దినకరన్ వెనక మన్నార్గుడి మాఫియా?
- 28 Views
- admin
- April 29, 2017
- జాతీయం తాజా వార్తలు
జయలలిత ఉన్నన్నాళ్లు ఆమెకు ఎప్పుడు ఆపద వచ్చినా, ఆమె స్థానంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వమే ఉండేవారు. అమ్మ కుర్చీలో తాను కూర్చోకూడదని.. అక్కడ జయలలిత ఫొటోను మాత్రం ఉంచి తాను వేరే కుర్చీలో కూర్చుని పాలన సాగించేవారు. జయలలిత మరణం తర్వాత అలాంటి పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేయడంతో మన్నార్గుడి మాఫియాకు ఎక్కడలేని ఆగ్రహం వచ్చింది. శశికళ – దినకరన్ కలిసి ఎలాగైనా అధికారాన్ని తమ చేతుల్లో ఉంచుకోవాలని భావించారు. దాంతో ముందుగా పళనిస్వామిని రంగంలోకి దించి ఆయనను ముఖ్యమంత్రిగా చేశారు. అందుకోసం బే రిసార్ట్ వద్ద భారీ క్యాంపు నిర్వహించి ఎమ్మెల్యేలను అక్కడే ఉంచారు. ఆ తర్వాత జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ స్థానం నుంచి దినకరన్‌తో పోటీ చేయించి నెమ్మదిగా రాష్ట్ర పగ్గాలను అతడికి ఇప్పించాలన్నది మన్నార్గుడి మాఫియా ప్లాన్. అయితే ఓటర్లకు కనీ వినీ ఎరుగని స్థాయిలో డబ్బులు పంపిణీ చేయడం, అదంతా ఆదాయపన్ను శాఖ అధికారుల దాడుల్లో బయటపడటంతో ఏకంగా ఎన్నిక వాయిదా పడింది. ఆ తర్వాత కొద్దికాలానికే రెండాకుల గుర్తు కోసం ప్రయత్నం జరగడం, అందులో దినకరన్ దొరికిపోవడం లాంటి పరిణామాలు జరిగాయి.