భక్తులకు భోజన సదుపాయం..
భక్తులకు భోజన సదుపాయం
వేపగుంట, ఫీచర్స్ ఇండియా : సింహాచలంలో చందనోత్సవం సందర్భంగా విశాఖ నగర ద్విచక్ర వాహన సంచార వర్తక సేవా సంఘం ఆధ్వర్యంలో అప్పన్న భక్తులకు పులిహోర, భోజన సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమాన్ని నగర కాంగ్రెస్ అద్యక్షులు బెహరా భాస్కరరావు ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. అప్పన్న భక్తులకు పులిహోరతో పాటు భోజన సదుపాయాన్ని కల్పించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ద్విచక్ర సంచార వర్తక సంఘం అధ్యక్షులు బమ్మిడి గంగాధర్, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
గ్రామస్థాయి వ్యవసాయ ప్రణాళిక అవసరం
యలమంచిలి, ఫీచర్స్ ఇండియా: వ్యవసా యాన్ని లాభసాటిగా మార్చుకోవాలంటే ప్రణాళికలు గ్రామస్థాయిలోనే రచించుకోవాలని యలమంచిలి మండల వ్యవసాయాధికారి వి.మోహనరావు అన్నారు. మండలంలోని ఏటికొప్పాక మేజర్ పంచా యతీలో సర్పంచ్ చిరంజీవి ఆధ్వర్యంలో గ్రామసభ జరిగింది. ఈ సందర్భంగా మోహనరావు మాట్లా డుతూ రైతులు వారు వేయబోయే పంటల గురించి క్షుణ్ణంగా అవగాహన పెంచుకోవాలని సూచించారు. కావలసిన విత్తనం, వేయబోయే ఎరువులు, వ్యవ సాయ యంత్ర పనిముట్లు గురించి ఖచ్చితమైన ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రైతులతోపాటు వ్యవసాయ విస్తరణా ధికారి జి.దేముడు, ఫీల్డుమేన్ గోవిందరావు, వీఆర్వోలు ఆర్‌విఎస్‌ఎస్ మూర్తి, వరప్రసాద్‌లు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారం కోసం క్వారీ కార్మికుల రాస్తారోకో
అనకాపల్లిటౌన్, ఫీచర్స్ ఇండియా: మధు కాన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో క్వారీ కార్మికులు శుక్రవారం మార్టూరు క్వారీ రోడ్డు వద్ద రాస్తారోకో నిర్వహించారు. మోదమాంబ మధు కాన్ వర్కర్స్ యూనియన్ తమ సమ స్యలు పరిష్కరించాలంటూ ఎనిమిది రోజులుగా ఆందోళన చేపడుతున్నా సంబంధిత అధికా రులు పట్టించుకోవడం లేదని యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు వడ్డాది శ్రీనివాసరావు, పోలాట్ని నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కార్మికులకు ఎటు వంటి సమస్యలు తలెత్తకుండా చూస్తామని చెప్పిన నాయకులు కనీసం తమ సమస్య లను పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. మధు కాన్ కంపెనీ యాజమాన్యం కార్మికశాఖ తమ ఆందోళనల పట్ల స్పందించక పోవడం దారుణమ న్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కార్మికులు కోరారు. ఈ కార్య క్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాకారపు శ్రీనివాసరావు, బి.శ్రీను, పీవీ శ్రీని వాసరావు, ఓ.రాము, ఎస్.చంద్రశేఖర్ తది తరులు పాల్గొన్నారు.
పదలకు వాసవీ క్లబ్ వస్త్రాలు పంపిణీ
అనకాపల్లిటౌన్, ఫీచర్స్ ఇండియా: వాసవీక్లబ్ అనకాపల్లి రూరల్ విభాగం శుక్రవారం స్థానిక వైఎంవీఏ హాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించింది. అందులో భాగంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు సౌభాగ్య అతికేశవన్ చేతుల మీదుగా పేదలకు దుస్తులు, బియ్యంతో పాటు వేసవిలో ఎండ భారిన పడకుండా గొడుగులను పంపిణీ చేశారు. ఇక్కడ పప్పులవీధిలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వాసవీక్లబ్ జిల్లా గవర్నర్ కె.శేషగిరిరావు, క్లబ్ అధ్యక్షుడు ఎం. ప్రకాశరావు, కార్యదర్శి ఎన్.విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల ధర్నా
అనకాపల్లిటౌన్, ఫీచర్స్ ఇండియా: సమస్యలు పరిష్కారం కోరుతూ ఆర్టీసీ డిపో ఎదుట ఎన్ఎంయూ కార్మికులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ప్రతి కార్మికునికి కనీసం మూడు రోజులు సెలవు ఇవ్వాలని, ఆర్టీసీ స్థలాలను ప్రభుత్వం తీసుకునే విధానాన్ని ఆపాలని, కార్మికుల డీఏ, ఏరియర్స్ తక్షణం చెల్లించాలని, 60 రోజుల సమైక్యాంధ్ర స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలని, ఏకపక్షంగా బస్సులను తగ్గించే విధానానికి స్వస్తి పలకాలని నినాదాలు చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో డిపో యూనియన్ కార్యదర్శి పి.సుధాకర్, యూనియన్ నాయకులు జి.శంకరరావు, ఏవీ రావు, ఎఎన్రావు, పీఎస్ బాబు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి కరాటే పోటీలకు హేమంత్
గాజువాక, ఫీచర్స్ ఇండియా: కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్వర్యం లో జరిగే జాతీయ స్థాయి జూనియర్ కరాటే చాంపియన్ షిప్ పోటీలకు అగ నంపుడికి చెందిన పి.హేమంత ఎంపి
క య్యాడు. న్యూఢిల్లీలో వచ్చే నెల 10 నుండి 14 వరకు జరిగే పోటీ లకు ఆంధ్రప్రదేశ్ తరపున గాజువాక విద్యార్థి ఎంపిక కావడం ఎంతో అనందంగా ఉందని కేఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కరణంరెడ్డి నర్సింగరరావు అన్నారు. ఫౌండేషన్ తరపున విద్యార్థికి ఆర్థిక సహాయం అందజేశారు. గాజువాకలో ప్రతిభ గల క్రీడా కారులకు కొదవ లేదనీ, శిక్షణ ఇస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి, దేశానికి పేరు ప్రతిష్ట లు తీసుకువస్తారన్నారు. ఈ కార్యక్రమంలో కోచ్‌లు వి.రామరావు, ఎండీ తయాజుద్దీన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
చలివేంద్రం ప్రారంభం
గాజువాక ఫీచర్స్ ఇండియా : రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మేయర్, బిజెపి నాయకులు పులుసు జనార్దనరావు అన్నారు. బాలచెరువు రోడ్డులోని సంజీవనగర్ వద్ద పులుసు రాజరాజేశ్వరీ నారాయణమూర్తి మెమోరియల్ చార్టిబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని అయిన ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో డా శేషుప్రసాద్, గరికిన పైడిరాజు, డీవీఎస్ ప్రకాష్, సత్యసాయి సేవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : లండన్‌కు చెందిన బోంటన్ అండ్ లాఫ్టీ సంస్థ, వీరూమామ వీ టీమ్ ఈవెంట్స్ సంయుక్త ఆద్వర్యంలో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటేషన్ నిర్వహిస్తున్నట్లు బోంటన్ అండ్ లాఫ్టీ సంస్థ ప్రతినిధి బిన్నీ తెలిపారు. స్థానిక హోటల్లో దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియాలో పూణే, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా లాంటి 16 రాష్ట్రాల్లో ఈ పోటీలు నిర్వహించా మని, ఇపుడు విశాఖలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బెస్ట్ స్మైల్, బెస్ట్ ఐస్, బెస్ట్ హెయిర్ తదితర విభాగాలో పోటీలు ఉంటాయని, విజేతలకు బంగారు కిరీటంతో పాటు హాంకాంగ్ ఫ్యామిలీ ట్రిప్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వీటీమ్ నిర్వాహకుడు వీరూ మామ తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ మండల అధ్యక్షుడిగా మహాలక్ష్మినాయుడు
సబ్బవరం, ఫీచర్స్ ఇండియా : సబ్బవరం మండల టీడీపీ అధ్య క్షుడిగా మెడతాడ మహాలక్ష్మి నాయుడు ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. మండలంలోని ఆరి పాక గ్రామంలో టీడీపీ మండల సమావేశంలో పెందుర్తి ఎమ్మెల్యే బండారుసత్యనారాయణ మూర్తి సమక్షంలో మహాలక్ష్మినాయుడును ఎన్నుకున్నారు. ప్రస్తుతం అంతకాపల్లి గ్రామానికి ఉపసర్పంచ్‌గా పనిచేస్తున్నారు. ఈ సంద ర్భంగా మహాలక్ష్మినాయుడు మాట్లాడుతూ తనను మండలాధ్యక్షుడ ిగా ఎన్నుకొన్న ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి కృత జ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఇన్చార్జ్ బండారు అప్పలనాయుడు, ఆర్ఈసీఎస్ ఛైర్మన్ కొటాన అప్పారావు, బరణికాన సాయినాధరావు, శరగడం శంకరరావు, పల్లా తాతారావు, కోరాడ శ్రీను, గవర అప్పారావు, ఎంపీటీసీ సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు


