాయ్ చాలా ఆరోగ్యంగా ఉన్నారు.. అవన్నీ పుకార్లు మాత్రమే అని షకీల్ చెప్పాడు.
అయితే గత కొంతకాలంగా దావూద్ అనారోగ్యంగా ఉన్నట్లు మాత్రం వార్తలు వస్తున్నాయి. చికిత్స కోసం అప్పుడప్పుడు కరాచీలోని ఆసుపత్రికి వెళ్తున్నట్లు మరో మీడియా పేర్కొంది. కాగా.. ఏప్రిల్ 19న పాక్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందద్ నివాసంలో జరిగిన ఓ పార్టీకి దావూద్ హాజరైనట్లు సమాచారం. 2005లో జావెద్ కుమారుడితో దావూద్ కుమార్తె వివాహం జరిగిన విషయం తెలిసిందే. 1993 ముంబయి బాంబు పేలుళ్లలో కీలక నిందితుడైన దావూద్ గత కొన్నేళ్లుగా అండర్వరల్డ్కు వెళ్లిపోయాడు. అతడు కరాచీలో ఉంటున్నాడని వార్తలు వచ్చాయి. అయితే దావూద్ అసలు పాకిస్థాన్‌లోనే లేడని ఆ దేశం చెప్తోంది.


